Big TV Kissik Talks: సాధారణంగా ఇండస్ట్రీలో కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. మరి కొంతమంది పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకుంటూ ఉంటారు. అయితే పెళ్లయిందో లేదో అప్పుడే మనస్పర్ధలు వచ్చి విడిపోయిన జంటలు కూడా ఉన్నాయి. మరికొన్ని జంటలు ఏమో భార్య భర్తకు టైం ఇవ్వకపోవడం , భర్త భార్యకు సమయాన్ని కేటాయించకుండా ఉండకపోవడం వల్ల.. ఇలాంటి మనస్పర్ధలు వస్తున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పెళ్లయి పండంటి కొడుకుకు జన్మనిచ్చిన ప్రముఖ బిగ్ బాస్ నటుడు, చైల్డ్ ఆర్టిస్ట్, సీరియల్ ఆర్టిస్ట్ అయిన మానస్ నాగులపల్లి (Maanas Nagulapalli) వైవాహిక జీవితంలో కూడా కాస్త మనస్పర్ధలు తలెత్తాయని, అప్పుడే గొడవలు కూడా జరుగుతున్నాయని స్వయంగా వెల్లడించారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
కిస్సిక్ టాక్స్ కి గెస్ట్ గా మానస్ నాగులపల్లి..
బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్స్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేశారు మానస్ నాగులపల్లి. ప్రముఖ జబర్దస్త్ లేడీ కామెడియన్ వర్ష (Varsha) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ను విడుదల చేయడం జరిగింది. ఇందులో ఎన్నో విషయాలను పంచుకున్న మానస్ నాగులపల్లి తన భార్యతో వస్తున్న గొడవల గురించి ఓపెన్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక దీంతో చాలామంది మానస్ పైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. మరి అసలు విషయం మానస్ మాటల్లోనే విందాం.. ప్రస్తుతం ఎక్కడ చేస్తున్నారు? అని హోస్ట్ ప్రశ్నించగా.. ‘బ్రహ్మముడి’ సీరియల్ తో పాటు మరికొన్ని షో , వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాను. త్వరలోనే అవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అని మానస్ సమాధానం చెప్పారు.
పెళ్లయిన కొద్ది రోజులకే గొడవలు.. మానస్ ఏమన్నారంటే?
మరి ఇంట్లో ఎప్పుడు ఉంటున్నారు? అంటే.. శ్రీజ తో కూడా ఇదే గొడవ..నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులు కూడా ఇలా షో, వెబ్ సిరీస్ లు , సీరియల్స్ అంటూ బిజీగా గడిపేయాల్సి వస్తోంది. దాంతో శ్రీజ అసలు ఇంట్లో ఉంటున్నావా అని ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటుంది. ఎందుకు పెళ్లి చేసుకున్నావని? నన్ను అడుగుతూ ఉంటుంది. ఇకపోతే మనమేదైనా వ్యతిరేకంగా మాట్లాడితే.. వారికి ఇంకా కోపం వస్తుంది .అందుకే ఆమెను కూల్ చేయడానికి “నువ్వు వచ్చిన వేళా విశేషం ఏమో తెలియదు కానీ నేను మరింత బిజీ అయిపోయాను” అంటూ తనని పొగిడేస్తూ కూల్ చేస్తూ ఉంటాను” అంటూ మానస్ తెలిపారు .ఇక నా భార్య, కొడుకుతో సమయాన్ని గడపాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ బిజీ షెడ్యూల్ వల్ల అలా కుదరడం లేదు. ఎప్పుడైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసినప్పుడేమో దర్శకులు ఫోన్ చేసి ఈ డేట్స్ లో మీరు ఖాళీగా ఉంటారా అని అడుగుతారు. వారి వల్లే కదా మనం ఈ స్టేజ్ లో ఉన్నది. కాబట్టి ఫస్ట్ వారికే ప్రయారిటీ ఇస్తాను. అలా శ్రీజకు నాకు మధ్య కాస్త గ్యాప్ పెరుగుతోంది అంటూ మానస్ తెలిపారు. అయితే ఇది విన్న కొంతమంది నెటిజెన్స్ మానస్ పై ఫైర్ అవుతున్నారు. అంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కుటుంబానికి టైం ఇవ్వకపోతే మీరు ఎంత కష్టపడినా వృధా అని కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది కుటుంబం కోసమే కదా కష్టపడుతున్నది అంటూ మానస్ కి వత్తాసు పలుకుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి మనస్పర్ధలే రేపొద్దున నష్టానికి దారితీస్తాయని, కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలని కూడా సలహా ఇస్తూ ఉండడం గమనార్హం. శ్రీజ మానస్ ను ఎంత అండర్స్టాండింగ్ చేసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భర్తకు అన్నివేళలా అండగా ఉంటూ బెస్ట్ వైఫ్ గా పేరు సొంతం చేసుకుంది.