Intinti Ramayanam Today Episode October 1st : నిన్నటి ఎపిసోడ్ లో పల్లవి శ్రీకర్ ను బయటకు పంపాలని పల్లవి పక్కా ప్లాన్ తో బయటకు వెళ్లేలా చేస్తుంది. ఈ విషయాన్ని చక్రధర్ తో పల్లవి చెబుతుంది. శ్రీకర్ శ్రీయాలను ఇంటికి తీసుకురావాలని అనుకుంటుంది అవినీ.. కానీ మామయ్యా తోనే శ్రీకర్ ను బయటకు పంపించాను అంటుంది. ఇక చక్రధర్ పల్లవికి సపోర్ట్ చేస్తాడు. ఆ కుటుంబాన్ని ముక్కలు చెయ్యాలి. ఆ ఇంట్లో సంతోషాలు లేకుండా చేస్తానని చెబుతుంది పల్లవి. ఆ గుడ్ న్యూస్ కోసమే ఎదురు చూస్తున్న అని అంటారు. ఆ విషయాన్నీ పల్లవి తల్లీ వింటుంది. నువ్వు నీ కూతురు కలిసి నా అన్నయ్య కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నారా అని చక్రదర్ ను నిలదీస్తుంది.. చక్రధర్, తన భార్యకు మధ్య పెద్ద మాటల యుద్ధమే జరుగుతుంది. పల్లవి జీవితం నాశనం అయ్యేలా చేస్తారా అని తల్లిగా నా కూతురు జీవితాన్ని కాపాడే బాధ్యత నాకుంది అంటూ రాజేశ్వరి అంటుంది. ఇక పల్లవి ని కంట్రోల్లో పెట్టాలని అవని ఆలోచించిస్తుంది అవని.. ఏం చేస్తే పల్లవి ఇలాంటి పనులు చెయ్యకుండా కుటుంబాన్ని ముక్కలు చెయ్యకుండా ఉంటుంది అని అవని ఆలోచిస్తుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. అవని పల్లవిని ఎలా కంట్రోల్ చెయ్యాలని చూస్తుంది. ఇంటిని ముక్కలు అవ్వకుండా చూడాలి అని ఆలోచిస్తుంది. ఇక అక్షయ్ వస్తాడు. ఏంటి ఇంతగా ఆలోచిస్తున్నావు అంటే ఏం లేదండి అంటుంది. అది సరే గానీ ఆఫీస్ కు వెళ్లకుండా వచ్చారు అంటుంది. ఫైల్ మర్చిపోయాను అంటుంది. ఎప్పుడూ నువ్వు ఏది మర్చిపోకుండా వెళ్ళావా అంటుంది.. ఇక అక్షయ్ అవనిని ఎందుకు టెన్షన్ పడుతున్నావ్.. పని లేకుండా ఉంటే టీవీ చూడటం, లేదా నావల్స్ చదువు అని అంటాడు.. అవును నేను నావల రాస్తున్నాను నా కథ లాక్ అయ్యింది. మీకు చెప్తాను మీరు చెప్పండి అంటుంది.. కథను చెబుతుంది.. భర్తపై ప్రేమను కలిగించాలి. అలాగే ఒక బాబు, పాప పుడితే కుటుంబం మీద గౌరవం పెరుగుతుందని చెబుతాడు.
