Kissik talks:బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ షో ఎంత పాపులారిటీ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సుమారుగా 70 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో.. రీసెంట్గా 71వ ఎపిసోడ్ ను కూడా పూర్తి చేసుకుంది. ముఖ్యంగా 71 మంది సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేశారు.. తమకు సంబంధించిన వ్యక్తిగత , సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు ఎన్నో సందేశాలను కూడా తమ అభిప్రాయాలుగా సమాజానికి చేరవేశారు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla)కూడా కిస్సిక్ టాక్స్ (Kissik Talks) కార్యక్రమంలో పాల్గొని.. తన వ్యక్తిగత , వృత్తిపరమైన విషయాలను పంచుకున్న ఈమె.. బిగ్ బాస్ పై కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది.
బిగ్ బాస్ లోకి వెళ్తున్నారంట? అంటూ వర్షా అడగగా.. చాలా సంవత్సరాల క్రితం ముఖ్యంగా నేను ఇండస్ట్రీలోకి వచ్చి అప్పుడప్పుడే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తున్నప్పుడు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత నిర్వాహకులు అనుకొని ఉంటారు ఎన్నిసార్లు పిలిచినా ఈమె రాదు
. ఇక పిలవడం వేస్ట్ అని.. ఇక వాళ్ళు ఎన్నిసార్లు పిలిచినా నేను రిజెక్ట్ చేయడం అలా జరుగుతూనే వచ్చింది. ఇక చివరికి వాళ్లే నన్ను పిలవడం ఆపేశారు అంటూ అసలు విషయం తెలిపింది కామాక్షి.
బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్ చేశారు సరే.. కనీసం బిగ్ బాస్ షో అయినా చూస్తారా? అని వర్షా అడగగా..” నాకంటే మా అన్నయ్య ఎక్కువ చూస్తారు. ముఖ్యంగా రిలాక్సేషన్ కోసం ఆయన ఎక్కువగా ఈ షో చూస్తూ ఉంటారు. నేను రెండు షోలు చూసాను. నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన కోసం బిగ్ బాస్ సీజన్ వన్ చూశాను. ఆ తర్వాత బాబు గోగినేని గారు షోలో చేస్తున్నప్పుడు చూశాను. ఆయన నాకు చాలా క్లోజ్.. అంతకుమించి నేను మళ్ళీ బిగ్ బాస్ షో చూడలేదు” అంటూ కామాక్షి తెలిపింది.
ఇకపోతే అంతా చెప్పింది కానీ ఎందుకు తాను బిగ్ బాస్ ఆఫర్ ను రిజెక్ట్ చేసింది అనే విషయంపై మాత్రం ఆమె స్పందించలేదు బహుశా అప్పుడప్పుడే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాత్రలు చేస్తూ తన కెరియర్ను బిల్డ్ చేసుకుంటుంది కాబట్టి ఆఫర్ రిజెక్ట్ చేసి ఉండొచ్చు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా తాను రిజెక్ట్ చేసినట్లు కామాక్షి తెలిపింది.
also read: గాడ్ ఆఫ్ మాసెస్’ కి పర్ఫెక్ట్ టైటిల్ పడ్డట్టేనా? అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడంటే?
ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం వస్తే సూర్య హీరోగా నటించిన ఆకాశమే హద్దురా సినిమాలో అపర్ణ లాంటి క్యారెక్టర్ కావాలి అంటూ చెప్పుకొచ్చింది.