Jayammu Nischayammuraa: టాలీవుడ్ స్టార్ హీరో జగపతిబాబు(Jagapathi Babu) హీరోగా తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం విలన్ పాత్రలలో నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను భయభ్రాంతులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న జగపతిబాబు వ్యాఖ్యాతగా సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. జయమ్ము నిశ్చయమ్మురా (Jayammu Nischayammu raa)అంటూ సాగిపోయే ఈ కార్యక్రమం ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే రెండు ఎపిసోడ్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
మూడవ అతిథిగా నాచురల్ స్టార్ నాని..
జీ తెలుగులో ప్రసారం కాబోతున్న ఈ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ రావడమే కాకుండా అద్భుతమైన రేటింగ్ కూడా కైవసం చేసుకుంది. ఈ కార్యక్రమం మొదటి ఎపిసోడ్ లో నటుడు నాగార్జున హాజరయ్యారు. రెండో ఎపిసోడ్లో భాగంగా శ్రీ లీల హాజరై సందడి చేశారు. ఇక ఈ ఇద్దరు తమ కెరియర్ గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలు ఫ్యామిలీ విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే తాజాగా మూడవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇక మూడవ ఎపిసోడ్లో భాగంగా ఈ కార్యక్రమానికి న్యాచురల్ స్టార్ నాని(Nani) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
దెబ్బలు తిన్నది నేను కదా…
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జగపతిబాబు నానిని ఎన్నో ప్రశ్నలు వేశారు అసలు మనం మొదటిసారి ఎప్పుడు కలిసామంటూ ప్రశ్న వేయగా మీకు గుర్తుందా అంటూ నాని ఎదురు ప్రశ్న వేశారు. దెబ్బలు నేను తిన్నాను కదా ఎందుకు గుర్తుండదు అంటూ జగపతిబాబు సెటైర్స్ వేశారు. ఇలా ఇద్దరి మధ్య సినిమాల గురించి సరదా సంభాషణ జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి జగపతిబాబు నాని ఫ్రెండ్ ని కూడా ఆహ్వానించారు. క్రష్ గురించి తెలుసుకోవడానికి పిలిపించాను ఇప్పటివరకు ఎంతమందికి ప్రపోజ్ చేసావు నాని అంటూ జగపతిబాబు నిజం రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ ప్రశ్నకు నాని నవ్వుతూ సమాధానం చెబుతూ ఎలా చెప్పాలి అంటూ సిగ్గుపడిపోయారు. అయితే ఎంతమందికి ప్రపోజ్ చేశారు ఏంటి అనే విషయాలు మాత్రం ప్రోమోలో వెల్లడించలేదు. ఇది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.
?igsh=MWV4enJxeXlrM3luYg%3D%3D
ఇక నాని ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ హీరోగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక నిర్మాతగా కూడా వరుస సినిమాలను నిర్మిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్(The Paradise) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చేయేడాది మార్చి 26వ తేదీ ఏకంగా ఎనిమిది భాషలలో విడుదలకు సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమాలో నాని విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. రెండు జడలు వేసుకుని నాని కనిపించిన లుక్ చూస్తుంటే మాత్రం ఈసారి బాక్సాఫీస్ బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యారని స్పష్టమవుతుంది.