E-Paper
Advertisement

సుధీర్ మోసగాడు.. ఇలాంటి క్యారెక్టర్ లేనివాడిని ఎక్కడా చూడలేదు: గోట్ ప్రొడ్యూసర్

సుధీర్ మోసగాడు.. ఇలాంటి క్యారెక్టర్ లేనివాడిని ఎక్కడా చూడలేదు: గోట్ ప్రొడ్యూసర్
Advertisement

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్.. జబర్దస్త్ కామెడీ షో లో స్క్రిప్ట్ రైటర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి.. ఆ తర్వాత టీం లీడర్ గా ఎదిగి, అనూహ్య ఆదరణ సొంతం చేసుకున్నారు. జబర్దస్త్ లో పీక్ స్టేజ్ లో ఉండగానే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుధీర్.. జబర్దస్త్ కి దూరమయి సినిమాలపైనే ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే సినిమాలో ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వకపోవడంతో అడపాదడపా సినిమాలు చేస్తూ ఇప్పుడు బుల్లితెర షోలలో సందడి చేస్తున్నారు. అలాంటి సుధీర్ ఇటీవల నటించిన చిత్రం గోట్. ఈ సినిమా ఎప్పుడో ప్రకటించినప్పటికీ.. పలు కారణాలవల్ల ఇటీవల విడుదలైంది. అయితే ఇది కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

సుధీర్ బాధ్యత లేనివాడు..

ఇకపోతే ఈ చిత్ర నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుడిగాలి సుదీర్ పై , చిత్ర డైరెక్టర్ నరేష్ కుప్పిలిపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి చేసిన కామెంట్లను బట్టి చూస్తే సుధీర్ ఇంత మోసగాడా ? అసలు బాధ్యత లేని వ్యక్తా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. “సుధీర్ రెమ్యూనరేషన్ మొత్తం ముందుగానే తీసుకున్నాడు. అయితే క్లైమాక్స్ లో కొన్ని సన్నివేశాలు మిగిలిపోయాయి. షూటింగ్ కి రమ్మని అడిగితే, మేనేజర్ తో రానని చెప్పించాడు. చేసేది ఏమీ లేక క్లైమాక్స్ లో CG, డూప్ తో చేశాను. ఏదైనా ప్రశ్నిస్తే స్పందించరు. బడ్జెట్ పెరిగినా సుధీర్ తో మాట్లాడితే ఆయన కూడా పట్టించుకోలేదు.

డైరెక్టర్ – సుధీర్ నన్ను మోసం చేశారు..

Advertisement

పైగా డైరెక్టర్ సుధీర్, మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే మాట మీద ఉన్నారు. అప్పటికే సుధీర్ అడిగాడని రూ.2కోట్లు పెంచాను. అయినా మారలేదు. ఆర్టిస్టులు చేసేది నటన.. స్క్రీన్ మీద కనబడినట్టు బయట ఉండరు. సుదీర్ కష్టపడ్డాడు. తిండి లేకుండా పైకి వచ్చాడు అంటారు కదా.. దాంతో సినిమా మీద బాధ్యతగా ఉంటాడేమో అనుకున్నాను. కానీ అతడిలో ఆ బాధ్యత కనిపించలేదు. పైగా రష్మీ ని సెకండ్ హీరోయిన్ గా తెస్తా అన్నాడు. ఆమెతో సుధీర్ మాట్లాడతానన్నారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. మొదట వాళ్లు చెప్పింది నమ్ముకుంటూ వెళ్లాను. కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. మొదట్లోనే నాకు సుధీర్ క్యారెక్టర్ మీద డౌట్ వచ్చింది. ఆయన క్యారెక్టర్రైజేషన్ కూడా సినిమాలో సరిగ్గా రాయలేదు. డైరెక్టర్ ని అడిగితే సుధీర్ నాకు బాగానే ఉంది ప్రాబ్లం లేదు అన్నాడు. షూటింగ్ కి రమ్మని ఎంత రిక్వెస్ట్ చేసినా రాలేదు.

also read: హౌస్ లో గొడవపడ్డ ఆర్కే- రామ్ ప్రసాద్.. అసలేం జరుగుతోంది?

మూడున్నర కోట్లతో మొదలైన సినిమా.. 14 కోట్లు ఖర్చయింది..

Advertisement

పైగా ఫిలిం ఛాంబర్ తో మాట్లాడించిన రాలేదు. చివరి 30% షూటింగ్ కి ఎగనామం పెట్టేసాడు. నా నంబర్ బ్లాక్ చేశాడు. మూడున్నర కోట్లతో అనుకున్న సినిమా.. ఐదు కోట్ల అయింది. కానీ 30% షూటింగ్ పెండింగ్ ఉండేసరికి తొమ్మిది కోట్లు దాటింది. వేరే డైరెక్టర్ని పెట్టుకొని మొత్తం 14 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు చంద్రశేఖర్. మరి దీనిపై సుధీర్ ఏదైనా స్పందిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది.

Related News

హౌస్ లో గొడవపడ్డ ఆర్కే- రామ్ ప్రసాద్.. అసలేం జరుగుతోంది?

చెల్లి కోసం సెట్ చేస్తే.. అక్క లవ్ లో దింపిందా.. నిజాలు బయటపెట్టిన సమీరా!

యాంకర్ సౌమ్య నెలకు ఎంత సంపాదిస్తుంది..? పాప రిచ్..

Karthika Deepam 2 Serial Today Episode November 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నను ఇంట్లోంచి గెంటేసిన సుమిత్ర

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. నవంబర్ నెల హైలెట్స్..

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు టెన్షన్.. చందు సీరియస్.. రామరాజుది ఎంత గొప్ప మనసో కదా..

Brahmamudi Serial Today Episode November 28th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రఘువీర్ కు షాక్ ఇచ్చిన రాజు, ఇందు

Big Stories

Advertisement
×