Intinti Ramayanam Today Episode November 29th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం అందరికీ కాఫీ ఇచ్చిన తర్వాత పార్వతి అవని దగ్గరకు వస్తుంది. కుంకుమపువ్వు కలిపిన పాలని పల్లవికి ఇవ్వు అని చెప్తుంది. పల్లవి దగ్గరికి పాలు తీసుకుని అవని వెళ్తుంది. పల్లవి ఇవాళ డాడీ తో ఫోన్ మాట్లాడుతుంది. అబార్షన్ టాబ్లెట్స్ కావాలని చెబుతుంది. అవని విని ఆ టాబ్లెట్స్ మార్చాలని అనుకుంటుంది. డెలివరీ బాయ్ మందులు ఇస్తాడని వాళ్ళ డాడీ తో మాట్లాడింది కదా ఆ మందుల్ని ఎలాగైనా మార్చేసి అబార్షన్ ఇవ్వకుండా చూడాలని అవని అనుకుంటుంది. డెలివరీ బాయ్ టాబ్లెట్స్ తీసుకొని వస్తాడు. మెడికల్ షాప్ అతన్ని అడిగి ఇవి అబార్షన్ టాబ్లెట్స్ అని తెలుసుకుంటుంది. వీటికి బదులుగా విటమిన్స్ టాబ్లెట్స్ ఇవ్వండి అనేసి అడుగుతుంది. ఇక టాబ్లెట్స్ ని తీసుకొని ఇంటికి వస్తుంది. పల్లవి ఎవరో డెలివరీ బాయ్ టాబ్లెట్స్ ఇచ్చారని ఇస్తుంది. ఇవేం టాబ్లెట్స్ పల్లవి అని అడుగుతుంది అవని. పల్లవి ఇది వేసుకుంటే బాబు హెల్దీగా పుడతారని డాక్టర్ చెప్తే డాడీ పంపించారు. టాబ్లెట్స్ మారాయి కదా అని అవని అనుకుంటుంది. కాసేపటికి అవనిని హాస్పిటల్ కు తీసుకొని వెళ్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి వేసుకునింది అబార్షన్ టాబ్లెట్స్ అని డాక్టర్ చెప్తుంది. ప్రస్తుతానికైతే ఆమెకు అబార్షన్ కాకుండా చూశాము అని డాక్టర్ చెప్పగానే అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఎలా ఉందో చూడొచ్చా అని అడిగేసి అందరూ లోపలికి వెళ్తారు. అసలు మన ఇంట్లోకి అబార్షన్ టాబ్లెట్స్ ఎలా వచ్చాయని రాజేంద్రప్రసాద్ ఆలోచిస్తాడు. అవని ఇచ్చింది నేను వేసుకున్నాను అనేసి పల్లవి చెప్పి అవినీకి షాక్ ఇస్తుంది. ఆ మాట వినగానే కమల్ వాళ్ళ బామ్మ రెచ్చిపోతుంది. అవనినీ దారుణంగా తిడుతుంది. ఆస్తి కోసమే ఇదంతా చేస్తున్నావో తన కూతురు ఆరాధ్య కోసం ఆస్తి ఇవ్వాలని ఆలోచించింది అందుకే ఇలా చేసిందని నిందలు వేస్తుంది.. పల్లవికి పిల్లలు పుట్టుకున్న అంటే ఆస్తి మొత్తం తన కూతురికే చెందుతుందిగా అందుకే ఇలా నాటకం ఆడుతుంది అనేసి బామ్మ అంటుంది. ఈ మహాతల్లి పైకి కనిపించే అంత అమాయకురాలు ఏమి కాదు లోపల అన్ని కుట్రలు కుతంత్రాలు ఉన్నాయని బామ్మ నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది.
