BigTV English

Jayam Ravi: భర్త కోసం ఎదురుచూస్తున్న ఆర్తి.. షాకింగ్ పోస్ట్ వైరల్..!

Jayam Ravi: భర్త కోసం ఎదురుచూస్తున్న ఆర్తి.. షాకింగ్ పోస్ట్ వైరల్..!

Jayam Ravi : కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న జంటలలో జయం రవి (Jayam Ravi) , ఆర్తి (Aarti) జంట కూడా ఒకటి.15 సంవత్సరాలకు పైగా వైవాహిక జీవితంలో సంతోషంగా గడిపిన ఈ జంట అనూహ్యంగా విడాకులు ప్రకటించి, అందరిని ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరి మధ్య విడాకులు అనడంతో అటు అభిమానులే కాదు ఇటు సినీ ప్రముఖులు కూడా ఒక్కసారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే పరస్పర అంగీకారంతోనే తామద్దరం విడిపోతున్నామంటూ జయం రవి పోస్ట్ చేయగా, తన అనుమతి లేకుండానే విడాకులు ప్రకటన చేశారని, తన భర్తతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను అంటూ ఒక సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశారు ఆర్తి.


ఆమె వల్లే జయం రవి – ఆర్తి విడిపోయారా..?

ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా ప్రముఖ సింగర్ కెనీషా తో ఎఫైర్ పెట్టుకోవడం వల్లే ఆర్తికి , జయం రవి విడాకులు ఇచ్చారు అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. దీంతో కెనీషా కూడా స్పందించి, జయం రవి నాకు బిజినెస్ పార్ట్నర్ మాత్రమే. ఆయనతో ఎటువంటి అక్రమ సంబంధం లేదు. దయచేసి వాళ్ళ విడాకుల గొడవల్లోకి నన్ను లాగకండి అంటూ అభ్యర్థన కూడా చేసుకుంది. మరొకవైపు తనపై కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తాను ఎవరితోనూ రిలేషన్ లో లేనని, కానీ కొన్ని కారణాలవల్లే తన భార్య నుంచి విడాకులు తీసుకున్నానని, ముఖ్యంగా ఈ విడాకుల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు జయం రవి. అంతేకాదు తన ఇంట్లో ఉన్న వస్తువులను తిరిగి తనకు ఇప్పించాలంటూ పోలీసులను కూడా ఆశ్రయించారట . దీంతో చాలామంది ఆర్తి పై అసభ్యకర వార్తలు వైరల్ చేశారు. దీంతో కోపం తెచ్చుకున్న ఆర్తి తన గురించి వస్తున్న ఆరోపణలకు గట్టిగానే రియాక్ట్ అవుతూ ఒక సుదీర్ఘ పోస్ట్ వదిలింది.


మౌనంగా ఉండడం వెనుక అదే కారణం..

ఆర్తి షేర్ చేసిన పోస్ట్ విషయానికొస్తే.. నా పర్సనల్ జీవితం గురించి ఇష్టానుసారంగా ప్రచారాలు చేస్తున్నారు. నన్ను చెడుగా చిత్రీకరించి నిజాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే మౌనంగా ఉంటున్నాను అంటే నేను తప్పు చేశానని కాదు. కేవలం హుందాగా వ్యవహరించాలని అనుకుంటున్నాను. న్యాయవ్యవస్థ పై నాకు పూర్తి నమ్మకం ఉంది. కాబట్టే నేను ఇప్పుడు మౌనంగా ఉన్నాను. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నామని అతడు లేఖ విడుదల చేసినప్పుడు నేను నిజంగానే ఆశ్చర్యపోయాను. అప్పుడు నేను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పటికీ నేను రవితో వ్యక్తిగతంగా మాట్లాడేందుకు అవకాశం ఉంటుందేమో అని ఎదురుచూస్తున్నాను. వివాహ వ్యవస్థకు నేను గౌరవం ఇస్తున్నాను. కాబట్టి మా ఇరువురి ప్రతిష్టను దెబ్బతీసే బహిరంగ చర్చలను నేను ఎంకరేజ్ చేయడం లేదు. నా కుటుంబ క్షేమమే నాకు ముఖ్యము అంటూ తెలిపింది ఆర్తి.

ఆర్తి పై తప్పుడు ఆరోపణలు..

అసలు విషయంలోకి వెళ్తే.. జయం రవి ఆస్తులు మొత్తం ఆర్తి చేతుల్లోనే ఉన్నాయని, తన భర్తను ఇంటి నుంచి బయటకు గెంటేసిందని , అందుకే తన వస్తువులను తిరిగి ఇప్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలోనే ఆర్తి తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలకు స్పందిస్తూ ఇలా సుదీర్ఘ నోట్ ఒకటి వదిలింది ఆర్తి . మరి ఇప్పటికైనా రూమర్స్ కి చెక్ పడుతుందేమో చూడాలి.

 

View this post on Instagram

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×