E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode August 22nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కొత్త వీలునామాతో షాక్ ఇచ్చిన శివనారాయణ         

Karthika Deepam 2 Serial Today Episode August 22nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కొత్త వీలునామాతో షాక్ ఇచ్చిన శివనారాయణ         
Advertisement

Karthika Deepam 2 serial today Episode: సూరజ్‌ వెంటనే పెళ్లి చేయమనడం అందరూ ఇంట్లో వాళ్లందరూ కూడా హ్యాపీగా ఉండటంతో శివనారాయణ కొత్త తాను రాయించిన కొత్త వీలునామా తీసుకొచ్చి దీపకు ఇస్తాడు. దీప తనకు చదవడం రాదు తాత అంటూ ఆ వీలునామా కార్తీక్‌కు ఇస్తుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. పారిజాతం అసలు వీలునామా ఇప్పుడెందుకు రాయించారు.. అందులో ఏం రాయించారు అని మనసులో టెన్షన్‌ పడుతుంది. వీలునామాలో జ్యోత్స్న రెస్టారెంట్స్‌కు పర్మినెంట్‌ సీఈవో దీపేనని.. దీపను కాదని ఎవరైనా తీసేయాలని చూస్తే.. దీపకు పది కోట్ల రూపాయలు ఇవ్వాలని వీలునామాలో ఉన్నట్టు కార్తీక్ చదువుతాడు. అదంతా విన్న పారు షాక్‌ అవుతుంది. ఇలా వీలునామా ఎందుకు రాశారని కాంచన అడిగితే.. ఇదంతా జ్యోత్స్నే రాయించిందని శివనారాయణ చెప్తాడు.

దీప ఆశ్చర్యంగా జ్యోత్స్న రాయించిందా అని అడుగుతుంది. అవునని నువ్వే శాశ్వతంగా సీఈఓగా ఉండాలనేది తాత కోరిక. అది నా కోరిక కూడా అందుకే ఎప్పుడైనా నేను నిన్ను వద్దు అనుకున్నా కూడా తీసేయలేని నిబంధన పెట్టాను అంటూ జ్యోత్స్న చెప్తుంది. దీప మాత్రం ఆశ్చర్యంగా ఇలా రాయమని నేను అడగలేదు కదా అంటే అడగలేదు కానీ ఇది నేను నీకు ఇచ్చే నా పెళ్లి కానుక అనుకో దీప మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని చెప్తుంటే.. దీప ఆ సీఈవో పదవి తనకు వద్దని తాను ఆ బాధ్యతలు మోయలేనని చెప్తుంది. కానీ సుమిత్ర కూడా దీపే సీఈవోగా ఉండాలని చెప్తుంది. నా కూతురు ఇంతలా మారిపోవడానికి నువ్వు కార్తీక్‌ కారణం మీ ఇద్దరికీ థాంక్స్‌ చెప్తూ.. ఎమోషనల్ అవుతూ.. దీప చేతులు పట్టుకుని నేను ఎప్పుడైనా తెలిసో తెలియకో తప్పుగా మాట్లాడి ఉంటే.. క్షమించు దీప అని అడుగుతుంది. అందుకు దశరథ తల్లి కూతురుకు క్షమాపణ చెప్పకూడదు అంటాడు. దశరథ మాటలకు అందరూ షాక్‌ అవుతారు. దశరథ మాత్రం అదే దీపని కన్యాదానం చేసి తల్లి అయింది కదా..? అని చెప్పగానే.. అందరూ ఊపిరి పీల్చుకుంటారు.

Advertisement

తర్వాత జ్యోత్స్న ఆరు బయట సోపా మీద కూర్చుని సూరజ్‌ గురించి ఆలోచిస్తుంటే.. సూరజ్‌ వెళ్తాడు.. భోజనం చేశావా అని అడిగితే లేదని చెప్తుంది జ్యోత్స్న అలాగే సూరజ్‌ను ఒక మాట ఇవ్వమని అడుగుతుంది. ఏంటని సూరజ్‌ అడిగితే.. నువ్వు నాకు తప్ప మరొకరికి సొంతం కాకూడదు అంటూ సూరజ్‌ చేతిలో చేయి వేసి మాట తీసుకున్నాను అంటుంది. అందుకు సూరజ్‌ నేను ఇవ్వలేదు కదా అంటే నువ్వు ఇచ్చినా నేను తీసుకున్నా ఒక్కటే అంటుంది. త్వరగా పెళ్లి చేసుకుని ఇదే ఇంట్లో హ్యాపీగా ఉందామని జ్యోత్స్న మాట్లాడుతుంది. జ్యోత్స్నను చూసిన సూరజ్‌ నువ్వు ఇంతలా మారిపోతావని అసలు అనుకోలేదు అంటాడు. నన్ను ఇంతలా మార్చేసింది నువ్వే కదా అంటాడు సూరజ్‌. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.

మరుసటి రోజు సూరజ్‌, జోత్స్నల పెళ్లి ముహూర్తం పెట్టడానికి పంతులు ఇంటికి వస్తాడు. అందరూ వచ్చి కూర్చున్నాక పంతులు వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్తాడు. అందుకు సూరజ్‌ ఇంకా ముందు ముహూర్తం ఏం లేదా పంతులు గారు అని అడిగితే.. ఉంది కానీ మీరు పెళ్లి పనులు చూసుకోవడం కష్టం అవుతుంది కదండి అందుకే చెప్పలేదు అంటాడు పంతులు.. సూరజ్‌ మాత్రం ఇంకా ముందు వచ్చే ముహూర్తం చెప్పండి అని అడుగుతాడు. పంతులు పంచాంగం చూసి మరో మూడు రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందని చెప్తాడు. అదే ముహూర్తం ఖాయం చేయమంటాడు శివనారాయణ. పంతులు అలాగేనని చెప్పి లగ్నపత్రిక రాస్తాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

ఫైనాన్షియల్ గొడవలా? పెళ్లి మేటరా?.. రీతూ చౌదరి ఇష్యూపై నోరు విప్పిన డెమోన్ పవన్!

ప్రియాంక జైన్ సీరియల్స్ ఎందుకు మానేసిందో తెలుసా?

బుల్లితెరపై సందడి చేసిన స్వప్న దత్.. ఆ క్రేజీ మూమెంట్ చూసారా?

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నూక రాజు.. రాంప్రసాద్ ను మించిన రెమ్యూనరేషన్!

“బిందెల బిందెలు బావయ్యో”.. మరో ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన మాధురీ రాథోడ్!

పండును ఈ పరిస్థితుల్లో చూస్తే కన్నీళ్లు ఆగవు.. మళ్లీ డ్యాన్స్ చేయగలడా? రికవరీకి ఎంత టైమ్?

బిగ్ బాస్ 10 5వ వారం నామినేషన్ లిస్ట్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

Nindu Noorella Saavasam Serial Today Episode October 6th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి, పార్థును చంపకుండా అమర్ అడ్డుకుంటాడా..? 

Big Stories

Advertisement
×