బామ్మ మాటలు విన్న కమల్ కోప్పడతాడు. మా వదిన గురించి ఇంకొక మాట మాట్లాడితే మర్యాద ఉండదు ముసలి అనేసి ఆమెను తిడతాడు. ఇక పార్వతీ కూడా ఆపండి అత్తయ్య మీరు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటారు అనేసి విసుకుంటుంది. నా మాటలు మీ అందరికీ చేదుగా అనిపించినా అదే నిజం. నిన్న రాత్రి ఏమో కొబ్బరి నూనె పోసి పడేయాలని చూసింది ఇప్పుడేమో ఇలా అబార్షన్ అవ్వాలని టాబ్లెట్స్ ఇచ్చింది అనేసి బామ్మ నెత్తినోరు మొత్తుకొని చెప్తుంది. కానీ రాజేంద్రప్రసాద్ మాత్రం అస్సలు నమ్మడు. నీ వయసుకు తగ్గట్లు మాట్లాడమ్మా ఎందుకిలా మాట్లాడుతున్నావ్ అనవసరంగా అనేసి అంటాడు. రాజేంద్ర ప్రసాద్ ని కూడా వాళ్ళ అమ్మ తిడుతుంది. ఇక అత్తగారికి చక్రధర్ సపోర్ట్ చేస్తాడు. అత్తయ్య అన్నదాంట్లో తప్పేంటి అని చక్రధర్ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. నా కూతురికి ఇప్పుడు ఏం కాలేదు కాబట్టి అంత ఓకే ఏమన్నా అయింటే ఎవరు బాధ్యత అనేసి తిడతాడు. అవని ఎంత చెప్తున్నా వినకుండా అవని పై చక్రధర్ అరుస్తాడు. ఇక రాజేశ్వరి అవని తప్పేం లేదండి అవని అలాంటిది కాదు అనేసి చెప్తున్నా కూడా చక్రధర్ వినకుండా రాజేశ్వర్ని కూడా కలిపి తిడతాడు.. ఇక పల్లవిని రెండు రోజులు తన ఇంటికి తీసుకెళ్తానని రాజేంద్రప్రసాద్ ని అడుగుతాడు. రాజేశ్వరి కూడా ఒక రెండు రోజులు తన మనసుకు పడేంత వరకు అనేసి అనగానే రాజేంద్రప్రసాద్ ఒప్పుకుంటాడు.
ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత అక్షయ్ ను ఏమైనా కావాలంటే నన్ను అడగండి అనేసి అవని అడుగుతుంది. అక్షయ్కి పురమాలుతుంది అవని నీళ్లు ఇస్తుంటే వద్దని పక్కకు తోసేస్తాడు. బయటకు వెళ్లి నీళ్లు తాగేసి లోపలికి వస్తాడు. నేను మీకు నీళ్లు కూడా ఇవ్వకూడదా అనేసి అవని అడుగుతుంది. దానికి అక్షయ్ ఆ నీళ్లలో నువ్వు ఏం కనిపిస్తున్నావో ఎవరికీ తెలుసు అంటాడు. ఉదయం పల్లవికి జరిగింది నేనే అదంతా చేసిందని మీరు అనుకుంటున్నారా అనేసి అనగానే ఏమో ఎవరికి తెలుసు అందరూ అదే అనుకుంటున్నారు కదా అనేసి అక్షయ్ అవనిని బాధ పెడతాడు.. నాకు దేవుడైన మీరే నన్ను నమ్మకుంటే నేను ఎవరికీ చెప్పుకోవాలి ఏమని చెప్పుకోవాలని అవని బాధపడుతుంది. ఇక తర్వాత రోజు ఉదయం అవని పల్లవిని చూడాలని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక రాజేశ్వరి కనిపించగానే ఆమెకు నా తప్పేం లేదు పిన్ని అని చెప్పేసి క్షమాపణలు అడుగుతుంది. కవితను వెళ్లి మాట్లాడుతూ ఉండు అనేసి రాజేశ్వరి కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది. పల్లవి బాగోగులు తెలుసుకుంటున్న అవని అసలు ఇది ఎలా జరిగింది అనేసి అడుగుతుంది.. పల్లవి అవని మాటలు విన్న రాజేశ్వరి పల్లవికి వార్నింగ్ ఇస్తుంది. నువ్విలా ప్రతిదీ చేస్తావని తెలిసి ఉంటే చిన్నప్పుడే నిన్ను చంపేసేదాన్ని.. ఇలా నీ బిడ్డనే చంపాలని అనుకోవడం తెలిసింటే నిన్ను ఈ భూమీదకు తీసుకొచ్చేదాన్నే కాదు.. ఇంకోసారి ఇలాంటివి చేస్తే బాగోదని చెప్తుంది. ఈ విషయాన్నీ పల్లవి చక్రధర్ తో చెబుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..