Divorce -2024: 2024వ ఏడాదికి కేవలం నెల రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ సంవత్సరాన్ని మరుపురాని జ్ఞాపకంగా మలుచుకుంటుంటే, మరి కొందరి జీవితాల్లో మాత్రం 2024 సంవత్సరం చేదు సంవత్సరంగా మిగిలిపోనుంది. ముఖ్యంగా 9 సెలబ్రిటీ జంటలు విడాకులు తీసుకొని అభిమానులకు షాక్ ఇచ్చారు. అంతేకాదు తమ జీవితంలో విషాదాన్ని కూడా నింపుకున్నారు. ఇకపోతే విడాకులు తీసుకొని ఒంటరి అయిన సెలబ్రిటీ జంటలు ఏవో ఇప్పుడు చూద్దాం.
ధనుష్ – ఐశ్వర్య:
కోలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ (Dhanush).. సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth )కుమార్తె ప్రముఖ దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్(Aishwarya Rajinikanth)ను వివాహం చేసుకున్నారు. ఇకపోతే 2004లో వీరిద్దరూ వివాహం చేసుకోగా, ఇద్దరు కుమారులకు కూడా జన్మనిచ్చారు. 18 ఏళ్ల పాటు వైవాహిక బంధంలో కలిసి ఉన్న వీరు ఈ ఏడాది విడాకులు తీసుకొని విడిపోయారు.
హార్దిక్ పాండ్యా – నటాషా స్టాంకోవిచ్ :
ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya), మోడల్ నటాషా స్టాంకోవిచ్ (Natasha stankovic ) విడాకులు తీసుకున్నట్లు ఈ ఏడాది ఐపీఎల్ సమయం నుంచే వార్తలు జోరుగా వినిపించాయి. ఆ తర్వాత టి20 వరల్డ్ కప్ సమయంలో తాత్కాలికంగా ఈ రూమర్స్ కి బ్రేక్ పడినా , ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు. 2020లో డేటింగ్ చేసి మరీ వివాహం చేసుకున్న వీరు అదే ఏడాది ‘అగస్త్య’ అనే కుమారుడికి కూడా జన్మనిచ్చారు. ఇక ఈ ఏడాది ఇద్దరూ విడిపోయారు.
ఏ.ఆర్.రెహమాన్ – సైరాభాను:
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్(AR Rahman), తన భార్య సైరాభాను (Saira Banu) విడాకుల ప్రకటన ఎంతో మందిని ఆశ్చర్యపరిచింది. 1995లో పెద్దల నిర్ణయం మేరకు వివాహం చేసుకున్నారు. కతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలకి కూడా జన్మనిచ్చారు. 29 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ ఇటీవల విడాకులు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
సానియా మీర్జా – షోయబ్ మాలిక్:
ప్రముఖ పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik), భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా(Sania Mirza) పెళ్లి అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. 14 ఏళ్ల పాటు గడిపిన ఈ జంట మధ్య ఒక చిచ్చు జ్వాలలా మారింది. ఇక దాంతో ఇద్దరు విడిపోయారు. ఇకపోతే షోయబ్, సానియా నుంచి విడిపోయిన కొద్ది రోజులకే మరో పాకిస్తానీ నటి అయిన సనా జావెద్ (Sana Javed) ను వివాహం చేసుకున్నారు. ఇకపోతే షోయబ్, సానియా దంపతులకు ‘ఇజాన్’ అనే కుమారుడు జన్మించారు.
ఊర్మిళ – మోసిన్ అక్తర్ మీర్:
ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళ(Urmila), మోసిన్ అక్తర్ మీర్(Mohsin Akhtar Mir) 2016లో ప్రైవేట్ వెడ్డింగ్ చేసుకోగా, 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు విడాకులు తీసుకున్నారు.
జయం రవి – ఆర్తి :
ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి(Jayam Ravi) తన భార్య ఆర్తి (Arti)నుండి విడాకుల ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. 15 ఏళ్ల వైవాహిక బంధం ఈ ఏడాది ముక్కలు అయింది.
జీవి ప్రకాష్ కుమార్ – సైంధవి :
ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్(GV Prakash Kumar), తన చిన్ననాటి స్నేహితురాలైన సైంధవి (Saindhavi) ని 2013లో వివాహం చేసుకున్నారు. అయితే 12 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ ఈ ఏడాది విడాకులు ప్రకటించారు.. సైంధవి సింగర్ అన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇషా డియోల్ – భరత్ తక్తానీ:
బాలీవుడ్ నటి ఇషా డియోల్(Isha Deol) తన భర్త భరత్ (Bharath) నుండి విడాకులు తీసుకున్నారు. 11 ఏళ్ల పాటు సాగిన వివాహ బంధంలో ఇద్దరు కూతుర్లకు జన్మనిచ్చారు. ఇకపోతే వీరి డివోర్స్ పై ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి
మోహిని డే – మార్క్ హార్ట్ సుచ్:
ఏ.ఆర్.రెహమాన్ శిష్యురాలైన మోహిని డే (Mohini Dey) కూడా తన భర్త మార్క్(Mark hartsuch) నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది.