E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode July 23rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని అవమానించిన శివనారాయణ   

Karthika Deepam 2 Serial Today Episode July 23rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని అవమానించిన శివనారాయణ   
Advertisement

Karthika Deepam 2 serial today Episode:  మాలిని తమ ఇంటికి వచ్చిన విషయం శివనారాయణకు ఎవరు చెప్పారని దీప, కాంచనను అడిగితే తానే చెప్పానని ఈ పాటికే మా నాన్న అడుగు ఆ ఇంటి గుమ్మంలో పడి ఉంటుంది అని చెప్తుంది. కట్‌ చేస్తే శివనారాయణ దక్షిణమూర్తి ఇంట్లోకి వెళ్లి గట్టిగా పిలుస్తాడు. దక్షిణమూర్తి వచ్చి రా మిత్రమా నీకు అన్ని మర్యాదలు చేస్తాను అంటూ మాలినిని పిలుస్తాడు. మాలిని వస్తుంది. మనవణ్ని తీసుకుని శివనారాయణ వచ్చాడు అని చెప్పగానే.. మాలిని బాబాయ్‌ కూర్చోండి అంటుంది. శివనారాయణ మాత్రం కార్తీక్‌ అవి అక్కడ పెట్టు అంటూ నేను వచ్చింది ఎందుకో ఈపాటికి నువ్వు అర్థం చేసుకుని ఉంటావు.. అంటూ చెప్పగానే.. శివనారాయణ, దక్షిణమూర్తి మధ్య గొడవ జరుగతుంది.

శివనారాయణ కోపంగా దక్షిణమూర్తిని తిడుతుంటే.. మాలిని మాత్రం కాఫీ, టీ తీసుకుంటారా బాబాయ్‌ అని అడుగుతుంది. శివనారాయణ బాగా అడిగావమ్మా.. వీలైతే చివరలో అడుగు అంటూ మాట్లాడుతుంటాడు.  ఇరు కుటుంబాల మధ్య జరిగిన విషయాలు మాట్లాడుతూ.. మీరు మీకు నిజాయితీ లేదని మరోసారి నిరూపించుకున్నారు.. పోటీలో ఓడిపోయారు.. ఏ ముఖం పెట్టుకుని ఎదురుపడతారు. మళ్లీ నా జోలికి రారేమో అనుకున్నాను.. నా అంచనాను అబద్దం చేస్తూ.. ఉదయాన్నే నా కూతురు ఇంటికి నీ కోడలిని పంపించావు అంటూ తిడుతుంటే.. మాలిని నేనే వచ్చాను బాబాయ్‌ అంటుంది. అందుకు శివనారాయణ కోపంగా నువ్వు వచ్చావా..? లేక మీ మామగారు పంపించారా..? అనేది నాకు అనవసరం అమ్మా రావలసిన పనేంటి..? అని అడిగితే కాంచనను చూడాలనిపించింది అని మాలిని చెబితే ఫ్రూట్స్‌ ఇవ్వాల్సిన పనేంటి… అని శివనారాయణ అడిగితే ఉట్టి చేతులతో నేను ఎవ్వరి ఇంటికి వెళ్లను అని చెప్పగానే.. అయితే బ్లాంక్‌ చెక్‌ ఇవ్వాల్సిన పనేంటి..? అని శివనారాయణ అడిగితే దక్షిణమూర్తి షాక్‌ అవుతాడు.

Advertisement

మాలిని మాత్రం కాంచన ఆర్థిక పరిస్థితి చూసి జాలేసింది అని చెప్పగానే.. తాను బతకలేనని నా కూతురు నీకేమైనా చెప్పిందా అని శివనారాయణ అడగ్గానే.. మాలిని కూల్‌గా తోబుట్టువు లాంటి కాంచన కష్టాలు తెలుసుకోవడానికి గొంతు విప్పనవసరం లేదు బాబాయ్‌ కళ్లు ఉంటే చాలు ఎవ్వరికైనా అర్థం అవుతుంది అనగానే.. అదే వీధిలో మరో నాలుగైదు పెంకుటిల్లు ఉన్నాయి.. ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్లలేదు అంటూ శివనారాయణ అడగ్గానే.. అయితే కూతురును ఆ కష్టాల్లో ఎలా వదిలేశావు అంటూ మాలిని మాట్లాడుతుంటే.. కార్తీక్‌ అడ్డుపడి మీకో నమస్కారం మమ్మల్ని వదిలేయండి.. మాకు మీ మాట సాయం కానీ మీ డబ్బు సాయం కానీ అవసరం లేదు. ఇదే మాట నేను మా ఇంటి దగ్గర కూడా చెప్పగలను కానీ నా తల్లి కోసం ఆగిపోయాను.. అనగానే.. అందుకే నేనొచ్చాను చూడమ్మా మాలిని కాంచన తండ్రి ఇంకా బతికే ఉన్నాడు.. నా కూతురు తీసుకుంటానంటే ఏదైనా ఇవ్వడానికి ఈ తండ్రి సిద్దంగా ఉన్నాడు. కానీ అదే మొండిది నేను ఎప్పుడో అన్న మాట గుర్తు పెట్టుకుని నా దగ్గర ఏమీ తీసుకోవడం లేదు.. మరోసారి నువ్వు కానీ నువ్వు కానీ నా కూతురు ఇంటికి రావాల్సిన అవసరం లేదు.. అయినా నా కూతురు గురించి మాట్లాడటానికి మీరెవరు.. మరోసారి ఇలాంటి పని చేయోద్దని ఆఖరిసారి మర్యాదగా చెప్తున్నాను.. అంటూ శివనారాయణ వెళ్లబోతుంటే..

