E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode August 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  మదన్ రూంలో వర్జినల్ రిపోర్ట్స్ పెట్టిన రాజు     

Brahmamudi Serial Today Episode August 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  మదన్ రూంలో వర్జినల్ రిపోర్ట్స్ పెట్టిన రాజు     
Advertisement

Brahmamudi serial today Episode: భ్రమరాంబ వెళ్లి రేఖను నిలదీస్తుంటే.. శేషు అడ్డు వెళ్తాడు. భ్రమరాంబ కోపంగా ఏంటి మీరు మీరు ఒక్కటేనా..? అంటుంది. శేషు అవును మా చెల్లెమ్మ నాకు సపోర్ట్‌ నేను చెల్లెమ్మకు సపోర్ట్ అంతేగా చెల్లెమ్మ అనగానే.. రేఖ అవును అన్నయ్య అంటుంది. భ్రమరాంబ మాత్రం కోపంగా కానీ నేను సపోర్ట్‌ చేయను అంటుంది. శేషు కోపంగా అసలు ఏంటే నీ గోల అని అడిగితే.. గోల కాదు నాకు నిజం చెప్పనందుకు కోపం అంటుంది అయినా సరే వదిలేయవే అంటే…

నువ్వెన్ని చెప్పినా నేను వదలను అంటుంది భ్రమరాంబ వదిలేయమంటున్నాడు కదా వదిన వదిలేయోచ్చు కదా అనగానే.. వదిలేయడానికి అసలు తప్పు చేసింది శేషునే..  అంటూ భ్రమరాంబ చెప్పగానే.. రేఖ ఆశ్చర్యంగా ఏంటి అని అడగ్గానే.. భ్రమరాంబ అవును రేఖ మీ అన్నయ్య ఫ్రూట్స్‌ అన్ని డజన్‌ లెక్కన తీసుకురమ్మంటే.. అన్ని ఆఫ్‌ డజన్లు తీసుకొచ్చి మిగతా డబ్బులు నొక్కేశాడు ఇదిగో చూడూ నేను రాసి ఇచ్చిన లిస్ట్‌ అంటూ తన చేతిలో ఉన్న పేపర్‌ తీసి రేఖకు ఇస్తుంది. రేఖ ఆ పేపర్‌ చూసి ఏంటి ఇది ఫ్రూట్స్‌ లిస్టా..? అనుకుంటూ లోపలికి వెళ్లిపోతుంది రేఖ.

Advertisement

రేఖ పరుగెత్తుకుంటూ రాజు దగ్గరకు వెళ్లి ఏయ్‌ రాజు వాళ్ల దగ్గర కూడా లేవు.. అని చెప్పగానే.. లేవు పిన్ని నేను వాళ్ల దగ్గర కూడా పెట్టలేదు.. ఎందుకంటే వాళ్లకు నిజం తెలిసినా నువ్వు ఆపేస్తావు కదా..? అందుకే వాళ్ల దగ్గర పెట్టలేదు అని చెప్పగానే.. మరి ఎవరి దగ్గర పెట్టావు అని రేఖ అడిగితే ఎవరికి తెలియాలో వాళ్ల దగ్గరే పెట్టాను.. ఎవరు తెలిసిన వెంటనే రియాక్ట్ అవుతారో వాళ్ల దగ్గరే పెట్టాను.. అంటూ రాజు చెప్తుంటే.. అసలు ఎవరి దగ్గర పెట్టావో ముందు అది పెట్టు అంటూ కోపంగా అడుగుతుంది రేఖ.. ఆ రిపోర్ట్స్‌ మదన్‌ గదిలో పెట్టానని లక్కీ, మదన్‌ ఇద్దరూ ఒకే గదిలో ఉన్నారు.. వాళ్లిద్దరిలో ఏ ఒక్కరు చూసినా నీకు ప్రమాదమే అంటూ రాజు చెప్పగానే.. రేఖ పరుగెత్తుకుంటూ  మదన్‌ రూంలోకి వెళ్తుంది. అప్పుడే మదన్‌ రిపోర్ట్ తీసుకోబోతుంటే.. రేఖ లాక్కుంటుంది. రేఖను చూసిన మదన్‌, లక్కీ షాక్‌ అవుతారు. రిపోర్ట్‌ చూసి రేఖ షాక్‌ అవుతుంది. ఇవే ఒర్జినల్‌ రిపోర్ట్స్‌ అనుకుంటుంది.

