E-Paper
Advertisement

జాను లిరి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ ఏవో తెలుసా?టాప్ ఫోక్ సాంగ్స్ ఇవే!

జాను లిరి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ ఏవో తెలుసా?టాప్ ఫోక్ సాంగ్స్ ఇవే!
Advertisement

Janu Lyri Top Folk Songs:జానులిరి అనే పేరు వింటే అందరికి ముందుగా గుర్తొచ్చే పాట ‘సెనిగ చేన్ల నిలబడి చేతులియ్యవే’. రెండు ఏళ్ల కిందట నెట్టింట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ పాట ఇప్పటికీ ఏకంగా 178 మిలియన్లకు పైగా వ్యూస్ కొల్లగొట్టింది అంటే ఆడియన్స్ ని ముఖ్యంగా ఫోక్ మ్యూజిక్ లవర్స్ ని ఎంతలా ఆకట్టుకుందో అర్థం అవుతుంది.

సంతోష్ యాదవ్ నిర్మించిన ఈ పాటకి అవర్దుతి లక్ష్మణ్ లిరిక్స్ అందించగా ఇపుడు ఫోక్ ఇండస్ట్రీలో మంచి మంచి పాటలు అందిస్తున్న వెంకట్ అజ్మీరా దీనికి మ్యూజిక్ ఇవ్వడం విశేషం.ఇక ఇందులో జాను కి జోడీగా రాజేష్ కనిపించగా అశ్విని ,జోగుల వెంకటేష్ పాడిన ఈ పాటకి అద్భుతమైన స్టెప్పులు కంపోజ్ చేశాడు శేఖర్ వైరస్.

Advertisement

ఇక జాను లిరి కెరీర్ లో చెప్పుకో తగిన మరో ముఖ్యమైన పాట ‘ఆడనెమలి’కాసర్ల శ్యామ్ కలం నుండి జాలు వారిన ఈ పాటకి మంగ్లీ,కనకవ్వలు తమ గొంతుతో ప్రాణం పోశారనే చెప్పాలి. అయితే మదీన్ SK మ్యూజిక్ అందించిన ఈ పాటకి జానులిరి యే స్వయంగా కోరియోగ్రఫీ చేయడం మెచ్చుకోతగ్గ విషయం.

Advertisement

ఇక కేవలం 6 ఏళ్ళల్లోనే ఈ పాట 370 మిలియన్లకి పైగా వ్యూస్ ని కొల్లగొట్టడం చూస్తే పాట గ్రామ గ్రామానా,జనాల నరనరాన ఎంతగా పాకిపోయిందో తెలుస్తుంది.ఇక ఈ పాటని హం చేసుకొని ప్రేక్షకుడు దాదాపు లేదంటే ఆతిశయోక్తి కాదు.

ఇక జాను లిరిని మరింత పాపులర్ చేసిన పాటగా ‘కమలాపురం రోడ్డాట’ ని చెప్పుకోవాలి.మాను కోట ప్రసాద్ , బొమ్మకంటి అర్జున్ రాసిన ఈ పాటకి మదీన్ SK మ్యూజిక్ ఇవ్వగా, గడ్డం సంతోష్, అశ్విన్ యాదవ్ తమ గొంతుతో పాటని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోయారు. ముఖ్యంగా ఇందులో బీట్ కి తగ్గట్టుగా జాను లిరి వేసిన స్టెప్పులు పాటని మరింత పాపులర్ చేశాయి.ఇక ఏడాదిలో ఈ పాట 46 మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టి జాను లిరి సత్తా ఏంటో చూపింది.

 

ఇక ఇప్పడు ఫోక్ సాంగ్స్ కి బాగా పాపులర్ అయిన ఈశ్వర్ సాయి తో చేసిన ఓ వెన్నెల అంటూ చేసిన పాట కూడా వీరికి మంచి పేరే తెచ్చింది. ముఖ్యంగా ఆరు నెలల్లోనే ఈ పాట 27 లక్షల మందికి పైగా చూశారంటే జానులిరి స్టామినా ఏంటో తెలిసిపోతుంది.

