Bollywood Hero… తాజాగా బాలీవుడ్ స్టార్ ఇంట్లో కాల్పులు జరిగాయని, అందులో ఆ హీరోకి బుల్లెట్ తగిలి గాయమైందని , అందుకే ఆయన హాస్పిటల్ పాలైనట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉంది..? ఏది నిజమో..? ఇప్పుడు ఒకసారి పూర్తిగా చూద్దాం.
గోవిందా ఇంట్లో గన్ మిస్ ఫైర్..
బాలీవుడ్ సీనియర్ నటుడు, శివసేన నాయకుడైన ప్రముఖ సీనియర్ స్టార్ కమెడియన్ గోవిందా (Govinda )ఇంట్లో ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం అనగా అక్టోబర్ 1 అనగా ఈరోజు ఉదయం ప్రమాదవశాత్తు ఇంట్లో గన్ మిస్ ఫైర్ అవడంతో ఆయన మోకాలికి బుల్లెట్ తగిలింది. దీంతో హుటాహుటిన గోవిందా ను ముంబైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు కుటుంబ సభ్యులు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. నటుడు గోవిందా తన లైసెన్స్ రివాల్వర్ ను తీసుకెళ్తుండగా.. అది కాస్త చెయ్యి నుంచి జారిపోయి కింద పడిపోయిందట. దీంతో తుపాకీ పేలి ఆయన మోకాలిలోకి బుల్లెట్ దూసుకు వెళ్లిందని , వెంటనే హాస్పిటల్ కి తరలించగా వైద్యులు చికిత్స అందించి, బుల్లెట్ ను తొలగించినట్లు సమాచారం.
గోవిందా కాలిలోకి దూసుకెళ్లిన బుల్లెట్..
అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని , కానీ కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో హాస్పిటల్లోనే ఉండబోతున్నారని సమాచారం. ఇక ఈ విషయాలను ఆయన పర్సనల్ మేనేజర్ మీడియాతో చెప్పినట్లు తెలుస్తోంది. ఇకపోతే గోవిందా తెల్లవారుజామున 4:45 గంటలకు ఆయన ఇంటి నుంచి కోల్కతాకు బయలుదేరేముందు తన లైసెన్స్ తుపాకిని తనిఖీ చేస్తుండగా ఈ సంఘటన జరిగిందని తెలిపినట్లు స్పష్టం చేశారు. ఇక తుపాకీ మిస్ ఫైర్ కావడం వల్ల బుల్లెట్ మోకాలి లోపలికి వెళ్లిపోయిందని, పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఇకపోతే ఆయన వద్ద ఉన్న తుపాకీ కి లైసెన్స్ ఉందని కూడా పోలీసులు తెలిపారు. ఇక ఈ సంఘటనకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గోవిందా కెరియర్..
గోవిందా విషయానికి వస్తే.. బాలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన హీరోగా, హాస్యనటుడిగా, డాన్సర్ గా, గాయకుడిగా, రాజకీయ నాయకుడిగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. దాదాపు 165 కంటే ఎక్కువ చిత్రాలలో నటించిన ఈయన, తన నటనతో ఏకంగా 12 ఫిలింఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. రెండు ఫిలింఫేర్ ప్రత్యేక అవార్డులు అలాగే ఉత్తమ హాస్య నటుడిగా ఒక ఫిలింఫేర్ అవార్డు లభించింది. 1980 లలో యాక్షన్ హీరో మాత్రమే కాదు బెస్ట్ డాన్సర్ గా కూడా పేరు సొంతం చేసుకున్న ఈయన, మొదటిసారి 1986లో లవ్ 86 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి విజయం అందుకొని ఈయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. రాజకీయ జీవిత విషయానికి వస్తే, 2004లో కాంగ్రెస్లో చేరారు. ఐదుసార్లు అధికారంలో ఉన్న వ్యక్తిపై ఏకంగా 50వేల ఓట్ల తేడాతో ముంబై నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. ఇక 2008 జనవరి 20న రాజకీయాలు వదిలి మళ్లీ నటన జీవితం పై దృష్టి సారించారు.