BigTV English

Anchor UdayaBhanu: కెరియర్ నాశనం అవడం వెనుక వారి హస్తం ఉందా..?

Anchor UdayaBhanu: కెరియర్ నాశనం అవడం వెనుక వారి హస్తం ఉందా..?

Anchor UdayaBhanu:ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఒక వెలుగు వెలిగింది ఉదయభాను (Udhaya bhanu). అయితే వరుస షో లు చేస్తూ స్టార్ స్టేటస్ అందుకున్న సమయంలోనే, సడన్గా ఇండస్ట్రీకి దూరమైంది. దీంతో ఈమెను ఎవరైనా టార్గెట్ చేశారా? తొక్కేసారా? అసలు ఎందుకు ఆమె సడన్గా ఇండస్ట్రీకి దూరం అయ్యింది? అంటూ పలు వాదనలు వినిపించాయి. ఈ క్రమంలోనే అనూహ్యంగా ఒక వార్త తెరపైకి వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..


ఉదయభానును అవమానించిన సునీత..

ఉదయభాను.. ఒకప్పుడు సుమ కనకాల (Suma Kanakala)కు మించిన ఫేమ్ ఉండేది. ఈవెంట్ ఏదైనా సరే తన మాటలతో జోష్ నింపేది. పదుల సంఖ్యలో టీవీ షోలు కూడా చేసింది. చిన్నపిల్లలతో మాట కలిపింది. ఇలా ఎన్నో షోలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మకు, సింగర్ సునీతతో కోల్డ్ వార్ జరిగిందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. సునీత ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్ కి ఉదయభాను వెళితే, అక్కడ అవమానం జరిగిందట. ఈ మేరకు సునితను ఉద్దేశిస్తూ ఉదయభాను పరోక్షంగా కామెంట్లు కూడా చేసింది. అమెరికాలో నిర్వహించిన ఈవెంట్లో సునీత అవమానించింది అని ఉదయభాను తెలిపింది. అయితే ఉదయభాను కామెంట్స్ పై సింగర్ సునీత కూడా స్పందించారు.


ఉదయభాను కామెంట్లకు సునీత కౌంటర్..

సునీత మాట్లాడుతూ.. “ఉదయభానుని నేను అవమానించానని ఆమె ఫీల్ అవుతున్న విషయం నాకు తెలియదు. నాతో సరిగ్గా మాట్లాడేది కాదు. పలకరించినా పక్కకు వెళ్ళిపోయేది. తర్వాత ఒక ఇంటర్వ్యూలో నాపై పరోక్షంగా కామెంట్లు చేయడంతో అప్పుడే నాకు అర్థమైంది. అసలు నా గురించి ఆమె ఏమనుకుంటోంది? నిజానికి ఆ ఈవెంట్ కి నేను ఆమెను అసలు ఇన్వైట్ చేయలేదు. ఆర్గనైజర్స్ హోస్ట్ గా చేయడానికి ఆమెను పిలిపించారు. అయితే ఈవెంట్లో ఉదయభాను వేదిక మీదకు వెళ్తుంటే నా ఆర్కెస్ట్రా నీరసంగా ఉండే ఒక ట్రాజిక్ మ్యూజిక్ కొట్టారట. దాంతో ఆమె అవమానంగా ఫీల్ అయిందట. అయితే నేను ఉదయభానును అవమానించడానికి , జెలసీ ఫీల్ కావడానికి అక్కడ కారణం ఏముంటుంది? ఉదయభాను తనకు తానుగా ఏదో ఊహించుకొని అవమానించారని మాట్లాడడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఆమె ఇండైరెక్టుగా చేసిన కామెంట్లకి మీడియాలో నా పేరు తెరపైకి వచ్చింది”. అంటూ సునీత తెలిపింది. దీంతో ఉదయభాను, సునీత మధ్య మనస్పర్ధలు తలెత్తాయని అందరూ అనుకున్నారు.

ఉదయభాను కెరియర్ అందుకే ఫెయిల్ అయ్యిందా..

అదే సమయంలో ఉదయభానుని కొంతమంది టార్గెట్ చేశారట. అందుకే కెరియర్ లో ఆమె ఎదగకుండా తొక్కేశారు అనే వార్తలు వినిపించాయి. దీనికి తోడు వ్యక్తిగత వివాదాలు కూడా ఆమె కెరియర్ ను దెబ్బతీశాయి అని చెప్పవచ్చు. ఇక గతంలో మాదిరే ఈమెకు అవకాశాలు రావడం లేదు. ఉన్న ఫేమ్ కాస్త తగ్గిపోయింది. ఒకానొక దశలో ఉదయభాను హీరోయిన్గా సినిమాలు కూడా చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. కానీ ఈమధ్య ఇండస్ట్రీలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉండడం గమనార్హం. ఏదిఏమైనా ఉదయభాను లాంటి గొప్ప యాంకర్ ను ఇండస్ట్రీ కోల్పోయింది అని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఉదయభాను టాలెంట్ ని గుర్తించి అవకాశాలు ఇవ్వాలని కూడా కోరుతున్నారు.

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×