Intinti Ramayanam Today Episode june 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని నీ జాబ్ లోంచి తీసేయించిన విషయాన్ని అక్షయ ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాడు. పార్వతి సంతోషపడుతుంది. దగ్గర అవ్వాలని చూస్తుందా.. మంచి పని చేశాడని మనసులో అనుకుంటుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న కమల్, శ్రీకర్లు సీరియస్ అవుతారు. అవని వదిన ఏం పాపం చేసింది అన్నయ్య మీరెందుకు అవని వదిన జాబ్ అయ్యేలా చేశారు ఆమె బతుకేదో ఆమె బతుకుతుంది కదా మీరు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని శ్రీకర్ నిలదీస్తాడు. ఓ ఇప్పుడు మీరందరూ నన్ను నిలదీసే వాళ్ళే అయ్యారా అంటూ అక్షయ్ కూడా వాళ్లకి ధీటుగా సమాధానం చెప్తాడు..
మొత్తానికి అవని జాబ్ అవడంతో ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుంది. మధ్యలో పల్లవి కలగజేసుకొని అవని అక్క జాబ్ పోవడం ఎంతవరకు కరెక్ట్ బావగారు మీరు చేసింది ముమ్మాటికీ తప్పే అని అంటుంది. మీ వల్లే జాబ్ అయిందని కోపంతో ఇంట్లో వాళ్ళందరినీ రోడ్డు మీదకి ఏడ్చాలని ఆలోచిస్తూ ఉంటుంది.. అది ఖచ్చితంగా చేసి చూపిస్తుంది అవని అక్క అంటూ పల్లవి అంటుంది. అప్పుడే ఇంట్లోకి చక్రధర్ ఎంట్రీ ఇస్తాడు. ఇది నిజం.. కూతురు పల్లవి అన్నది అక్షరాల నిజం అంటూ చక్రధర్ ఇంట్లో గొడవ పెట్టే ప్రయత్నం చేస్తాడు. అవని జాబ్ పోయిందన్న కోపంతో ఇంట్లో వాళ్ళని ఏమైనా చేయొచ్చు అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతాడు. ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుంది. కమల్ సీరియస్ అవుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. కమల్ ను కూల్ చేయకుంటే నా ప్లాన్ అంతా వేస్ట్ అవుతుందని పల్లవి ఫీల్ అవుతుంది. ఎలాగైనా ఈ తింగరోడిని కూల్ చేయాలి తన మాయలో వేసుకోవాలని పల్లవి రొమాంటిక్ యాంగిల్ లోకి తీసుకెళ్తుంది. ఇక కమల్ కోపం మొత్తం పోతుంది. ఇద్దరు కలిసి సరదాగా సరసాలు ఆడుకుంటుంటే భానుమతి కూడా అక్కడికి వచ్చి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. నా భర్త కూడా నాకోసం వస్తే బాగుండు ఒక ముద్దు ఇచ్చి వెళ్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటుంది.
మొత్తానికి అయితే కమల్ ని కూల్ చేస్తుంది పల్లవి. శ్రీకర్ శ్రీయాల మధ్య గొడవలు మొదలవుతాయి. అన్ని చూడు పల్లవి పల్లవి అంటున్నారు మరి నేను దేనికి పనికిరానా అని శ్రీకర్ని అడుగుతుంది. అది మీరు తేల్చుకోండి నాకే సంబంధం లేదు అనే శ్రీకర్ తప్పించుకుంటాడు. అవని ఉద్యోగం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈరోజు కొన్ని ఇంటర్వ్యూలకు వెళ్లి ఎలాగైనా సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ రాజేంద్రప్రసాద్ మనం ఒక చోటికి వెళ్ళాలి ఎవరిని తీసుకెళ్తాడు. అవనిని తమ ఆఫీస్ కి తీసుకెళ్లడంతో మొదట షాకోతున్న కూడా రాజేంద్ర ప్రసాద్ అంతా వివరంగా చెప్తాడు దాంతో కూల్ అవుతుంది.
ఇక అక్షర దగ్గరికి వెళ్ళగానే జాబ్ కోసం వచ్చాను అని అంటుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇక్కడ ఏ జాబులు లేవు అని అక్షయ్ అవన్నీ పై సీరియస్ అవుతాడు. రాజేంద్రప్రసాద్ మాత్రం నువ్వు జాబ్ ఇచ్చేది ఏంట్రా ఈరోజు నుంచి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నా ప్లేస్ ని అవని రీప్లేస్ చేస్తుంది అని అంటాడు. అక్ష య్ సీరియస్ అవుతాడు. అవినీతి ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేదు. అవని ఇంగ్లీషులో దంచి కొట్టేస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారు ఏమి నిర్ణయం తీసుకున్న అందులో ఒక అర్థం ఉంటుంది అంటూ చెప్పి అక్షయ్ పక్కన కూర్చుంటుంది.
తర్వాత రోజు ఉదయం పని మానేసిన ఒక వ్యక్తి ఇంటికి వస్తాడు. భానుమతి పార్వతిని పిలుస్తుంది. అటు పార్వతి శ్రీయా అని పిలుస్తుంది. అతను ఆరోగ్య సమస్య సరిగ్గా లేకపోవడంతోనే ఇక్కడ మానేసాడు అమ్మ తన కూతురు పెళ్లి దీక్ష చేసుకున్నాడు. తనకి పల్లవి దగ్గర తాళాలు తీసుకుని ఒక 50,000 తీసుకొచ్చి ఇవ్వు అని అంటుంది. అప్పుడే పల్లవి అక్కడికి వస్తుంది. పల్లవి తాళాలు అతనికొక 50 వేలు ఇవ్వాలంటే తెచ్చిస్తాను అని శ్రియ అడుగుతుంది. ఇంకెందుకమ్మా పల్లవి వచ్చింది కదా పల్లవిని తీసుకొచ్చిందిలే అని పార్వతి అంటుంది.. మీకు పల్లవి అంటేనే ఇష్టం కదా అత్తయ్య ఎందుకంటే ఆమె మేనకోడలు కాబట్టి ఇంత పక్షవాతం చూపిస్తున్నారంటే అవని యొక్క తర్వాత ఆ స్థానం నాది కదా ఇంటి పెత్తనం నాకివ్వాలి కదా అనేసి పార్వతితో శ్రీ ఆ గొడవకు దిగుతుంది. శ్రియ అదేంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావ్ అని పార్వతి షాక్ అవుతుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..