Gundeninda Gudigantalu Manoj : స్టార్ మా చానల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ లో నటిస్తున్న యాక్టర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కొన్ని రోజులుగా ఈ సీరియల్ నుంచి ఎవరో ఒకరు బయటకు వెళ్ళిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. ఇటీవల కాలంలో ఈ సీరియల్ నుంచి బాలు వెళ్లిపోతున్నాడు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. బాలు బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తేలింది ఇప్పుడు మనోజ్ క్యారెక్టర్ ఇకమీదట కనిపించదు అంటూ ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో షికారు చేస్తుంది. అయితే నిజంగానే మనోజ్ ఈ సీరియల్ లో ఇకమీదట కనిపించడా అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మరి నిజంగానే ఈ సీరియల్లో మనోజ్ కనిపించడం అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో మనోజ్ పాత్రలో నటిస్తున్న వ్యక్తి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా ఈ సీరియల్ లో లక్షలు మింగినోడు అని మనోజ్ కి బాలు పెట్టిన పేరు కాబట్టి జనాలు కూడా అతని లక్షలు మింగినోడే అని అంటుంటారు. గత కొద్ది రోజులుగా ఈ సీరియల్ నుంచి మనోజ్ తప్పుకుంటున్నాడంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే మనోజ్ కొత్త సీరియల్లో కనిపించడంతో జనాలందరూ కూడా మనోజ్ ఇకమీదట ఈ సీరియల్ లో కనిపించడు అంటూ అభిప్రాయానికి వచ్చేసారు. మరి నిజంగానే మనోజ్ కొత్త సీరియల్ వల్ల ఈ సీరియల్ కి దూరం అవుతున్నాడా? లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? ప్రస్తుతం మనోజ్ నిన్ను కోరి అనే సీరియల్ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సీరియల్ వల్ల మనోజ్ గుండెనిండా గుడి గంటలు సీరియల్ కి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా మనోజ్ కనిపించకపోతే ఈ సీరియల్లో బాలు ఆడుకోవడానికి మరో క్యారెక్టర్ ని క్రియేట్ చేయాల్సిందే అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. మరి మనోజ్ నిజంగానే వెళ్ళిపోతాడా లేదా అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న వాటిలలో సీరియల్స్ ముందువరుసలోనే ఉంటాయి.. గత కొన్ని రోజులుగా సీరియల్స్ కి పెరుగుతున్న డిమాండ్తో కొత్త సీరియల్స్ ని కూడా స్టార్ మా ఛానల్ ఎక్కువగా ప్రసారం చేస్తూ వస్తుంది. ఒకవైపు బుల్లితెరపై రియాల్టీ షోలు రోజుకొకటి పుట్టుకొస్తున్న సరే సీరియల్స్ కి మాత్రం డిమాండ్ ఎక్కడ తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ కి రేటింగ్ కూడా పెరుగుతూ వస్తుంది. సీరియల్స్ కి మాత్రమే కాదు అందులో నటిస్తున్న నటీనటుకులపై కూడా తెలుగు ప్రేక్షకులు అభిమానాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పటికే పలు సీరియల్స్ ద్వారా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరో హీరోయిన్లు మంచి డిమాండ్ ని క్రియేట్ చేసుకున్నారు. అదేవిధంగా గుండెనిండా గుడి గంటలు సీరియల్ లో మనోజ్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే.. ఇప్పటికే పలు సీరియస్లలో నటించి ప్రేక్షకులను మెప్పించిన మనోజ్ అలియాస్ యశ్వంత్ ఈ సీరియల్ ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయనకు ఒక్క రోజుకి దాదాపు 35 వేలకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండు సీరియల్స్లలో నటిస్తూనే సోషల్ మీడియాలో కూడా హైపర్ ఆక్టివ్ గా ఉంటున్నాడు మనోజ్. మొత్తానికి రెండు చేతుల సంపాదిస్తూ బాగా బిజీగానే ఉంటున్నాడు..