E-Paper
Advertisement

Podarillu Today Episode : మామ, అల్లుడ్లు కలిసిపోయారు.. చక్రీ పై మహా ప్రేమ.. కేశవకు నిజం తెలుస్తుందా..?

Podarillu Today Episode : మామ, అల్లుడ్లు కలిసిపోయారు.. చక్రీ పై మహా ప్రేమ.. కేశవకు నిజం తెలుస్తుందా..?
Advertisement

Podarillu Today Episode august 22nd: అసలు నువ్వు ఎవరు మా నాన్నని ఎందుకు కిడ్నాప్ చేశావు చెప్పు అని మాధవ్ అడగ్గానే.. అప్పుడే ఇంట్లోకి వచ్చిన తాయారు నేను చెప్తాను అని అంటుంది.. ఇతను మీ అమ్మకి స్వయానా తమ్ముడు.. మీది రక్తసంబంధం సొంత మేనమామే దుర్గా అని తాయారు చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మీ నాన్న మీ అమ్మని చంపేసి వెళ్ళిపోయాడు కదా పగని మనసులో పెట్టుకొని ఉన్నాడు ఇన్నాళ్ళకి మీ నాన్న మళ్ళీ ఆ ఊరికి రావడంతో పగ గుర్తొచ్చింది అని తాయారు చెప్పింది ఆ మాట వినగానే ఇంత భద్ర శతృత్వం ఉందా అని అందరూ ఆలోచిస్తారు.

తాయారు మాటతో దుర్గ కూల్..

ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు మీ అక్క నన్ను ఆడబిడ్డలకు కాకుండా సొంత చెల్లెలు లాగా చూసుకుంది.. ఆ ప్రేమతోనే నేను చెప్తున్నాను అని అనడంతో రుద్ర వాళ్ళ అక్క కోసం ఎమోషనల్ అయిపోతాడు.. మీ అక్క తన వల్ల చచ్చిపోయిందో ఎలా చచ్చిపోయిందో తెలియదు కానీ అతను మాత్రం జైలుకెళ్ళి జైలు జీవితాన్ని అనుభవించి వచ్చాడు కదా ఇంక వదిలేయొచ్చు కదా.. ఎందుకు ఈ పగలు అని తాయారు అంటుంది. తాయారు మాట విన్న రుద్ర తన అక్క లేకపోయినా తన పిల్లలు ఉన్నారు కదా వాళ్లకోసమైనా నేను మారాలి అని ఆలోచిస్తాడు. అందరూ కూడా ఊర్లో పెద్దమనుషులగా అందరికీ మంచి చేసే నువ్వు ఇలా ఆలోచించడం ఏమీ బాగోలేదు అంటూ సలహా ఇవ్వడంతో దుర్గా ఆలోచనలో పడతాడు..

రెచ్చిపోయిన నారాయణ..

Advertisement

నాకోసం మీరంతా వాడిని ప్రాణభిక్ష పెట్టమని అడుగుతున్నారా అలాంటిది నాకొద్దు. రారా చూసుకుందాం బామ్మర్ది అంటూ నారాయణ రెచ్చిపోతాడు.. మీరు నా కోసం ఎవరు ఏమి అడగాల్సిన పనిలేదు.. అలాంటిది నాకు అవసరం లేదు వాడు నాకు ప్రాణదీక్ష పెట్టడం ఏంటి రా రా చూసుకుందాం నువ్వు నేను తెలుసుకుందామని నారాయణ అనగానే… దుర్గ చూశారా మీకోసం వీడు మార్తాడని అనుకున్నాను కానీ మారలేదు అని తన మీద కోపంగానే ఉంటాడు.. మావయ్య మీరు మా నాన్నని దూరం చేయకండి. మా అమ్మ దూరం అవడం వల్ల మమ్మల్ని అందరూ ఎన్ని మాటలు అన్నారో మాకు తెలుసు ఎన్నో బాధలు పడ్డాము. అవమానాలు పడ్డాము. ఇక మమ్మల్ని సంతోషంగా ఉండనివ్వండి అని మాధవనగానే దుర్గ నారాయణతో ఉన్న గొడవని పక్కన పెట్టేస్తాడు.

నారాయణకు మహా కౌంటర్..

