E-Paper
Advertisement

బంగారం కొనేవారికి శుభవార్త.. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ మార్కెట్లో ధరలు చూద్దాం

బంగారం కొనేవారికి శుభవార్త.. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ మార్కెట్లో ధరలు చూద్దాం
Advertisement

Gold Price Today: బంగారం కొనాలనుకున్న వారికి శుభవార్త. రెండురోజులు జోరు కాస్త మందగించింది. రెండు రోజులు వరుసగా పెరిగిన పసిడి ధరలు, సోమవారం కాస్త తగ్గింది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు కూడా ధరలపై పడిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వెండి రేటు భారీగా పెరిగింది. సెప్టెంబర్ 21న తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఒక్కసారి పరిశీలిద్దాం.

బంగారం కొనేవారికి శుభవార్త

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 21న అనగా సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో స్పాట్ గోల్డ్ 0.40 శాతం తగ్గింది. ఔన్సుకు 4,365 డాలర్ల వద్ద కదలాడుతుండుతోంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.40 శాతం తగ్గి ఔన్సుకు 4,407 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. దీనికితోడు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, డాలర్-బాండ్ ఈల్డ్స్ గిరాకీ క్షీణించింది. ఫలితంగా మదుపరులు బంగారంపై దృష్టి పెట్టడంతో రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. రెండు రోజులు బంగారం తులం రూ. 3 వేలు వరకు పెరిగింది. కిలో వెండి రూ. 10 వేలు దూసుకెళ్లింది.

దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

Advertisement

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 13 డాలర్లు తగ్గింది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సు 65 డాలర్ల వద్దకు కిందకు వచ్చింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములు రూ. 1,55,840 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 1,42,850 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. కిలో వెండి ధర రూ. 2,60,000 మార్క్ వద్ద హెచ్చుతగ్గులకు లోనవుతోంది.

దేశీయ మార్కెట్లో ధరలు

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ.1,55,980 కాగా, 22 క్యారెట్లు గోల్డ్ ధర రూ.1,42,990 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగుళూరు, కోల్‌కత్తాలో 24 క్యారెట్లు పసిడి ధర రూ.1,55,830 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,42,840లు కొనసాగుతోంది. చెన్నైలో కాస్త 100 నుంచి 200 అటు ఇటు కొనసాగుతోంది.

Advertisement

ALSO READ: మంచి కార్పొరేట్ జాబ్ వదిలి వ్యవసాయం.. కట్ చేస్తే రూ.కోట్ల బిజినెస్‌ చేస్తున్న యువతి

Related News

మంచి కార్పొరేట్ జాబ్ వదిలి వ్యవసాయం.. కట్ చేస్తే రూ.కోట్ల బిజినెస్‌ చేస్తున్న యువతి

టాటా సన్స్‌లో మళ్లీ ముసలం.. ట్రస్ట్ సంచలన ప్రకటన, చంద్రశేఖరన్ నియామకం చెల్లదు

సెప్టెంబర్ 28 నుంచి సమ్మె.. అలర్టయిన ఎస్బీఐ, కస్టమర్లకు ముఖ్య గమనిక

ఆన్‌లైన్‌లో డిజిటల్ గోల్డ్ కొంటున్నారా? జాగ్రత్త ఈ విషయాలు తెలుసుకోండి

బ్యాంక్‌లో పర్సనల్ లోన్ కావాలా? తక్కువ వడ్డీకి ఏ బ్యాంక్ ఇస్తోందో వివరాలివిగో

గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆధార్‌ ధ్రువీకరణ తప్పనిసరి, అక్టోబరు 1 నుంచి అమలు

బాంబు పేల్చిన పెట్రోల్ బంక్ డీలర్లు.. యూపీఐ చెల్లింపులు నిలిపివేత.. ఆ తేదీ నుంచి క్యాష్ తప్పనిసరి!

Big Stories

Advertisement
×