Karthika Deepam 2 serial today Episode: కార్తీక్, దీప తమ ఇంటికి వచ్చి వెళ్లాక మాలిని, సుమిత్రకు ఫోన్ చేస్తుంది. ఇంత జరిగినా బతికావంటే నీది గట్టి గుండే అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. అందుకు సుమిత్ర కూడా నా చావు కోసం ఎదురుచూస్తున్నావా..? చూడు కానీ జరిగింది ఇక మర్చిపో అంటూ చెప్తుంది. నేను మర్చిపోతాను కానీ నువ్వే మర్చిపోలేదేమో అందుకే నీ కూతురును నా కొడుకు దగ్గరకు పంపించావు అని మాలిని చెప్పగానే..
సుమిత్ర షాకింగ్‌గా ఏంటి నా కూతురు మీ ఇంటికి వచ్చిందా..? అని అడుగుతుంది. ఇంటికి వచ్చే ధైర్యం దానికెక్కడిది బయట నా కొడుకును కలిసి ఏదేదో మాట్లాడిందట.. ఆ ఇంకా నీ మేనల్లుడిని వాడి పెళ్లాంని కూడా నా ఇంట్లో ఊడిగం చేయడానికి రాయబారం పంపావా సుమిత్ర అంటూ మాలిని అడిగితే సుమిత్ర షాక్ అవుతుంది. ఇంకో విషయం నీ కూతురు నా కొడుకును జీవితాంతం మర్చిపోలేనని చెప్పిందట అదే మేము నీకు వేసిన శిక్ష అంటూ కాల్ కట్ చేస్తుంది మాలిని.
సుమిత్ర కోపంగా చూస్తూ.. బయటకు వెళ్తుంది. హాల్లో ఉన్న జ్యోత్స్న దగ్గరకు వెళ్లి సూరజ్‌ను ఎందుకు కలిశావు అంటూ నిలదీస్తుంది. అందుకు జ్యోత్స్న ఎమోషనల్ అవుతుంది. మీరంతా అరిచారు బాధపడ్డారు మరి నేను ఏం చేయాలి. తాళి కట్టాల్సిన వాడు ఒడిలో పడేసి వెళ్లిపోయాడు అందుకే వెళ్లి అడిగాను ఆ హక్కు నాకు ఉండదా..? అంటూ జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. అప్పుడు కార్తీక్ కచ్చితంగా ఉంటుంది అంటూ వస్తాడు. జ్యోత్స్నను రెచ్చగొట్టేదే కార్తీక్, దీపలు అంటూ పారిజాతం తిడుతుంది. దశరథ్ కూడా నా కూతురుని ఇలా ఎందుకు రెచ్చగొడుతున్నావురా అంటూ అడుగుతాడు.
బావకు దీనికి సంబంధం లేదని.. సూరజ్ పార్క్‌కు వస్తాడని తెలిసే వెళ్లాలని అడగాల్సింది అడిగే వచ్చానని చెప్తుంది జ్యోత్స్న. అయితే నీకు సమాధానం దొరికిందా అని శివనారాయణ అడుగుతాడు. సమాధానం ఎలా దొరుకుతుంది మామయ్య గారు. పైగా ఆ ఇంట్లో ఊడిగం చేస్తామని ఈ కార్తీక్, దీప వెళ్లారట అంటూ సుమిత్ర చెప్పగానే.. దశరథ కొపంగా కార్తీ్‌క్, దీపలను ఇంట్లోంచి వెళ్లిపోమ్మని చెప్తాడు. మీ అమ్మ కాళ్లు పోయేలా చేసిన ఆ ఇంటి గుమ్మం ఎలా తొక్కావురా అంటూ శివనారాయణ అడుగుతాడు.
అందుకు కార్తీక్ కోపంగా నా మరదలును మోసం చేసిన వారిని ఎవ్వరినీ ఊరికే వదలను ఇందులో నిజానిజాలు తెలుసుకుంటాను.. మోసం చేస్తే ఒక ట్రీట్‌మెంట్ ప్రేమిస్తే మరో ట్రీట్‌మెంట్ ఇస్తాను తాత. అందుకే ఆ ఇంటికి వెళ్లాను అంటూ కార్తీక్ చెప్పగానే.. నీ వాలకం చూస్తుంటే.. నా మనవరాలిని ఆ ఇంటి పనిమనిషిని చేసేలా ఉన్నావురా నువ్వు అంటూ ఇంట్లోంచి వెళ్లిపోమ్మని చెప్తాడు శివనారాయణ. అందుకు కార్తీక్ తాత ఒకప్పుడు నువ్వు నీకు నా మనవడే బలం అన్నావు.. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అయినా అపార్థాలు అన్ని తొలగిపోయిన రోజు నీకు నా గురించి తెలుస్తుంది అంటూ వెళ్లిపోతాడు కార్తీక్.
మాలిని, దక్షిణమూర్తి, సూరజ్ కలిసి భోజనం చేస్తుంటారు. వాళ్లకు వడ్డిస్తున్న పని వాళ్లను భోజనం చేశారా అని సూరజ్ అడిగితే లేదని చెప్తారు. అయితే మీరు కూర్చోండి ఇక్కడే భోజనం చేయండి అంటాడు సూరజ్. సూరజ్ మాటలకు మాలినికి కోపం వస్తుంది. ఎక్కడ ఉంచాల్సిన వాళ్లను అక్కడే ఉంచాలని అనవసరంగా మర్యాదలు చేయకూడదని చెప్తుంది. అందుకు సూరజ్ చాలా కూల్‌గా మాలినికి కౌంటర్ ఇస్తాడు. సూరజ్ మాటలకు మాలిని షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.