ఇద్దరిని వెనకేసుకుని వచ్చావంటే గొడవకే వచ్చాననుకున్నాను అనగానే.. గొడవకు కాదు.. నా నిజాయితీకి.. నిలువెత్తు రూపాలు వీళ్లు అది చూపించడానికే వీళ్లను తీసుకొచ్చాను.. అంటూ పెద్ద క్లాస్‌ తీసుకుని మర్యాదగానే వచ్చాను మర్యాదగానే వెళ్తున్నాను.. అంటూ రూపాయి కాయిన్‌ తీసుకుని ఇచ్చిందే తిరిగి ఇవ్వడం నాకు అలవాటు లేదు.. ఎంతైనా రాసుకోమని నా కూతురుకు బ్లాంక్‌ చెక్‌ ఇచ్చావు కదా..? నువ్వు ఆ చెక్‌ మీద ఎంత రాసుకున్నా పైచేయి నాదే ఉంటుంది అంటూ రూపాయి కాయిన్‌ చెక్‌ మీద పెట్టి వెళ్లిపోతాడు.

Advertisement

ఇంటి దగ్గర కాంచన, దీప వచ్చి శివనారాయణ, దక్షిణమూర్తి ఇంటికి వెళ్లారు అని చెప్పగానే.. సుమిత్ర, పారిజాతం భయపడతారు. అక్కడ ఎంత గొడవ జరుగుతుందోనని కంగారుపడుతుంటారు. వాళ్లిద్దరూ ఎదురుపడితే ఏం జరుగుతుందోనని పారిజాతం, సుమిత్ర భయపడుతుంటారు. ఇంతకీ నువ్వు ఇప్పుడెందుకు వచ్చావు కాంచన అని పారిజాతం అడిగితే నాన్నే రమ్మన్నారు.. అందరినీ ఇంటి దగ్గరే ఉండమన్నారు అని కాంచన చెప్పగానే.. పారిజాతం అయ్యో అందరినీ ఇంటి దగ్గరే ఉండమన్నారా..? అక్కడ ఎంత గొడవ జరిగిందో అంటూ భయపడుతుంది. ఇంతలో శివనారాయణ, కార్తీక్‌, సూరజ్‌ ఇంటికి వస్తారు. పారిజాతం భయంతోనే అక్కడేం జరిగిందని అడుగుతుంది. ఒక మనిషికి ఎంతలా బుద్ది చెప్పాలో అంతలా బుద్ది చెప్పాము అంటాడు. మీరు ఎవ్వరూ మాలిని వలలో పడకండి.. మీరు గుడికి వెళ్లినప్పుడు, బయటకు వెళ్లినప్పుడు మీకు ఎదురుపడుతుంది. తన మాటలతో మిమ్మల్ని మాయ చేసి తన పని చేయించుకుంటుంది అని చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda Gudigantalu Meena : కొత్త బిజినెస్ ను స్టార్ట్.. సీరియల్స్ కు గుడ్ చెప్పేస్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై అనుమానం.. బాలుకు నిజం తెలుస్తుందా..?

Podarillu Today Episode : మామ, అల్లుడ్లు కలిసిపోయారు.. చక్రీ పై మహా ప్రేమ.. కేశవకు నిజం తెలుస్తుందా..?

Karthika Deepam 2 Serial Today Episode August 22nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కొత్త వీలునామాతో షాక్ ఇచ్చిన శివనారాయణ         

Illu Illalu Pillalu Today Episodes: అత్తను పొగిడేసిన విశ్వ.. భాగ్యం పై వల్లికి అనుమానం.. ప్రేమ కోసం ధీరజ్ టెన్షన్..

Intinti Ramayanam Today Episode: పల్లవిని చూసి అవని హ్యాపీ.. భానుమతి కక్కుర్తి..పల్లవికి షాకివ్వబోతున్న అశ్విన్..

Brahmamudi Serial Today Episode August 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  మదన్ రూంలో వర్జినల్ రిపోర్ట్స్ పెట్టిన రాజు     

Illu illaalu Pillalu Srivalli : ఇంత షాక్ ఇచ్చిందేంటి..? ఆ ఒక్కటే కారణమా..?

Big Stories

Advertisement
×