ఇక గుట్ట గుట్టా తిరిగే టోడా పాట కూడా జానులిరి క్రేజ్ అమాంతం పెంచిన పాటల్లో ఒకటి. రేలారే శ్యామల పాడిన ఈ పాటకి జానులిరి స్టెప్పులేయడం తో పాటు స్వయంగా తనే కోరియోగ్రఫీ చేయడం విశేషం.ఇక ఈ పాట రిలీజ్ అయిన 6 ఏళ్లలో 136 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది.

 

ఇక ఇదే క్రమంలో జాను లిరి చేసిన చలో చలో కమలమ పాట కూడా ఫోక్ లవర్స్ ని ఎంతగానో కట్టిపడేసిందే. జి యల్ నాందేవ్ రాసి మ్యూజిక్ అందించిన ఈ పాటలో జానుతో పాటు టోనీ కలిసి స్టెప్పులేశాడు.ఎప్పటి లాగే తమ వైన గాత్రాలతో లక్ష్మి, SV మల్లిక్ తేజలు ఈ సాంగ్ ని మరో రేంజ్ కి తీసుకుపోయారు.

 

ఇక పొడి పొడి వాన, చీరలు లేవు ,రైకలు లేవు ,మరదలు పిల్లా అంటూ ఎన్నో ఆల్బమ్స్ తో అదరగొట్టిన జాను లిరి ‘ఆకు పటానకు’ అంటూ మరో ఫోక్ సాంగ్ తో వచ్చేసింది. యశోద అందించిన ఈ ట్యూన్ కి నవీన్ జే మ్యూజిక్ అందించగా స్వామి,ప్రభాలు తమ గొంతుతో పాటని నెక్స్ట్ లెవెల్ లో పెట్టేశారు.ఇక ఈ పాట వచ్చిన 5 రోజుల్లోనే ఏకంగా వన్ మిలియన్ల వ్యూస్ ని దాటేయడం విశేషం.

అలాగే ఈశ్వర్ సాయితో కలిసి చేసిన సీరలు కావలెనా అంటూ మరో చార్ట్ బాస్టర్ ని అందించింది జాను.కొమ్ము నరసింహ రాసిన ఈ పాటకి కృష్ణుడు మ్యూజిక్ అందించగా నర్సింలు , వనిల గుజ్జేటి పాడి మెప్పించారు.ఇక ఇపుడు ఫోక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న లీడింగ్ బాయ్స్ దీనికి కోరియోగ్రఫీ చేయడం విశేషం. ఇక ఈ పాట వచ్చిన ఆరు నెలల్లోనే ఏకంగా వన్ మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుందంటే జాను లిరి ఎంత క్రేజ్ సొంతం చేసుకుందో అర్థం అవుతుంది.

చూడాలి ఫోక్ ఇండస్ట్రీని తనవైన స్టెప్పులతో ఏలుతున్న జాను ముందు ముందు ఎలాంటి సెన్సేషన్ సాంగ్స్ వదులుతుందో !

Tags

Related News

నరేష్ కి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్.. ఈ ట్విస్ట్ ఏంటి సామి!

నవ్య సామి సీరియల్స్ గుడ్ బై చెప్పడానికి కారణమేంటి..?

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి.. మనోజ్ కు పిచ్చి పట్టిందా..? శృతి సీరియస్..

Karthika Deepam 2 Serial Today Episode November 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ కు జ్యోత్స్న నిజం చెప్తుందా..? 

Podarillu Today Episode : మాధవ్ ప్రేమ పాఠాలు.. శైలుకు షాక్.. బాధపడ్డ కన్నా..ఇదే కదా ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న అంజలి.. తాగొచ్చిన చందు.. ధీరజ్ మాటతో షాక్..

Brahmamudi Serial Today Episode November 10th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు స్పాట్ పెట్టిన రేఖ సక్సెస్ అవుతుందా..?  

Big Stories

Advertisement
×