ఇక అందరూ కారులో తిరిగి వెళ్లిపోవాలని అనుకుంటారు అప్పుడే.. మహాలక్ష్మి దెబ్బలు బాగా తగిలాయి కదా.. మందులు ఏమైనా కొనుక్కోవాలి అని అంటుంది కానీ తను మాత్రం నారాయణ ఎక్కడైనా వైన్ షాప్ కావాలని అడుగుతాడు. దాంతో మహాలక్ష్మి నేను ఇప్పుడు మీకోసం వైన్ షాప్ కి వెళ్ళాలా అని అంటుంది. ఇక మందులు షాపు దగ్గర ఆపిన తర్వాత చక్రి కోసం మందు కొన్న మహాలక్ష్మి అతనికి రాస్తూ ఉండగా చక్రీ బాధపడతాడు. కానీ మహా మాత్రం చాలా సీరియస్గా చక్రితో అనడంతో చాలా ఫీల్ అవుతాడు.. చక్రీకి డబ్బులు ఎక్కడ తగిలాయి అని తెలుసుకుని మహాలక్ష్మి మందు రాయడం చూసి చక్రీ చాలా ఫీల్ అయిపోతాడు..

నారాయణ నటన సూపర్..

Advertisement

నారాయణ ఇంట్లోకి అడుగుపెట్టగానే వేపకు మండలు తీసుకుని అమ్మవారి లాగానే పూనకం వచ్చినట్లు నటిస్తాడు.. అమ్మవారు మిమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకుని వచ్చింది మీరందరూ సంతోషంగా ఉన్నారు కదా అని అనగానే మహాలక్ష్మి మళ్ళీ ఆ ఊరికి వెళ్తామో లేదో అని అంటుంది. అది మన సొంత ఊరు. మనము ఎక్కడికైనా వెళ్లొచ్చు ఎప్పుడైనా వెళ్లొచ్చు మీరేమీ బాధపడకండి. పెద్దోడికి పెళ్లి కుదిరిన తర్వాత ఒకసారి పెళ్లయిన తర్వాత జంటను తీసుకొని మరొకసారి అక్కడికి వెళ్దాము అని నారాయణ అనగానే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.

నిజం చెప్పేసిన శైలు..

కేశవ ఇంట్లోకి అడుగుపెట్టగానే తేలుతూ మాట్లాడలే నేను వెళ్ళొస్తాను అని అంటాడు. ఇప్పుడే అర్థమవుతుంది ఇంట్లోనే వాళ్ళందరూ కూడా వద్దు అని ఎంత చెప్తున్నా సరే కేశవ్ మాత్రం నేను వెళ్లి తీరాల్సిందే అని మొండిగా వెళ్తాడు.. వెనకాల వెళ్లిన చక్రి వీడు గొడవకి వెళ్తున్నాడు ఏంటి అని అనుకుంటాడు. శైలు వాళ్ళ అన్నయ్యతో కేశవ గొడవపడతాడు.. ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్తారు కానీ కేశవా నాకు ఆ కడుపుకి ఏ సంబంధం లేదు అని చెప్పగానే వరాలు శంకరయ్యతో పాటు అందరూ షాక్ అవుతారు. శైలు నాకు అసలు కడుపు లేదు అని నిజం చెప్తుంది ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: అత్తను పొగిడేసిన విశ్వ.. భాగ్యం పై వల్లికి అనుమానం.. ప్రేమ కోసం ధీరజ్ టెన్షన్..

Related News

ఫైనాన్షియల్ గొడవలా? పెళ్లి మేటరా?.. రీతూ చౌదరి ఇష్యూపై నోరు విప్పిన డెమోన్ పవన్!

ప్రియాంక జైన్ సీరియల్స్ ఎందుకు మానేసిందో తెలుసా?

బుల్లితెరపై సందడి చేసిన స్వప్న దత్.. ఆ క్రేజీ మూమెంట్ చూసారా?

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నూక రాజు.. రాంప్రసాద్ ను మించిన రెమ్యూనరేషన్!

“బిందెల బిందెలు బావయ్యో”.. మరో ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన మాధురీ రాథోడ్!

పండును ఈ పరిస్థితుల్లో చూస్తే కన్నీళ్లు ఆగవు.. మళ్లీ డ్యాన్స్ చేయగలడా? రికవరీకి ఎంత టైమ్?

బిగ్ బాస్ 10 5వ వారం నామినేషన్ లిస్ట్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

Nindu Noorella Saavasam Serial Today Episode October 6th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి, పార్థును చంపకుండా అమర్ అడ్డుకుంటాడా..? 

Big Stories

Advertisement
×