BigTV English

Apple Vision Pro vs Vivo Vision: మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్ రంగంలో తీవ్ర పోటీ.. ఆపిల్, వివో ఢీ!

Apple Vision Pro vs Vivo Vision: మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్ రంగంలో తీవ్ర పోటీ.. ఆపిల్, వివో ఢీ!

Apple Vision Pro vs Vivo Vision| మిక్స్‌డ్ రియాలిటీ టెక్నాలజీ రంగంలో భవిష్యత్ ట్రెండ్. ఇటీవల ఆపిల్, వివో కంపెనీలు.. రెండు ప్రీమియం హెడ్‌సెట్లను ప్రకటించాయి. ఈ రెండూ హెడ్ సెట్లు.. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లో కొత్త ఫీచర్లతో వస్తున్నాయి. ఈ హెడ్‌సెట్లు వర్చువల్, రియల్ప్రపంచాలను కలిపి ఒక అద్భుత ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. ఇప్పుడు ఈ రెండింటినీ పోల్చి చూద్దాం.


ధర, అందుబాటు
ఆపిల్ విజన్ ప్రో అమెరికాలో $3,499 (సుమారు ₹2.9 లక్షలు) నుంచి అందుబాటులో ఉంది. వివో విజన్ డిస్కవరీ ఎడిషన్ ధరను వివో ఇంకా అధికారికంగా చెప్పలేదు. కానీ, ఇండస్ట్రీ రిపోర్టుల ప్రకారం.. CNY 10,000 (భారత కరెన్సీలో సుమారు ₹1.21 లక్షలు లేదా $1,395) ఉండవచ్చు. అంటే, ఆపిల్ కంటే వివో హెడ్‌సెట్ దాదాపు సగం ధరకు వస్తుంది. రెండు డివైస్‌లు భారతదేశంలో అధికారికంగా ఇంకా విక్రయాలు ప్రారంభం కాలేదు. చైనాలో వివో విజన్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఆపిల్ విజన్ ప్రో ఇండియాలో త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఆపిల్ విజన్ ప్రో: ప్రీమియం హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్


ఆపిల్ విజన్ ప్రోలో డ్యూయల్ మైక్రో-ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేలు ఉన్నాయి. మొత్తం 23 మిలియన్ పిక్సెల్స్‌తో స్పష్టత, ప్రకాశవంతం ఎక్కువ. ఫోవియేటెడ్ రెండరింగ్ టెక్నాలజీతో ఇమేజ్‌లు మరింత రియల్‌గా కనిపిస్తాయి. ఇది M2 చిప్, కొత్త R1 చిప్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌లు 12 కెమెరాలు, 6 మైక్రోఫోన్లు, 5 సెన్సార్ల నుంచి వచ్చే డేటాను ప్రాసెస్ చేస్తాయి. లిడార్, ట్రూడెప్త్ కెమెరాలతో హ్యాండ్ ట్రాకింగ్, ఎన్విరాన్‌మెంట్ మ్యాపింగ్ సులభం.

ఆపిల్ 12 మిల్లీసెకండ్ల అల్ట్రా-లో లేటెన్సీని ప్రకటించింది. స్పేషల్ ఆడియో, ఆప్టిక్ ఐడీ (ఐరిస్ ఆధారిత సెక్యూరిటీ) లాంటి ఫీచర్లు ఉన్నాయి. గ్లాసెస్ యూజర్లకు జీస్ లెన్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, జూమ్, డిస్నీ లాంటి యాప్‌లు సపోర్ట్ చేస్తాయి. “పర్సోనా” ఫీచర్‌తో యూజర్ ముఖాన్ని 3డీ వెర్షన్‌గా తయారుచేస్తుంది. ఇది ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

వివో విజన్ డిస్కవరీ ఎడిషన్: తక్కువ ధరలో పవర్ ఫుల్ ఫీచర్లు

వివో మొదటి ఎమ్‌ఆర్ హెడ్‌సెట్ ఆపిల్ లాగా కనిపిస్తుంది. గ్లాస్ విజర్, డిటాచబుల్ సీల్స్, బ్రైడెడ్ కేబుల్‌తో ఎక్స్‌టర్నల్ బ్యాటరీ ఉంది. బరువు కేవలం 398 గ్రాములు (ఎమ్‌ఆర్‌లో తేలికైనది). డ్యూయల్ మైక్రో-ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేలు, మంచి కలర్ స్పేస్, డిఫరెన్షియేషన్ ఉన్నాయి. రిజల్యూషన్ 4కే పర్ ఐ అయి ఉండవచ్చు.

స్నాప్‌డ్రాగన్ ఎక్స్‌ఆర్2+ జెన్ 2 చిప్‌తో పనిచేస్తుంది. వివో బ్లూ ఓషన్ పవర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో ఎఫిషియన్సీ ఎక్కువ. 13 మిల్లీసెకండ్ల లేటెన్సీ ఉంది – ఆపిల్‌తో సమానం. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు: 1.5 డిగ్రీ ఐ ట్రాకింగ్, 26 డిగ్రీల డెప్త్‌తో జెస్చర్ కంట్రోల్, 180 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ, 120-ఇంచ్ వర్చువల్ సినిమా స్క్రీన్. 3డీ వీడియో క్యాప్చర్ చేస్తుంది.

స్మార్ట్ డివైస్‌లు లాంటివి ఫోన్లు, పీసీలను డిస్‌ప్లే చేస్తుంది – కానీ కొన్ని టూల్స్ వివో ఫోన్లతో మాత్రమే పనిచేస్తాయి. ఆరిజిన్‌ఓఎస్ విజన్‌పై రన్ అవుతుంది. మల్టీటాస్కింగ్, వీడియోలు, గేమింగ్, యాప్ కాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది.

ఆపిల్ విజన్ ప్రో ప్రీమియం ఫీచర్లు, ఎకోసిస్టమ్‌తో ఆకట్టుకుంటుంది. మరోవైపు వివో విజన్ సరసమైన ధర, తేలిక డిజైన్, పవర్ ఫఉల్ చిప్‌తో పోటీ ఇస్తుంది. వివో ఆపిల్ కంటే 40% తేలిక, ధర తక్కువ. కానీ, ఆపిల్ సాఫ్ట్‌వేర్ మరింత అడ్వాన్స్‌డ్.

భారతదేశంలో రెండూ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మిక్స్‌డ్ రియాలిటీ భవిష్యత్‌ను మార్చేస్తుంది. రెండింటిలో ఏది బెటర్ అనేది మీ అవసరాలు, ప్రాముఖ్యాలను బట్టి నిర్ణయించుకోండి.

Also Read: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

 

Related News

Galaxy Z Fold 6 Discount: శాంసంగ్ టాప్ ఫోల్టెబుల్ ఫోన్ పై భారీ తగ్గింపు.. ఏకంగా రూ52500 డిస్కౌంట్

Pixel 10 Whatsapp: నెట్‌వర్క్ లేకుండా వాట్సాప్ కాల్స్.. ఈ ఫోన్ లో మాత్రమే.. ఎలా చేయాలంటే?

Smartphone Tips: మీ ఫోన్ హ్యాంగ్ అవుతుందా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్

Prepaid Cards: ప్రీపెయిడ్ క్రెడిట్ కార్డు.. క్రెడిట్ స్కోర్ అవసరం లేకుండా సులభ లావాదేవీలు

Google App Changes: ఫోన్‌లో డయలర్‌ ఎందుకు మారింది? పాత పద్దతి కావాలంటే జస్ట్ ఇలా చేయండి

Big Stories

×