Karthika Deepam 2 serial today Episode: జ్యోత్స్న డబ్బులు తీసుకుందని కార్తీక్ చెప్పగానే అందరూ షాక్ అవతారు. మాలిని దగ్గర తీసుకున్న రెండు కోట్లలో 25 లక్షలు సూరజ్ బ్లడ్ కోసం వాడిందని.. మిగతా కోటి 75 లక్షలు జ్యోత్స్న అకౌంట్‌లోనే ఉన్నాయని చెప్తాడు. అందరూ షాకింగ్ గా చూస్తుంటారు. ఈ విషయం తనకు దీపకు ముందే తెలుసని కానీ చెప్పే సందర్బం రాలేదు కాబట్టి ఎవ్వరికీ చెప్పలేదని అంటాడు. కార్తీక్ చెప్పడం ఆపేశాక దక్షిణమూర్తి రెచ్చిపోతాడు. విలువల గురించి పెంపకాల గురించి శివనారాయణను తిడుతుంటాడు. ఇది నీ పెంపకం. నువ్వు నీ కొడుకును ఎలా పెంచావో వాడు వాడి బిడ్డను అలాగే పెంచాడు.
కానీ నా కూతురుకు ఇలాంటి ఏమీ తెలియకుండా పెంచాను కాబట్టి రూపాయి ఆశించకుండా పని చేసి బతుకుతుంది అరేయ్ శివనారాయణ ఈరోజుతో నీ బతుకేంటో నీకు అర్థం అయిందనుకుంటాను.. వెళ్లి వెళ్లి ఇంకెక్కడ నీ గొప్పలు చెప్పుకుంటూ బతకొద్దు అంటాడు. శివనారాయణ మౌనంగా వెళ్లిపోతంటే అందరూ వెనకాలే వెళ్తారు. దీప మాత్రం కార్తీక్‌ను కోపంగా చూస్తూ ఉంటుంది. దీపకు నా మీద పీకల దాకా కోపం వచ్చి ఉంటుంది. కానీ ఇలా చేయాలనే నేను అనుకున్నాను చేశాను వీళ్లకు తర్వాత అర్తం అవుతుంది నేను ఇప్పుడు ఎందుకిలా చేశానో అని మనసులో అనుకుంటాడు.
దీప దగ్గరకు వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా మాట్లాడింది నా భర్తేనా అసలు మనం అనుకున్నదేంటి..? నువ్వు చేసిందేంటి బావ పారిజాతం గారు డబ్బు తీసుకుంటే ఆవిడతో అందరి ముందు నిజం చెప్పిద్దాం అనుకున్నాం.. కానీ పారిజాతం చేసిన పనే నువ్వు చేశావు.. మీరందరూ కలిసి జ్యోత్స్నను మానసికంగా చంపేస్తున్నారు బావ. జ్యోత్స్న గురించి అంతా తెలిసిన నువ్వు ఇలా అనడం నాకు నచ్చలేదు బావ.. అంటూ దీప బాధపడుతుంటే.. కార్తీక్ మాత్రం ఇప్పుడే అసలైన ఆట మొదలైంది దీప అని చెప్తే.. ఇది ఆటలా లేదు బావ చెలగాటంలా ఉంది. జ్యోత్స్న జీవితంతో అందరూ కలిసి ఆడుకున్నట్లు ఉంది అంటూ బాధపడుతుంది దీప.
మరోవైపు మాలిని అనుమానంగా ఈ కార్తీక్ గాడు ఏదో పెద్ద ప్లానే చేసినట్టు ఉన్నాడు. ఆ సుమిత్ర, జ్యోత్స్న కుమిలి కుమిలి ఏడవడమే నాకు కావాల్సింది. వాళ్లు ఈ ఇంటికి అసలు రాకూడదు అని మనసులో అనుకుంటుంది. దక్షిణమూర్తి కూడా కార్తీక్ గురించి మనసులో ఆలోచిస్తాడు. ఈ కార్తీక్ ఇప్పుడే అందరి ముందు ఇలా నిజం ఎందుకు చెప్పాడు..ఏదో కారణమే ఉంటుంది అనుకుంటాడు.
ఇంటికి వెళ్లాక సుమిత్ర కోపంగా జ్యోత్స్నను కొడుతూ తిడుతుంది. నువ్వు అసలు మనిషివేనా నా కడుపులో ఎలా పుట్టావే..? కూతురిగా నువ్వు ఓడిపోవడం కాదు.. తల్లిగా నేను ఓడిపోయాను.. రెండు కోట్లకి మనసుని అమ్మేసింది అంటే నేను వినేది నా కూతురి గురించేనా అనిపిస్తుంది అంటూ బాధపడుతుంది. శివనారాయణ మాత్రం ఈ డీల్ సెట్ చేయడానికి ఎవరో రాయబారి ఉన్నారని చెప్పావు కదా ఎవరు..? అని కార్తీక్‌ను అడిగితే.. మన వాళ్లే అంటూ కార్తీక్ చెప్పబోయేంతలో..
పారిజాతం భయంతో నిజం ఒప్పుకుంటుంది. దీంతో శివనారాయణ కోపంగా పారిజాతం గొంతు నులిమి చంపేయబోతుంటే.. పారిజాతం తనకేం తెలియదని జ్యోత్స్న ఎలా చెప్తే అలా చేశానని అంటుంది. ఆ మాటలకు అందరూ జ్యోత్స్నను తిడుతుంటారు. జ్యోత్స్న మౌనంగా ఏడుస్తూనే ఉంటుంది. సుమిత్ర మరింత కోపంగా అసలు జ్యోత్స్న కూతురే కాదు ఇన్నాళ్లు ఎవరో పరాయిదాన్ని పెంచాను అనుకుంటాను అంటూ జ్యోత్స్నను ఇంట్లోంచి వెళ్లిపోమ్మని గెంటేస్తుంది సుమిత్ర.
విన్నావా జ్యోత్స్న ఇదే యదార్థం అని కార్తీక్ అంటాడు. పారిజాతం మొత్తం తన మీదకి నెట్టేయడంతో జ్యోత్స్న చాలా ఏడుస్తుంది. ఇంత దిగజార్చుతావా నన్ను అని శివన్నారాయణ ఏడుస్తాడు. నీ మనసునే ఖరీదు కట్టిస్తావా అమ్మా.. మా మనసులకు కూడా ఖరీదు కట్టాల్సింది అని శివన్నారాయణ అంటాడు. జ్యోత్స్నని వదిలేయండి తను ఇంక భరించలేదు అని దీప అంటుంది. మేం ఇంకా భరించలేం అని సుమిత్ర జ్యోత్స్నని ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్తుంది. నాకు ఇలాంటి దరిద్రపు కూతురు వద్దు.. ఎవరి బిడ్డనో ఇన్నాళ్లు పెంచాను అనుకుంటా. ఇలాంటి కూతురు నాకు వద్దు పోవే అని గెంటేస్తుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.