E-Paper
Advertisement

అన్-నోన్ యాప్స్‌కు ఈ పర్మిషన్లు ఇస్తున్నారా? మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం!

అన్-నోన్ యాప్స్‌కు ఈ పర్మిషన్లు ఇస్తున్నారా? మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం!
Advertisement

Dangerous phone permissions: ప్రస్తుత డిజిటల్ యుగంలో మన స్మార్ట్‌ ఫోన్ మనతో పాటే.. తిరిగే ఒక మినీ కంప్యూటర్ లాంటిది. బ్యాంకింగ్ యాప్స్ నుంచి సోషల్ మీడియా వరకు అన్నింటికీ ఫోనే ఆధారం. అయితే..మీరు ఎప్పుడైనా గమనించారా? మనం డౌన్‌ లోడ్ చేసే చిన్న చిన్న గేమింగ్ యాప్స్ లేదా ఫోటో ఎడిటింగ్ యాప్స్ కూడా మన కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్ వంటి వివరాలను యాక్సెస్ చేయడానికి పర్మిషన్లు అడుగుతుంటాయి. సైబర్ సెక్యూరిటీ గైడ్‌లైన్స్‌ ప్రకారం, ఫోన్‌లో ఏ పర్మిషన్లు అత్యంత ప్రమాదకరమో, వాటిని ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

1. కెమెరా, మైక్రోఫోన్ పర్మిషన్లు:

అన్నింటికంటే అత్యంత ప్రమాదకరమైన అనుమతుల్లో కెమెరా, మైక్రోఫోన్ మొదటి స్థానంలో ఉంటాయి. ఒక సాధారణ ఫ్లాష్‌ లైట్ యాప్ లేదా క్యాలిక్యులేటర్ యాప్‌కు కెమెరా లేదా మైక్రోఫోన్ యాక్సెస్ ఎందుకు చెప్పండి? కొన్ని మాల్వేర్ యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు తెలియకుండానే మన ఫోటోలను క్యాప్చర్ చేయడం లేదా మనం మాట్లాడుకునే మాటలను రికార్డ్ చేసే ప్రమాదం ఉంది. అందుకే అవసరం లేని యాప్‌లకు ఈ పర్మిషన్లను ఎప్పుడూ ‘Deny’ లేదా ‘Only while using the app’ మోడ్‌లో ఉంచడం చాలా ముఖ్యం.

2. లొకేషన్ యాక్సెస్ :

Advertisement

మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ ఉంటున్నాం అనే లైవ్ లొకేషన్‌ను ట్రాక్ చేసే ఈ అనుమతిని చాలా యాప్స్ దుర్వినియోగం చేస్తుంటాయి. ఫుడ్ డెలివరీ లేదా మ్యాప్స్ లాంటి యాప్స్‌కు లొకేషన్ అవసరమే అయినప్పటికీ, సాధారణ ఈ-కామర్స్ లేదా గేమింగ్ యాప్స్ 24 గంటలు మన లొకేషన్‌ను ట్రేస్ చేయడం ప్రైవసీకి పెద్ద ముప్పు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘Always Allow’ లో ఉన్న యాప్స్ పర్మిషన్లను వెంటనే మార్చడం మంచిది.

3. కాంటాక్ట్స్, స్టోరేజ్ పర్మిషన్లు:

మీ ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు , కాంటాక్ట్ లిస్ట్‌ను పూర్తిగా చదివే పర్మిషన్ ఇది. కొన్ని లోన్ యాప్స్ లేదా ఫేక్ యాప్స్ ఈ పర్మిషన్ తీసుకొని మీ కాంటాక్ట్ నంబర్లకు మెసేజ్‌లు పంపే.. ఘటనలను మనం రోజూ చూస్తూనే ఉన్నాం. యాప్‌నకు ఆ ఫీచర్ అవసరం లేకపోయినా స్టోరేజ్ పర్మిషన్ అడుగుతుందంటే.. అక్కడ డేటా చోరీ జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.

4. యాక్సెసిబిలిటీ పర్మిషన్లు :

Advertisement

ఇది స్మార్ట్‌ ఫోన్ సెక్యూరిటీలో అత్యంత డేంజరస్ పర్మిషన్. ఈ పర్మిషన్ పొందిన యాప్స్ మీ ఫోన్ స్క్రీన్‌పై.. ఏం జరుగుతుందో చూడటమే కాకుండా.. మీ ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్‌గా క్లిక్‌లు చేయగలవు. బ్యాంకింగ్ ఫ్రాడ్స్ చేసే హ్యాకర్లు.. ఈ యాక్సెసిబిలిటీ పర్మిషన్ల ద్వారానే మన ఫోన్‌ను రిమోట్ కంట్రోల్ ద్వారా యాక్సెస్ చేస్తుంటారు. అనధికారిక థర్డ్-పార్టీ యాప్స్‌కు దీన్ని ఎప్పటికీ అనుమతించకూడదు.

Also Read: కళ్లు చెదిరే ఫీచర్లతో..హైయర్ నుంచి ఎల్ఈడీ టీవీలు లాంచ్!

పర్మిషన్లను ఎలా చెక్ చేయాలి?

మీ ఫోన్‌లో ఏ యాప్‌కు ఏ పర్మిషన్ ఉందో చెక్ చేయడానికి ఫోన్ సెట్టింగ్స్‌లోని Apps -> Permission Managerలోకి వెళ్లండి. అక్కడ కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్ ఆప్షన్లను క్లిక్ చేసి, ఏయే యాప్స్ వాటిని వాడుతున్నాయో చెక్ చేయండి. మీకు సందేహం ఉన్న లేదా అనవసరంగా.. పర్మిషన్లు తీసుకున్న యాప్స్ పర్మిషన్లను వెంటనే ఆఫ్ చేయండి లేదా ఆ యాప్‌ను అన్‌ ఇన్‌స్టాల్ చేయండి. దీని వల్ల మీ ప్రైవసీకి ఫుల్ సేఫ్టీ లభిస్తుంది.

చిన్న పొరపాటు కూడా పెద్ద సైబర్ మోసాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతీ కొత్త యాప్‌ను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అవి అడిగే పర్మిషన్లను క్షుణ్ణంగా చదివి ఆమోదించడం ద్వారా మీ డేటాను సురక్షితంగా కాపాడుకోవచ్చు.

Related News

Google Pixel 11పై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.19,000 ఆదా చేసుకునే అవకాశం!

ఇది మామూలు ఫోన్ కాదు భయ్యా.. 200 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో ఒప్పో సరికొత్త రికార్డ్!

Apple Watch Series 11పై అమెజాన్‌లో క్రేజీ డీల్.. యాపిల్ ప్రియులకు ఇంత కంటే మంచి ఛాన్స్ రాదు!

5Gకి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది..త్వరలోనే జియో 6G ఇంటర్నెట్

రూ.25 వేల బడ్జెట్‌లో ఐదు అదిరిపోయే ఫోన్ ఆఫర్లు.. ఏది కొనడం బెస్ట్ అంటే?

ఫేక్ ఇ-ఇన్‌వాయిస్ మెసేజ్‌లతో మోసపోకండి..అసలు,నకిలీ బిల్లులను ఇలా గుర్తించండి!

సమయాన్ని కొలవడంలో సరికొత్త విప్లవం.. న్యూక్లియర్ క్లాక్ ఎలా పనిచేస్తుందో తెలుసా?

డబ్బులు కట్ అయ్యి మనీ పడలేదా?ఈ తప్పులు అస్సలు చేయెద్దు!

Big Stories

Advertisement
×