E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode August 27th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు నగలు కొట్టేసేందుకు పిల్లలు, రాథోడ్ ప్లాన్ 

Nindu Noorella Saavasam Serial Today Episode August 27th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు నగలు కొట్టేసేందుకు పిల్లలు, రాథోడ్ ప్లాన్ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు నగలన్నీ మనోహరికి మిస్సమ్మ చేత ఇప్పిస్తాడు అమర్‌. దీంతో మనోహరి తానేదో సాధించినట్టు ఫీలవుతుంది. అందరూ వెళ్లిపోయాక మిస్సమ్మను ఓదార్చినట్టు తాను గెలిచేసినట్టు మాట్లాడుతుంది. అందుకు మిస్సమ్మ తాను ఇవ్వాలనుకున్నాను కాబట్టే నగలు నీదాకా వచ్చాయి లేదంటే కనీసం నగలు చూసేదానివే కాదు నువ్వు అంటుంది. అందుకు మనోహరి అంటే అమర్‌ మాటనే కాదనేదానివా..? అని అడగ్గానే.. నేను ఆయన మాట కాదనడం కాదు.. ఆయనే నగలు నీకు ఇవ్వకుండా చేసేదాన్ని అనగానే.. ఉత్తి మాటలు చెప్పొద్దు.. ఇవాళ అమర్‌ చేత నగలు ఎలా తీసుకున్నాను

రేపు అమర్‌ను కూడా నీ నుంచి లాగేసుకుంటాను అని మనోహరి చెబితే.. మిస్సమ్మ కోపంగా పగటి కలలు కనకు అంటే.. నీ అక్క నగలు నీ చేతుల మీదుగా నేను తీసుకుంటానని నువ్వు కలగన్నావా..? ఇంకో విషయం ఈ నగలు నీకు తిరిగి ఇవ్వను అంటుంది. అందుకు మిస్సమ్మ కోపంగా ఏయ్‌ పెళ్లి అవ్వగానే తిరిగి ఇస్తానని చెప్పావు కదా..? అంటే.. అసలు పెళ్లి జరిగితే కదా నగలు తిరిగి ఇవ్వడానికని మనోహరి అంటే.. నువ్వు నగలు తిరిగి ఇవ్వకపోతే..చెప్తా నీ కథ అనగానే.. మనోహరి కోపంగా భాగీ నువ్వేం చేయలేవు.. చేతనైతే కొత్తగా ఏదైనా ట్రై చేసుకో అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది.

Advertisement

నగల కోసం ఏదో ఒక ప్లాన్‌ చేయాలని రాథోడ్‌ ఆలోచిస్తాడు. అందుకోసం ఒక దొంగని అమర్‌ ఇంటికి పిలిపిస్తాడు. ఇంటి ముదు రోడ్డు మీద దొంగతో మాట్లాడుతున్న రాథోడ్‌ తనకు ఒక హెల్ప్‌ చేయాలని అడుగుతాడు. అందుకు ఆ దొంగ నేను మీకు హెల్ప్‌ చేయడం ఏంటి సార్‌ అంటాడు. రాథోడ్ నీతో చిన్న పనుంది అంటూ అమర్‌ ఇంట్లో నగలు కొట్టేయాలని చెప్తాడు అందుకు ఆ దొంగ రాథోడ్‌ను అనుమానంగా చూస్తూ.. ఏంటి సార్‌ తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారా..? లేకపోతే నన్ను ఏదైనా కేసులో ఇరికించడానికి ఇలా ప్లాన్‌ చేశారా..? అంటే రాథోడ్‌.. దొంగను తిట్టి ఒకరి ఎమోషన్‌ కోసం ఇదంతా చేస్తున్నామని నువ్వు ఆ నగలు కొట్టేయడం చాలా అవసరం అని చెప్తాడు.

నగలు తీసుకుని రూంలోకి వెళ్లిన మనోహరి అన్ని ఓపెన్‌ చేసి తన మెడలో వేసుకుంటుంది. అప్పుడే డోర్‌ చాటు నుంచి చూస్తున్న యాదమ్మ వామ్మో ఎన్ని నగలు ఉన్నాయో..? మనోహరికి తెలియకుండా ఈ నగలన్నీ కొట్టేయాలని.. నగలు చేతిలో పడ్డాక ఇక ఈ ఇంట్లోంచి మెల్లగా ఎస్కేప్‌ కావొచ్చని అనుకుంటుంది. అందుకోసం ఇవాళ రాత్రికే తాను నగలు కొట్టేయాలని ప్లాన్‌ చేసుకుంటుంది.

Advertisement

మరోవైపు పిల్లలు కూడా రూంలో కూర్చుని నగల గురించి ఆలోచిస్తుంటారు. అంజు నగలు మనోహరికి ఇవ్వడం తనకు నచ్చలేదని ఏడుస్తుంది. ఆకాష్‌, ఆనంద్‌, బుజ్జమ్మ ముగ్గురు కలిసి అంజును ఓదారుస్తారు. అంజు మాత్రం ఆ నగలు కొట్టేసి మిస్సమ్మకు గిఫ్ట్‌గా ఇవ్వాలని చెప్తుంది. అందుకు మిగతా పిల్లలు భయపడతారు. డాడీ తెలిస్తే ఎలా అంటూ అనుమానిస్తే.. అసలు మనం డాడీకి చెప్తే కదా తెలిసేది.. అయినా మనం చిన్న పిల్లలం కాబట్టి మనం నగలు కొట్టేశామనే అనుమానం కూడా ఎవ్వరికీ రాదు అని చెప్తుంది అంజు. ఇక పిల్లలందరూ కలిసి నగలు కొట్టేసేందుకు ప్లాన్ చేస్తారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×