ఇక ఇంట్లో వాళ్లు అందరు సీరియల్ చూస్తారు. రాజేంద్ర ప్రసాద్ వచ్చి సినిమా పెట్టాలని అంటాడు. చక్రధర్ పల్లవికి ఫోన్ చేస్తాడు. మమ్మీ లేదా అని అడుగుతుంది. మీ అమ్మ మనం మాట్లాడుకునేవి మీ అమ్మ విన్నది. నన్ను తిట్టి అక్కడకు వచ్చింది. అందరికీ నిజం చెప్పాలని వచ్చింది. నువ్వు ఏం చేస్తావో తెలియదు. మన గురించి నిజం చెప్పకుండా మీ అమ్మను నువ్వే అపాలి అంటుంది.. పల్లవి టెన్షన్ పడుతుండటం చూసిన అవని ఏంటి పల్లవి టెన్షన్ పడుతున్నావ్ అంటుంది. టెన్షన్ ఏమి లేదు అంటుంది. ఇక అప్పుడే రాజేశ్వరి అక్కడకు వస్తుంది. ఏంటమ్మా బాగున్నావా ఎలా బాగుంటాను నా కూతురు చేస్తున్న పనులకు అంటుంది. అప్పుడే పల్లవి నేను ఫోన్ చెయ్యలేదని ఇలా వచ్చేస్తావా రా ఇద్దరం గదిలోకి వెళ్లి మాట్లాడుకుందాం అని లాక్కొని వెళ్తుంది..
నువ్వు ఇప్పుడు చేస్తుంది ఏంటో నాకు అర్థం కావడం లేదు.. నువ్వు ఇలా చేస్తావా.. పెళ్ళైన తర్వాత అత్తవారి ఇల్లే నీకు పుట్టిన ఇల్లు అంటుంది. ఇప్పుడే ఇదంతా చెబుతాను అంటుంది. అమ్మా నువ్వు చెబితే నేను చేస్తాను అంటుంది. నువ్వు కోరుకున్న ఇంటికే కోడలిగా వచ్చావు. ఇంకేం కావాలి.. ఈ ఇంట్లో వాళ్లు నీకు ఏం అన్యాయం చేశారు. వారిని ఇలా ముక్కలు చెయ్యాలని చూస్తావా అంటూ చెంప పగలగొడుతుంది. మామ్ నాకు దక్కాల్సిన జీవితం నాకు దక్కలేదు. నేను కోరుకున్న జీవితం ఇది కాదు.. శ్రీకర్ బావను ప్రేమించానని నీకు తెలుసు.. తనతో పెళ్లి అని, జీవితం అని ఎన్నెన్నో కలలు కన్నాను. కానీ ఆ పిచ్చోడితో పెళ్లి కాదు.. వాడు నా మెడలో కట్టింది. తాళి కాదు ఉరి తాడు అంటుంది. పల్లవి పెద్ద రచ్చ చేస్తుంది. తల్లిని నిలదీస్తుంది. నువ్వు ప్రేమించిన డాడీని పెళ్లి చేసుకొని హ్యాపిగా ఉన్నావు. నేను మాత్రం ఈ పిచ్చోడితో ఉండాలా.. అందుకే నా జీవితం నాశనం చేసిన వారి పై కక్ష్య పెంచుకున్నాను.. నోరుమూయు అని పల్లవిని రాజేశ్వరి కొడుతుంది. నేను హ్యాపిగా ఉన్నానని అనుకున్నావా.. నా వాళ్లకు దూరం అయి ఎంత నరకం అనుభవించానో నీకు తెలియదు అంటూ చెబుతుంది. మామ్ నువ్వు నా గురించి నిజం చెప్పాలని చూస్తే నేను చచ్చినంత ఒట్టే.. తర్వాత నా శవాన్ని చూస్తావ్ అని పల్లవి సీరియస్ గా వెళ్ళిపోతుంది. పల్లవిని చూసి వచ్చిన అవని పల్లవి పిన్నిగారికి ఏదో జరిగింది. పల్లవి అందుకే సీరియస్ అయ్యిందా అంటూ చెబుతుంది. దానికి అవని పిన్ని ని అడిగి తెలుసుకోవాలని లోపలికి వెళ్తుంది. పిన్ని నువ్వు ఒక పని చెయ్యాలి అంటుంది. ఏంటి చెప్పు అంటూంది.. ఇక పల్లవికి వీళ్ల ప్లాన్ తెలిసిపోతుందా? కమల్ తో శోభనానికి పల్లవి ఒప్పుకుంటుందా? అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..