E-Paper
Advertisement

దీపావ‌ళి రోజున 150 కోట్ల భార‌తీయుల‌కు నిద్ర‌లేకుండా చేశాం…త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

దీపావ‌ళి రోజున 150 కోట్ల భార‌తీయుల‌కు నిద్ర‌లేకుండా చేశాం…త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!
Advertisement

Tanveer Ahmed On IND VS PAK: అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో (ACC Men’s U19 Asia Cup 2026 Tournament) భాగంగా దీపావళి రోజున టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( India U19 vs Pakistan U19, 8th Match) జూనియర్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్ అండర్ 19 జట్టు మూడు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. హంజా జహుర్ అద్భుతంగా రాణించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడంపై పాకిస్తాన్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు రెచ్చిపోయి రియాక్ట్ అవుతున్నారు. దీపావళి రోజున భారతీయులకు పీడకల మిగిల్చామని పేర్కొంటున్నారు.

దీపావ‌ళి రోజున 150 కోట్ల భార‌తీయుల‌కు నిద్ర‌లేకుండా చేశాం – త‌న్వీర్ అహ్మ‌ద్

పాక్ చేతిలో ఓడిపోయిన భార‌త జ‌ట్టుపై త‌న్వీర్ అహ్మ‌ద్ (Tanveer Ahmed) కూడా తన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు. దీపావళి పండుగ రోజున పాకిస్తాన్ అండర్ 19 దెబ్బకు 150 కోట్ల భారతీయులకు నిద్ర లేకుండా పోయిందని ఎద్దేవా చేశాడు. పాకిస్తాన్ అంటేనే చీప్ గా చూస్తున్న భారత్ ను చిత్తుగా ఓడించడం శుభ పరిణామం అన్నాడు. తమ జూనియర్ జట్టు భారత్ పని పట్టిందని… ఈ దెబ్బకు పాకిస్తాన్ బలం ఏంటో ప్ర‌పంచ జ‌ట్ల‌కు అర్థమవుతుందని వెల్లడించాడు. ఇకపై పాకిస్తాన్ తో చాలా పడే ముందు భారత్ ఆచితూచి వ్యవహరించాలని చురకలు అంటించాడు. పాకిస్తాన్ బ‌చ్చాగాళ్ల దెబ్బ‌కు భార‌త్ త‌ల‌దించుకోవాల్సిందేన‌ని ప‌రువు తీశాడు. దీంతో త‌న్వీర్ అహ్మ‌ద్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

ఇక ఎక్క‌డ‌, ఎప్పుడు మ్యాచ్ జ‌రిగినా ఓడిస్తాం

అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీం ఇండియాపై పాకిస్తాన్ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని తన్వీర్ అహ్మద్ వ్యాఖ్యానించాడు. మొన్న హాంకాంగ్ సిక్సెస్ లో భాగంగా టీమిండియాను ఓడించామని.. ఇప్పుడు మరోసారి భారత్ కు పాకిస్తాన్ చేతిలో ఓటమి ఎదురైనట్టు గుర్తు చేశాడు. భవిష్యత్తులో సీనియర్ టీం ఇండియాను కూడా మట్టి కనిపిస్తామని తన్వీర్ అహ్మద్ హెచ్చరించాడు. దానికి 2027 వన్డే వరల్డ్ కప్ వేదిక కానుంది అని పేర్కొన్నాడు. ఆ టోర్నమెంట్ లో క‌నీసం మూడు మ్యాచ్ లు టీమిండియాతో పాకిస్తాన్ తలబడ‌నుంద‌ని వెల్లడించాడు. ఎక్కడ, ఎప్పుడు మ్యాచ్ జరిగినా, పాకిస్తాన్ విజయం సాధిస్తుందని… గ్రూప్ పేజీ లోనే టీమిండియాను వెల్లగొట్టేందుకు తాము ప్రయత్నిస్తామని తన్వీర్ అహ్మద్ స్పష్టం చేశాడు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

Related News

దీపావ‌ళి రోజున అడ్డంగా దొరికిన ధోని భార్య సాక్షి..రొమాంటిక్ ఫోటోలు లీక్!

ఒరేయ్ ర‌జ‌త్ పాటిద‌రా.. RCB కోసం టీమిండియా ఛాన్స్ వ‌దులుకుంటావా?- హర్ష భోగ్లే ఫైర్‌

అర్థ సెంచ‌రీ అని రాసి శ‌త‌కం బాదేశాడు.. పాక్ ప్లేయ‌ర్ ‘పేప‌ర్ నోట్’ సెల‌బ్రేష‌న్ వైర‌ల్

సెంచ‌రీతో చెల‌రేగిన హంజా జహూర్…పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోర ఓట‌మి

టీమిండియా కొంప‌ముంచిన నో-బాల్…పాకిస్తాన్, అంపైర్ల మ‌ధ్య ఫిక్సింగ్ అంటూ!

ఆసియా క‌ప్ లో న‌వ్వుల పాలైన పాకిస్తాన్..షోయ‌బ్ మాలిక్-ఆజ్మ‌ల్ క్యాచ్ మిస్ సీన్ రిపీట్

పెళ్లికి పిల్ల దొర‌క‌డం లేద‌ని బాబ‌ర్ త‌ల్ల‌డిల్లిపోతున్నాడు…అందుకే బ్యాట్ ను నేల‌కేసి కొట్టాడు

Big Stories

Advertisement
×