OTT Movie : సమాజంలో డబ్బు, రాజకీయాల శక్తి ఎంత ప్రభావం చూపుతాయో అందరికీ తెలిసిందే. ఈ ప్రభావం న్యాయస్థానాల మీద ఎలా ఉంటుంది. సామాన్యులకి న్యాయం ఎంత కష్టంగా లభిస్తుంది, అనేది ఒక సినిమా రూపంలో చూపించారు మేకర్స్. ఈ స్టోరీ ఒక అమ్మాయి అఘాయిత్యానికి గురయ్యాక, న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతుంది. ఈ కోర్ట్ రూమ్ వార్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
‘చికెన్ కర్రీ లా’ (Chicken curry law) అనేది శేఖర్ సిర్రిన్ దర్శకత్వం వహించిన 2019 హిందీ లీగల్ డ్రామా సినిమా. ఈ చిత్రంలో అశుతోష్ రానా, నటాలియా జానోస్జెక్, నివేదిత భట్టాచార్య, ముఖేష్ హరివాలా నటించారు. ఇది భారతదేశంలో 2019 ఆగస్టు 9న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
మీరా అనే యువతి ఫారిన్ నుండి భారతదేశానికి కెరీర్ కోసం వస్తుంది. ఒక రాత్రి ఆమెను ఒక పవర్ ఫుల్ మినిస్టర్ కొడుకులు, దారుణంగా అఘాయిత్యం చేసి రోడ్డు పక్కన పడేస్తారు. మీరా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటుంది. కానీ మంత్రి పవర్ వల్ల కేస్ రిజిస్టర్ కాదు. పోలీసులు ఆమెను కేసు పెట్టొద్దని బెదిరిస్తారు. ఆమె ఒక అడ్వకేట్ సహాయం తీసుకుని కోర్టులో కేసు ఫైల్ చేస్తుంది. కానీ మంత్రి డబ్బు, రాజకీయ శక్తి యూజ్ చేసి విట్నెస్‌లను కొనేస్తాడు. ఉన్న ఎవిడెన్స్ లను కూడా మిస్ చేస్తాడు.
Read Also : ఏం సినిమా మావా… ఒక్కొక్క సీన్ కు రోమాలు నిక్కబొడుచుకోవడం పక్కా… హార్ట్ వీక్‌గా ఉన్నవాళ్ళు అస్సలు చూడొద్దు
మీరా మీడియా హెల్ప్ తీసుకుంటుంది. ఒక సామాజిక కార్యకర్త ఆమెకు సపోర్ట్ ఇస్తుంది. కోర్టు బ్యాటిల్స్‌లో మీరా మానసికంగా బ్రేక్‌డౌన్ అవుతుంది. కానీ పట్టు వదలకుండా పోరాడుతుంది. ఈ సమయంలో మంత్రి కొడుకులు బెయిల్‌పై బయటకు వచ్చి మీరాను మళ్లీ థ్రెట్ చేస్తారు. మీరా భారతీయ న్యాయ వ్యవస్థ ఎంత కష్టమో తెలుసుకుంటుంది. లాయర్ పోరాడుతాడు కానీ సిస్టమ్ లోపాల వల్ల ఏం చేయలేక పోతాడు. చివరికి మంత్రి కొడుకులకు శిక్ష పడుతుందా ? మీరాకి న్యాయం జరుగుతుందా ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.