E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode August 27th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: అందరి ముందు నిజం చెప్పిన జ్యోత్స్న      

Karthika Deepam 2 Serial Today Episode August 27th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: అందరి ముందు నిజం చెప్పిన జ్యోత్స్న      
Advertisement

Karthika Deepam 2 serial today Episode: దశరథ కూతురిలా పెళ్లి చేసుకుంటాను.. దాసు కూతురిలా కొత్త జీవితం మొదలుపెడతానని చెప్తుంది జ్యోత్స్న. పారిజాతం షాక్‌ అవుతుంది. వద్దే చెప్పొద్దు అంటే.. నేను ఎవ్వరి మాట వినను అంటూ చెప్తుంది. మీరేమంటారు నాన్న అని దాసును అడిగితే.. నీ ఇష్టం అమ్మ.. అంటూ చెప్తాడు. అప్పుడే దీప వచ్చి జ్యోత్స్నను టైం అవుతుంది రమ్మని చెప్తుంది. పారిజాతం తాను జ్యోత్స్నతో మాట్లాడాలి తీసుకొస్తాను అని చెబితే.. నేను ఎవ్వరితో మాట్లాడను.. దీప వెళ్దాం పద అంటూ దీపతో వెళ్తుంది.

మధ్యలోకి వెళ్లాక దీప రూంలో  ఏం జరిగిందని అడిగితే.. నేను పెళ్లి ఆయ్యాక వెంటనే నిజం చెప్పేస్తాను అని చెప్పాను అనగానే.. దీప షాక్‌ అవుతుంది. మరి సూరజ్‌ అని అడిగితే.. నా సూరజ్‌ నన్ను ప్రేమించాడు.. నాకు సూరజ్‌ ఉంటే సరిపోతుంది. ఇన్ని రోజులు తల్లి ఉండి కూడా నువ్వు తల్లి ప్రేమను పొందలేకపోయావు.. నేను మనిషిలా మారాను దీప మనిషిలానే బతకాలనుకుంటున్నాను అని చెప్పగానే.. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది..? అంటూ దీప అడిగితే.. ఇప్పుడే చెప్పాలి దీప అందరూ ఉన్నారు..? ఇంత మంచి సందర్భం ఎప్పటికీ రాదు నాలో ఈ మార్పు నీకు నచ్చడం లేదా దీప అని అడగ్గానే.. దీప నచ్చింది అంటూ చెప్పగానే.. నేను నిజం చెప్పగానే ఏం జరిగినా మనిద్దరం మాత్రం తోబుట్టువుల్లాగే ఉందాం.. నన్ను నీ చెల్లిగా చూస్తావు కదూ అంటూ అడగ్గానే.. చూస్తానని దీప ప్రేమగా జ్యోత్స్నను కిస్‌ చేస్తుంది. అప్పుడే సుమిత్ర వచ్చి వాళ్లిద్దరిని తీసుకెళ్తుంది.

Advertisement

పెళ్లిలో కాంచనతో మాలిని గొడవ పడుతుంది. కాళ్లు పని చేయకపోయినా నోరు బాగానే పని చేస్తుందని అంటుంది మాలిని. పరాయి ఇంటి కోడలైన దీప కూడా పెళ్లి కోసం బాగానే కష్టపడుతుంది. అంటూ ఎద్దేవా చేసి మాట్లాడుతుంది. నీలాగా అది తన సొంత ఇల్లే అనుకుంటుంది. సుమిత్ర, దశరథలను సొంత తల్లిదండ్రుల్లా చూసుకుంటుంది. అంటే ఇంకా నయం సొంత ఇల్లే అనుకోలేదు అనగానే.. అనుకుంటే ఏమవుతుంది అంటూ పక్క నుంచి వెళ్తున్న పారిజాతంను పిలిచి ఏం పిన్ని సొంత ఇల్లు అనుకుంటే తప్పేంటి అని అడుగుతుంది. పారిజాతం నాకేం తెలుసు నా టెన్షన్‌తో నేనే చచ్చిపోతున్నాను అంటుంది.

