Bigg Boss 10: జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నరేష్ (Naresh ) బిగ్ బాస్ సీజన్ 10లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. ఇక్కడ తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. నామినేషన్స్ లో సరైన పాయింట్ పెట్టి అందరి దృష్టిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. గత కొన్ని వారాలుగా నెగిటివిటీకి చోటు ఇవ్వకుండా ఆడియన్స్ ను అలరించిన నరేష్.. 9వ వారం టాస్క్ లలో సంచాలక్ గా ఫెయిల్ అవ్వడమే కాకుండా తాను ఫెయిల్ అయితే తన ఫ్యామిలీకి బదులుగా ఓడిపోయిన వారు ఫ్యామిలీ హౌస్ లోకి వస్తారు అంటూ ఛాలెంజ్ కూడా విసిరారు. ఇక దాంతో సంచాలక్ గా ఫెయిల్ అయ్యావ్ అని, మీ కుటుంబ సభ్యులు ఎవరూ హౌస్ లోకి రారు అంటూ హోస్ట్ నాగార్జున కచ్చితంగా చెప్పిన విషయం తెలిసిందే. ఇక తన వాళ్లు హౌస్ లోకి రారు అని తెలియడంతో ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు నరేష్.
అలాంటి నరేష్ కి ఇప్పుడు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్. తన సోదరుడు చరణ్ ను హౌస్ లోకి పంపించి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోను నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. 65వ రోజుకు సంబంధించి విడుదల చేసిన మొదటి ప్రోమోలో నరేష్ స్కూల్ టీచర్ గా, మేల్స్ స్కూల్ స్టూడెంట్స్ గా గెటప్ వేసి సందడి చేశారు. ఇంకా సరదాగా సాగిన ఈ టాస్క్ ఆడియన్స్ కు నవ్వులు పూయించింది. ఇక తర్వాత నరేష్ మాట్లాడుతూ.. ఎవరి కుటుంబ సభ్యులు హౌస్ లోకి వస్తున్నారు ?అని అడగగా సడన్గా బజర్ మోగింది. అక్కడ డిటెక్టివ్ స్టైల్ లో చరణ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
కెప్టెన్ వంశీ అతడి చెయ్యి పట్టుకొని హౌస్ లోకి వచ్చారు. ఎవరో వచ్చారు ఇంట్లోకి.. ఎవరు అని ఎక్సైట్మెంట్ గా అడుగుతుండగానే.. నరేష్ వెళ్లి తన సోదరుడిని గుర్తుపట్టేసి హగ్ చేసుకున్నాడు. ఇక తన సోదరుడితో సరదాగా ముచ్చట్లు పెట్టుకొని ధైర్యం ఇచ్చాడు.” నువ్వు ఏడుస్తున్నావంటే మమ్మీ ఏడుస్తుంది. నువ్వు ఏడవకుండా ధైర్యంగా ఆడు” అంటూ సపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఒకరికొకరు అన్నం తినిపించుకొని అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని అందరినీ ఆకట్టుకునేలా చేశారు.
also read: తెలుగు రికార్డులను తిరగరాస్తున్న వారణాసి మూవీ!
ఇకపోతే హౌస్ లోకి మీ వాళ్ళు ఎవరూ రారు అని నరేష్ ని ఏడిపించిన బిగ్ బాస్ ఆ తర్వాత తన సోదరుడిని పంపించి నరేష్ సర్ప్రైజ్ చేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మరి నెక్స్ట్ ప్రోమోలో ఇంకెవరి కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్ హౌస్ లోకి అడుగు పెడతారో చూడాలి.