మదన్‌ ఏంటని అడిగితే.. ఏం లేదని నేను చూసుకుంటానని ఇవి నా బ్లడ్‌ రిపోర్ట్స్‌ అని చెప్తుంది. లక్కీ ఏంటి మేడం అని అడగ్గానే.. రేఖ కోపంగా లక్కీని తిట్టి వెళ్లిపోతుంది. రిలాక్స్‌ గా కిందకు వెళ్లి కూర్చుంటే.. రాజు వెళ్లి ఏంటి పిన్ని రిపోర్ట్‌ నీ కొడుకులు చూడలేదా..? అని అడిగితే.. ఏయ్‌ ఈ రిపోర్ట్‌ అడ్డుపెట్టుకునే కదా నన్ను పరుగెత్తించావు.. అంటూ అది చింపేస్తే.. రాజు నవ్వుతూ.. అదే సాప్ట్‌ కాపీ నా మెయిల్‌లో ఉంది. అది ఫ్రింట్ తీసి అందరికి పంపిస్తే.. ఫోన్‌లోనే ఫార్వార్డ్ చేస్తే ఏం చేస్తావు.. ఏమీ చేయలేవు.. అందుకే నీకు మరో అవకాశం ఇస్తున్నాను.. నువ్వే లక్కీ తల్లివి అని ఎంత త్వరగా చెప్తే అంత నీకే మంచిది.. లేదంటే ఏం జరుగుతుందో నీకే వదిలేస్తున్నాను.. నేను చెప్పను అంటూ వెళ్లిపోతాడు రాజు.  అలాగే మెట్ట మీద కూలబడిపోతుంది రేఖ.

Advertisement

అపర్ణ బయటి నుంచి వచ్చి వెటకారంగా చూస్తూ.. ఏంటి రేఖ పరుగెత్తి పరుగెత్తి అలసిపోయావా..? అసలు ఇదంతా కలా..? నిజమా..? అనుకుంటూ ఉండిపోయాను.. అసలు నువ్వేం తప్పు చేశావు.. నా మనవడు ఏం చెబితే.. అది చేస్తున్నావు.. నువ్వు ఏదో చేయకూడని తప్పు చేసి ఉంటావని అర్థం అవుతుంది.. అది ఎప్పుడు బయటపడాలో అప్పుడు బయటపడుతుంది.. కర్మ అన్నది ఎవ్వరినీ వదిలిపెట్టదు అని ఈరోజు నా మనవడి వల్ల నేను కళ్లారా చూశాను.. అని చెప్పగానే.. అయితే లక్కీ గురించి ఆంటీకి తెలియదు అనుకుంటా అని మనసులో అనుకుంటుంది. అపర్ణ కోపంగా నువ్వు ఇంకా అనుభవించేవి చాలా ఉన్నాయి.. అనుభవిస్తావు అంటూ తిట్టి వెళ్లిపోతుంది.

సుభాష్‌ గురించి తెలుసుకోవడానికి హాస్పిటల్‌ కు వెళ్తారు. డాక్టర్‌ ఆయనకు ఆపరేషన్‌ చేయోచ్చని కానీ తర్వాత కూడా ఆయనను చిన్న పిల్లాడిలా చూసుకోవాలని జాగ్రత్తలు చెప్తాడు. తాతయ్య కోసం మేము అన్ని రకాలుగా చూసుకుంటామని చెప్పి వెళ్లిపోతారు. ఇంట్లో అపర్ణ వంట చేస్తుంటే.. ఐశ్వర్య వచ్చి ఈరోజు నా ఫ్రెండ్స్‌ అందరికీ పార్టీ ఇస్తున్నాను. వాళ్లందరికీ వంట చేయాలి. అలాగే కొంచెం డబ్బులు కావాలి అని చెప్తుంది. ఇందు లేదని హాస్పిటల్‌కు వెళ్లిందని ఇందుకు అవన్నీ చేసే టైం లేదని చెప్తుంది అపర్ణ.

అప్పుడే శశి ఫోన్‌ చేసి తాము బయలుదేరుతున్నామని చెప్తాడు. మరి మందు, ఫుడ్‌ అంటూ ఐషు చెబితే.. అవన్నీ నేనే అరైంజ్‌ చేస్తాను.. నువ్వేం వర్రీ కాకు అంటాడు. అదంతా లౌడ్‌ స్పీకర్‌ పెట్టి వినించిన ఐశ్వర్య చూశావా… నేను కోరుకుంటే ఏదైనా నా కాళ్ల దగ్గరకు వస్తుంది. అని చెప్పి వెళ్లబోతుంటే.. శేషు కల్పించుకుని నువ్వు ఆ అబ్బాయితో తాగి తందనాలు ఆడుతే మళ్లీ ఇందు నీ చెంప పగులగొడుతుందేమోనని అంటూ అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

ఫైనాన్షియల్ గొడవలా? పెళ్లి మేటరా?.. రీతూ చౌదరి ఇష్యూపై నోరు విప్పిన డెమోన్ పవన్!

ప్రియాంక జైన్ సీరియల్స్ ఎందుకు మానేసిందో తెలుసా?

బుల్లితెరపై సందడి చేసిన స్వప్న దత్.. ఆ క్రేజీ మూమెంట్ చూసారా?

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నూక రాజు.. రాంప్రసాద్ ను మించిన రెమ్యూనరేషన్!

“బిందెల బిందెలు బావయ్యో”.. మరో ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన మాధురీ రాథోడ్!

పండును ఈ పరిస్థితుల్లో చూస్తే కన్నీళ్లు ఆగవు.. మళ్లీ డ్యాన్స్ చేయగలడా? రికవరీకి ఎంత టైమ్?

బిగ్ బాస్ 10 5వ వారం నామినేషన్ లిస్ట్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

Nindu Noorella Saavasam Serial Today Episode October 6th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి, పార్థును చంపకుండా అమర్ అడ్డుకుంటాడా..? 

Big Stories

Advertisement
×