శ్రీధర్‌ కాంచనను మండపం దగ్గరకు వెళ్దాం పద అని తీసుకెళ్తుంటే.. కాంచన పిన్ని మాలిని బాధ్యత నీకు అప్పగిస్తున్నాను చూసుకో అంటూ చెప్పి వెళ్లిపోతుంది. మాలిని, పారిజాతంతో ఈ పెళ్లి ఆపేద్దామా అని అడిగితే.. దాసు వచ్చి అలాంటి పని చేయోద్దని చెప్తాడు. దాసును ఇక్కడ నీకు సొంతం అంటూ ఏదీ లేదు కదా..? అంటూ నిలదీస్తుంది. దీంతో ఇక్కడ మీకంటే నాకు కొంచెం విలువ ఎక్కువే ఉంది అంటూ చెప్పి దాసు వెళ్లిపోతాడు. నీ కొడుకు కూడా శివనారాయణ మాయలోనే ఉన్నాడు అంటూ మాలిని మాట్లాడుతుంటే.. పారిజాతం మాత్రం పెళ్లి తర్వాత జ్యోత్స్న నిజం చెప్తే నా పరిస్థితి ఏంటి అని మనసులో భయపడుతుంది.

Advertisement

అప్పుడే సూరజ్‌, జ్యోత్స్న మెడలో తాళి కడతాడు. అందరూ హ్యాపీగా ఉంటారు. నవవధువులను హోమం చుట్టూ ఏడుడుగులు వేయించాలని పంతులు చెప్పగానే.. జ్యోత్స్న తాను సూరజ్‌ తో ఏడడుగులు వేసే ముందు ఒక నిజం అందరికీ తెలియాలి అంటుంది. ఏం నిజం అని అందరూ ఆశ్చర్యంగా అడిగితే.. దీప అమ్మానాన్న ఎవరో తనకు తెలుసు అని వాళ్లు ఇక్కడే ఉన్నారని చెప్తుంది జ్యోత్స్న. దీంతో అందరూ షాక్‌ అవుతారు. దశరథ, సుమిత్రలను దగ్గరకు పిలిచి దీప అమ్మానాన్న ఎవరో కాదు మీరే అంటూ దీపే మీ సొంత కూతురు అంటూ నిజం చెప్తుంది. జరిగిన విషయాలు మొత్తం చెప్తూ.. జ్యోత్స్న ఎమోషనల్ అవుతుంది. జ్యోత్స్న నిజాలు చెప్తుంటే.. అందరూ ఏమోషనల్ అవుతుంటారు.

నిజం తెలిశాక సుమిత్ర ఎమోషనల్ అవుతూ.. దీప నా కూతురా..? అని అడిగితే.. దశరథ అవును సుమిత్ర జ్యో చెప్పిందే కరెక్ట్‌ అంటాడు. శివరానాయణ షాకింగ్‌ గా దశరథ అని అడిగితే.. అవును నాన్న ఇన్ని రోజులు ఈ నిజం తెలిసినా బయటకు చెప్పలేకపోయాను.. ఇప్పుడు ఈ నిజం దాచాల్సిన అవసరం లేదు.. దీపే నా అసలైన వారసురాలు అంటూ దశరథ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. సుమిత్ర, దీప దగ్గరకు వెళ్లి హగ్‌ చేసుకుని ఏడుస్తుంది. జ్యోత్స్న మాత్రం దీప నేన నీకు ఉన్న రుణంలో ఇప్పుడు కొంత తీర్చుకున్నాను. ఇప్పుడు నువ్వు మీ అమ్మను అమ్మా అని ధైర్యంగా పిలవొచ్చు పిలవు దీపా అని చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

జూనియర్ బాలు అనుకుంటే ఇలా దొరికిపోయాడేంటి.. సరిగమపలో దైవిక్‌కు షాక్!

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Big Stories

Advertisement
×