E-Paper
Advertisement

కామాక్షి డైరెక్టర్ గా చేసిన సినిమాలేంటో తెలుసా?

కామాక్షి డైరెక్టర్ గా చేసిన సినిమాలేంటో తెలుసా?
Advertisement

Kissik Talks:ప్రముఖ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల (kamakshi Bhaskarla) పొలిమేర(Polimera ) చిత్రంతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ సినిమా సీక్వెల్తో తన స్థాయిని మరింత పెంచుకున్న ఈమె.. ఇప్పుడు మరో స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. అగధ(Agadha ) సినిమాతో తన టాలెంట్ ను బయటపెట్టి అబ్బురపరిచింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks) కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చింది. ఇందులో ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్న కామాక్షి.. తాను డైరెక్టర్గా పనిచేసిన చిత్రాల గురించి కూడా చెప్పుకొచ్చింది.

డాక్టర్ , యాక్టర్ మాత్రమే కాదు డైరెక్టర్ కూడా..

పొలిమేర హిట్, పొలిమేర 2 సూపర్ హిట్.. మరి పొలిమేర 3 ఏంటి ?అని వర్షా ప్రశ్నించగా.. అది బొమ్మ బ్లక్ బాస్టర్ అంటూ కామాక్షి చెప్పుకొచ్చింది. పొలిమేర 3 అప్డేట్ ఏంటి? అంటూ వర్ష ప్రశ్నించగా.. ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా ప్రారంభించారు. యాక్షన్ కింగ్ అర్జున్(Arjun )!కూడా ఇందులో భాగమయ్యారు . ప్రైమరీ కాస్ట్ లో ఆయన కూడా ఒకరు. అంటూ అప్డేట్ ఇచ్చింది. పొలిమేర చూసినప్పుడు ఒక మూడు రోజులు భయంతో సినిమా చూశాను. నటించేటప్పుడు మీకేమనిపించలేదా? అని వర్షా ప్రశ్నించగా “నాకు భయం అనిపించలేదు. ఎందుకంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేశాను” అంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది కామాక్షి.

Advertisement

ALSO READ:చైనాలో కప్పలు, పాములు తినడంపై కామాక్షి రియాక్షన్?

డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన కామాక్షి..

పొలిమేర చిత్రానికి నటిగానే కాకుండా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. పొలిమేర 2 కి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశాను. మా అమ్మ కోపరేషన్ తోనే ఇదంతా జరిగింది. ఇప్పుడు 3 కి రైటింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను.పైగా పొలిమేర 3కి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో భాగం కాలేకపోతున్నాను. ఎందుకంటే అగధ సినిమా ప్రమోషన్ కారణంగా నేను అందులో భాగం కాలేకపోతున్నాను అంటూ అసలు విషయాన్ని చెప్పింది. ఇక మొత్తానికి అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా కామాక్షి పనిచేశానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు . నటిగా, డాక్టర్ గానే కాకుండా ఇప్పుడు డైరెక్టర్ గా కూడా సత్తా చాటుతోంది అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

డైరెక్టర్గా కొత్త సినిమాపై కామాక్షి ప్రకటన..

Advertisement

మరి డైరెక్టర్ గా ఒక కొత్త సినిమా ఎప్పుడు రాబోతోంది అంటూ వర్షా అడగగా.. ఇప్పుడే నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటున్నాను. నా ద్వారా ఎన్నో కథలు, పాత్రలు పోర్ట్రైట్ చేయాలనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత కచ్చితంగా నేను డైరెక్టర్ గా మారి ఒక సినిమాతో మీ ముందుకు వస్తాను . అగధ సినిమా షూటింగ్ సమయంలో కూడా ఎముకలు పేర్చడం, ముగ్గులు వేయడం, దారాలు కట్టడం లాంటివి నేనే స్వయంగా చేసాను అంటూ చెప్పుకొచ్చింది.

 

Related News

Telugu Tv Serials : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ రెండు అవుట్..

Gundeninda GudiGantalu Today episode: అయ్యో.. మనోజ్ కు ఏమైంది..రోహిణికి సపోర్ట్ మనోజ్..

Podarillu Today Episode : కన్నా తల్లి వచ్చేసింది.. మాధవ్ ఎమోషనల్.. నారాయణ సీరియస్..

Karthika Deepam 2 Serial Today Episode October 9th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను దెబ్బ కొట్టేందుకు మాలిని కొత్త ప్లాన్            

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు గుండెపోటు..వల్లి అడ్డంగా ఇరుక్కుందే.. భాగ్యంకు మైండ్ బ్లాక్..

Intinti Ramayanam Today Episode: ప్రణతి, భరత్ ల మధ్య చిచ్చు.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. కమల్ ఏడ్పించేశాడు గా..

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఒకేరోజు ఏకంగా 14 స్ట్రీమింగ్..!

Ninnu kori Serial Today Episode October 9th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ గురించి ఇంట్లో వాళ్లకు నిజం చెప్పిన చంద్ర 

Big Stories

Advertisement
×