Illu Illalu Pillalu Today Episode September 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. తిరుపతి మెల్లగా నిద్రలోకి జారుకోవడంతో ఆనంద్ రావు తన పనిని మొదలు పెడతాడు. మొత్తానికి తెల్లవారుజాము కల్లా ఆ చెంబు ని బయటకు తీస్తాడు. అందులోని నగలని శ్రీవల్లి తీసుకుంటుంది కానీ ఆ చెంబుని మాత్రం ఆనందరావు బయటపడేసి వస్తాడు. ఉదయం లేవగానే తిరుపతి చెంబులోంచినా చెయ్యొచ్చేసింది అని ఆనందంతో గంతులు వేస్తూ ఉంటాడు. ఇంట్లోనే వాళ్ళందరినీ సంతోషంగా కేకలు వేస్తూ పిలుస్తాడు. నా చెయ్యి చెంబు లో నుంచి బయటకు వచ్చేసింది అని ఆనందంతో గంతులు వేస్తాడు..అయితే చెంబులోని నగలేవి అని రామరాజు అడుగుతాడు.. చెంబు అయితే వచ్చింది బావ నగలు ఎక్కడ పోయాయో నాకు తెలియదు అని అంటాడు. పక్కనే ఉన్న ఆనందరావు తమ్ముడు గారు బయటికి నడుచుకుంటూ వెళ్లడం నేను చూశానండి అక్కడే ఎక్కడ పోయి ఉంటది అని అనడంతో అందరూ ఇల్లంతా వెతుకులాటం మొదలు పెడతారు. అందరూ ఇల్లంతా వెతికి ఎక్కడా లేదని అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. చెంబుతో పాటుగా ఖరీదైన నగలు పోయాయి ఇప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటారు. శ్రీవల్లి మాత్రం కూల్ గా వచ్చి ఆ నగలను పెట్టుకొని అదృష్టం నాకు లేదు పోతే పోనివ్వండి ఏం చేద్దామని బాధపడుతుంది. ఆ తర్వాత ఆనందరావు కూడా నువ్వేం బాధపడకమ్మా ఎదవ నగలు పోతే పోయినయి అని అంటాడు. కానీ రామరాజు మాత్రం అవేమైనా చిన్నాచితక వస్తువుల నగలు లక్షలు ఖరీదు చేసే నగలు అని అంటాడు.
ఈ దొంగతనం వెనుక ఏదో కుట్ర ఉంది నాకు అర్థమవుతుంది. కచ్చితంగా ఈ నగలను దొంగతనం చేసిన వ్యక్తిని నేను కచ్చితంగా పట్టుకుంటాను అని రామరాజు చాలెంజ్ చేస్తాడు.. నగలను ఎలాగైనా సరే బయటికి తీసుకొస్తాను అని రామరాజు అనడంతో ఆనందరావు శ్రీవల్లిలకు దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపిస్తుంది.. అయినా సరే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే అని రామరాజు పిక్స్ అవుతాడు. మొన్న దొంగతనం జరగడానికి కారణమైంది ఈరోజు ఏకంగా దొంగతనమే జరిగింది అంటే ఏదో జరుగుతుంది కదా పోలీసులు అదేంటో తెలుస్తది అని రామరాజు అంటాడు.
ప్రేమ కరెక్ట్ మావయ్య వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయంటే ఏదో కుట్ర ఉంటుంది మనము తొందరగా మేల్కొని ఈ విషయాలను పోలీసులకు చెప్తే వాళ్లే చూసుకుంటారు అని అంటుంది.. వేదవతి అవునండి ప్రేమ చెప్పింది కూడా కరెక్టే మనం పోలీసులకి కంప్లైంట్ ఇస్తే అసలు దొంగ ఎవరో తెలిసిపోతుంది కదా అని అంటుంది. అయితే వీళ్ళందరూ బయటికి వెళ్తుంటే ఎదురుగా భాగ్యం వస్తుంది. పోయినాయి అనుకున్న నగలు దొరికినాయి అన్నయ్యగారు అని అంటుంది..
అసలు మా ఇంట్లో నగలు పోయిన విషయం మీకు ఎవరు చెప్పారు అని రామరాజు అడుగుతాడు.. మా అమ్మాయి ఫోన్ చేసి చెప్పిందండి. అందుకే నేను మీ ఇంటి దగ్గరికి వచ్చే దారి నుంచి వెతుక్కుంటూ వచ్చాను ఇదిగో ఈ చెంబు పొదల్లో దొరికింది అని అంటుంది. పొదలు ఈ చెంబు దొరకడం ఏంటి దొంగ తీసుకెళ్ళిన చెంబు పొదల్లోనే ఎలా దొరికింది అని రామరాజు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. నగలు తీసుకెళ్తే దొరికిపోతాడని అక్కడ పడేసి వెళ్ళిపోయినాడు అండి క్లారిటీ ఇస్తారు. ఆ తర్వాత మా అమ్మ నన్ను చాలా సార్లు కాపాడింది మా అమ్మ సూపర్ గానే శ్రీవల్లి భాగ్యం పై పొగడ్తల వర్షం కురిపిస్తుంది.
Also Read : మౌనికను ఏడపించిన సంజయ్.. రెచ్చిపోయిన బాలు.. ఊహించని ట్విస్ట్..
ప్రేమకి ఒక కొరియర్ వస్తుంది. అది తీసుకున్న శ్రీవల్లి ప్రేమకి బొకే ఇచ్చారు ఏంటి? అందులో వన్ వీక్ అని రాసి ఉందని అనుకుంటుంది. ఈ విషయాన్ని వెళ్లి ప్రేమని అడుగుతుంది ప్రేమ చెప్పిన సమాధానం పై శ్రీవల్లికి అనుమానం వస్తుంది. ప్రేమ ఏదో పెద్ద మ్యాటర్ ని దాసిపెడుతుంది. అదేంటో కనిపెట్టి ప్రేమకు చుక్కలు చూపించాలి అని శ్రీవల్లి అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..