Lakshmi Nivasam Serial Actress Antara Swarnakar: మౌనరాగం, లక్ష్మీనివాసం సీరియళ్లతో బుల్లితెరపై ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది బెంగాలీ బ్యూటీ. సీరియల్ తులసితో ఎంతో గుర్తింపు పొందిన ఈమె అసలు పేరు అంతర స్వర్ణాకర్. హిందీలో పలు సీరియల్లో నటించిన ఆమె తెలుగులోకి అడుగుపెట్టి ఇక్కడ సత్తా చాటుతోంది. అనుకోకుండ నటి అయిన ఆమె దక్షిణాదిలోని పలు భాషల్లో నటిస్తూ దూసుకుపోతుంది. లక్ష్మీనివాసం సీరియల్లో తులసి పాత్రలో బుల్లితెర ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంటోంది.
బెంగాలీ నుంచి తెలుగుకి..
బెంగాలి అమ్మాయిన అచ్చతెలుగు అమ్మాయితో తనదైన నటన, అభినయంతో బుల్లితెరపై తనదైన ముద్ర వేసుకుంటుంది. తన అసలు పేరు కంటే కూడా సీరియల్ నేమ్‌తోనే ఈమె బాగా ఫేమస్ అయ్యింది. ఆడియన్స్ అంత ముద్దుగా తులసి అని పిలుచుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా ఓ సాహసం చేసింది. నీవల్ల కాదు అన్న కూడా.. చేసి చూపించి అందరికి షాకిచ్చింది. ఇది చూసి తులసిలో ఇంత మొండి ఘటనం ఉందా? సీరియల్ యూనిట్ మొత్తం మాట్లాడుకునేలా చేసింది. ఇంతకి ఆమె ఏం చేసిందంటే.. షూటింగ్ సమయంలో ట్రక్ నడిపింది ఈ భామ.
షూటింగ్ లో ట్రక్ తో సందడి
సీరియల్ షూటింగ్లో సిలిండర్స్తో ఉన్న ట్రక్ నడిపేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడ ఉన్నవారంత నీ వల్ల కాదు అని అన్నారట. అయినా కూడా ఎంతో ప్రయత్నించి చివరిక ఈ ట్రక్ని డ్రైవ్ చేసింది. ఇందులో కోసం ఆమె పడి పాట్లు అంతా ఇంత కాదు. పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఆమెకు సూచన ఇస్తూ కనిపించాడు. అలా చివరికి తులసి అలియాస్ అంతర ట్రక్ నడిపి చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అయితే ఇది షూటింగ్లో భాగంగా చేసిందా? లేక సరదాగా నడిపిందానేది క్లారిటీ లేదు. కానీ అతి కష్టమన్న ఈ పనిని సులువుగా చేసి చూపించింది. దీంతో అక్కడ ఉన్న వారంత అంతర ధైర్యానికి మెచ్చుకోక తప్పలేదు. అంతేకాదు నీ వల్ల కాదు వద్దన్న చేసి చూపించింది ఈ మొండిగటం అంటున్నారు సెట్లోని టీం అంతా.
?utm_source=ig_web_copy_link
కాగా సీరియల్లో ధైర్యంగ కనిపించే తలసి నిజ జీవితంలోనూ సాహవంతురాలే అంటున్నారు. మొదట బెంగాలీ సీరియల్లో నటించిన ఆమె ఓ మేకప్ ఆర్టిస్టు సూచనతో తెలుగు సీరియల్స్కి ఆడిషన్స్ ఇచ్చింది. ఆడిషన్ ఆమె లుక్, ఎక్స్పీరియన్స్తో ఆకట్టుకున్న ఆమె మౌనరాగం సీరియల్లో తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గీతాగోవిందం, లక్ష్మీనీవాసం సీరియల్లో లీడ్‌రోల్ ఛాన్స్ కొట్టేసింది. తెలుగులోనే కాదు.. తమిళ భాషల్లోనూ ఆఫర్స్ అందుకుంది. ప్రస్తుతం తమిళంలో సంధ్యారాగం సీరియల్లో నటిస్తోంది. ఇలా తెలుగు, తమిళంలో, బెంగాలీ భాషల్ల నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. త్వరలోనే ఆమె వెండితెర ఎంట్రీ కూడా ఇవ్వబోతోందట. సీరియల్లోనే కాదు.. సినిమా ఆఫర్స్ కూడా వస్తుండటంతో తమిళంలోని ఓ మూవీలో కీలక పాత్ర చేస్తోందట.
Also Read: Ghaati Movie: స్వీటీ ఫ్యాన్స్‌కి డబుల్ సర్‌ప్రైజ్.. ఒకేరోజు ఘాటీ ట్రైలర్, రిలీజ్ డేట్..