Ghaati Trailer and Release Date Update: స్వీటీ అనుష్క శెట్టి లాంగ్ గ్యాప్ తర్వాత ఘాటీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చివరిగా ఆమె ‘మిస్టర్ శెట్టి మిస్ శెట్టి‘ చిత్రంలో నటించింది. చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఇక జేజమ్మకు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుందని ఫ్యాన్స్ అంతా ఆశపడ్డారు. కానీ, ఈ సినిమా తర్వాత కూడా అనుష్క కాస్తా గ్యాప్ తీసుకుని ఘాటీతో వస్తోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో యాక్షన్, క్రైం డ్రామా ఇది రూపొందింది.
ఎన్నడూ చూడని సరికొత్త పాత్రలో..
ఇందులో అనుష్క లుక్, రోల్ ఫ్యాన్స్‌లో ఆసక్తి రేపుతోంది. ఇందులో స్వీటీ ఇప్పటి వరకు ఎన్నడు చూడని మాస్ పాత్రలో కనిపించనుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ మహిళగా ఢీ గ్లామర్ లుక్ లో అలరించబోతోంది. ఇక తనని మోసం చేసిన వాళ్లపై పగ తీర్చుకునే పవర్ఫుల్ లేడీగా అనుష్క కనిపించనుందట. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్, టీజర్ మూవీపై మంచి బజ్ పెంచాయి. అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా తరచూ వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. మొదట మార్చిలో రిలీజ్ అన్నారు. అక్కడ నుంచి ఏప్రిల్ 14న ప్రకటించారు.
కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అక్కడ నుంచి జూలై 11న ఘాటీ మూవీ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ అది పుకార్లకే పరిమితమైంది. దీంతో మూవీ రిలీజ్ డేట్ కోసం అభిమానులంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే మూవీ టీంపై ఫ్యాన్స్ అంతా ఫుల్ అసహనంతో ఉన్నారు. సినిమా రిలీజ్ ఎప్పుడు? ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ఇక ఎదురుచూపులకు చెక్ పెడుతూ తాజాగా క్రేజ్ అప్డేట్ వదిలింది మూవీ టీం. ఘాటీ రిలీజ్ డేట్‌తో పాటు ట్రైలర్ అప్డేట్ కూడా ఇచ్చింది.
Also Read: Sonu Sood: మాట నిలబెట్టుకున్న సోను సూద్.. ఫిష్ వెంకట్ కుటుంబాన్ని పరామర్శించిన రియల్ హీరో
ఒకే రోజు ట్రైలర్, రిలీజ్ డేట్
ఆగష్టు 6వ తేదీన ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు తెలుపుతూ.. మూవీ విడుదల తేదీ ప్రకటన కూడా ఆ రోజే అంటూ అభిమానులకు డబుల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. దీంతో స్వీటీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఎట్టకేలకు ఘాటీ రిలీజ్ డేట్ వచ్చేస్తోందంటూ సంబరపడిపోతున్నారు. కాగా ఘాటీని సెప్టెంబర్ 5న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఊహాగానాలే నిజమైన సెప్టెంబర్ 5న విడుదల తేదీని ఫిక్స్ చేశారా? మరింత ఆలస్యంగా వస్తుందా? అని తెలియాలంటే ఆగష్టు 6 వరకు వేచి చూడాల్సిందే. కాగా అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
The wait ends. Her reign begins ❤🔥#GhaatiTrailer and release date announcement on August 6th (Wednesday) 💥
Stay tuned!#GHAATI
⭐ing ‘The Queen’ @MsAnushkaShetty & @iamVikramPrabhu
🎥 Directed by the phenomenal @DirKrish
🏢 Proudly produced by @UV_Creations &… pic.twitter.com/Dz5T5vOvHo— UV Creations (@UV_Creations) August 4, 2025