E-Paper
Advertisement

న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్…గిల్, శ్రేయ‌స్ అయ్య‌ర్ మ‌ధ్య గొడ‌వ‌లు!

న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్…గిల్, శ్రేయ‌స్ అయ్య‌ర్ మ‌ధ్య గొడ‌వ‌లు!
Advertisement

Gill Vs Iyer:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (Team India vs New Zealand) మధ్య మొదట టి20 సిరీస్ నిర్వ‌హించ‌గా… నిన్నటి వరకు వన్డే సిరీస్ కూడా జరిగింది. అయితే ఈ రెండు టోర్నమెంట్లలో అద్భుతంగా రాణించిన టీమిండియా… రెండు సిరీస్ లు కైవసం చేసుకుంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ లో ఉన్న టీమిండియా, టి20 సిరీస్ కైవసం చేసుకోగా… వన్డే సిరీస్ ను గిల్ సేన దక్కించుకుంది. అయితే చివరి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరించడంతో… ట్రోఫీ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు దీనిపైనే శ్రేయస్ అయ్యర్, కెప్టెన్ శుభ్మ‌న్ గిల్ అభిమానుల మధ్య గొడవ జరుగుతుంది.

న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్…గిల్, శ్రేయ‌స్ అయ్య‌ర్ మ‌ధ్య గొడ‌వ‌లు!

వన్డే సిరీస్ శుభ్మ‌న్ గిల్ కెప్టెన్సీ కారణంగానే వచ్చిందని అతని అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. గిల్ కెప్టెన్సీలో వరుసగా రెండు వ‌న్డే మ్యాచ్ లు గెలిచిన టీమిండియా… శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ కారణంగా నాలుగవ దాంట్లో చిత్తుగా ఓడిపోయిందని ఫైర్ అవుతున్నారు. బౌలర్ల ప్రభావం కారణంగానే ఐదవ వన్డేలో అదృష్టం కొద్ది టీమిండియా గెలిచిందని గిల్ అభిమానులు రెచ్చిపోయి పోస్టులు పెడుతున్నారు. ఇందులో శ్రేయస్ అయ్యర్ సాధించింది ఏమీ లేదని… ముందు రెండు వన్డేలు గిల్ కెప్టెన్సీలో గెలవడంతోనే ట్రోఫీ సాధ్యమైందని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

అయితే ఈ పోస్టులకు శ్రేయస్ అయ్యర్ అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. టీ20 సిరీస్ తమ వాడే గెలిపించాడని… చివరి వన్డేలో కూడా అయ్యర్ కెప్టెన్సీ కారణంగానే టీమిండియా ట్రోఫీ దక్కించుకోగలిగిందని వ్యాఖ్యానించాడు. మిగిలిన రెండు వన్డేల్లో కెప్టెన్సీ చేతగాక.. టెస్ట్ సిరీస్ పేరుతో కావాలనే గిల్ జంప్ అయ్యాడని ఆగ్రహిస్తున్నారు. కానీ శ్రేయస్ అయ్యర్ గెలుపోటములను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడని… అందుకే రెండు ట్రోఫీలు అతని కెప్టెన్సీలోనే వచ్చాయని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వన్డే కెప్టెన్ గా కూడా గిల్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ను చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (IND VS NZ Test Series) మధ్య జరగనున్న రెండు టెస్టుల సిరీస్ షెడ్యూల్ ఇప్పటికే ఖరారు అయింది. ఈ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 19వ తేదీన వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్ట్ షురూ కానుంది.. నవంబర్ 27వ తేదీన రెండవ టెస్టు హాగ్లే ఓవల్ వేదికగా నిర్వహిస్తారు. ఈ టెస్ట్ సిరీస్ కు గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియాపై ప్ర‌తీకారం తీర్చుకుంటా..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా

మ‌ళ్లీ ఐసీసీ ఛైర్మ‌న్ గా జై షానే.. 2030 వ‌ర‌కు టీమిండియా బొచ్చు కూడా పీక‌లేమంటూ త‌న్వీర్ సంచ‌ల‌నం!

ఖ‌వాజా లీక్స్.. 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో రికీ పాంటింగ్ బ్యాట్ స్ప్రింగులు పెట్టాడు!

దీపావ‌ళి నాడే గెలికారు, అందుకే చుక్క‌లు చూపించా…య‌శ్వీర్ గౌడ్ క్లారిటీ

ఇండియాకు మూడ్ వ‌చ్చిన‌ప్పుడల్లా పాకిస్తాన్ జ‌ట్టును చిత్తుగా ఓడిస్తోంది

మా వెధ‌వలు ముందు గెలికారు..అందుకు టీమిండియా కుర్రాళ్లు దూల తీర్చారు

య‌శ్వీర్ గౌడ్ ను చెప్పుల‌తో కొట్టాలి…పాకిస్తాన్ మాజీ మంత్రి సంచ‌ల‌నం!

Big Stories

Advertisement
×