E-Paper
Advertisement

సనాతన ధర్మ పరిరక్షకులంటూ..పవన్ గరికపాటి పై అన్వేష్ ఫైర్!

సనాతన ధర్మ పరిరక్షకులంటూ..పవన్ గరికపాటి పై అన్వేష్ ఫైర్!
Advertisement

Naa Anvesh: నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడిగా అందరికీ ఎంతో సుపరిచితమే ఈయన 132 దేశాలలో పర్యటిస్తూ అక్కడే విషయాలను తన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా అన్వేష్ భారత దేశం గురించి అలాగే మన దేశంలో పెరిగిపోతున్న కాలుష్యం గురించి పలు సందర్భాలలో మాట్లాడుతూ తన అభిప్రాయాలను తెలియజేశారు తాను యూట్యూబ్ ద్వారా సుమారు ఏడు కోట్ల రూపాయల వరకు సంపాదించానని అయితే ఇండియా వచ్చిన తర్వాత వాటన్నింటిని నదులు శుభ్రం చేయడానికి చెత్తను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తాను అంటూ చెప్పుకువచ్చారు.

భారతదేశానికి క్యాన్సర్…

ఇండియాలో రోజురోజుకు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో నా వంతుగా తాను సహాయం చేస్తానని అన్వేష్ తెలియజేశారు . ఇకపోతే తాజాగా ఈయన సనాతన ధర్మ పరిరక్షకులు అంటూ చాగంటి (Chaganti)తో పాటు గరికపాటి(Garikapati) అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ని ఉద్దేశించి ఒక వీడియో షేర్ చేశారు. ఇందులో భాగంగా ఈయన మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తూ .. భారతదేశానికి క్యాన్సర్ వచ్చిందని తెలిపారు. భారతదేశంలో ఉన్న మట్టి నీటిని పరీక్షించగా భారతదేశం చివరి దశ క్యాన్సర్ లో ఉందని ఫలితాలు వెల్లడైనట్లు అన్వేష్ తెలిపారు.

భవిష్యత్తు తరాలకు భవిష్యత్తు ఉండదు..

Advertisement

ఇలా మన దేశం చివరి దశ క్యాన్సర్ ను అనుభవిస్తుందని మనం కనుక ఇప్పుడు మేలుకోకపోతే రాబోయే ఐదు తరాలలో చాలా నష్టపోవాల్సి వస్తుందని అన్వేష్ తెలిపారు. ఇలా నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం కాకుండా ఉండాలి అంటే వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన వినాయకుడి విగ్రహాలను ఉపయోగించాలని ఈయన ఈ వీడియో ద్వారా సూచించారు. అదేవిధంగా సనాతన ధర్మ పరిరక్షకులంటూ చెప్పుకుంటున్న చాగంటి ,పవన్ కళ్యాణ్, గరికపాటి ఈ ముగ్గురు కూడా ఈ విషయం గురించి ఒక వీడియో చేసి అందరిలో అవగాహన తీసుకురావాలి అంటూ అన్వేష్ తెలిపారు. క్యాన్సర్ బారిన పడిన భారత్ ను కాపాడాలి అంటే ఇప్పటినుంచి జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే భవిష్యత్తు తరాలకు భవిష్యత్తు ఉండదు అంటూ నా అన్వేష్ ఆవేదన చెందారు.

?stkn=MWY0MTRqNXUxdXNkdw%3D%3D

Advertisement

ప్రస్తుతం నా అన్వేష్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పట్ల సోషల్ మీడియా వేదిక ఈయన అభిమానులు స్పందిస్తూ చాలా మంచి వీడియో చేశారు మంచి వ్యాఖ్యలు చెప్పారు కనీసం ఈ వీడియో పై సనాతన ధర్మ పరిరక్షకులు స్పందిస్తే బాగుంటుంది అంటూ కామెంట్లు చూస్తున్నారు. మరి నా అన్వేష్ వీడియో పట్ల గరికపాటి, చాగంటి లేదా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ అందరికీ వాతావరణ కాలుష్యం పట్ల అవగాహన కలిగేలా వీడియోలు చేసి పెడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అన్వేష్ విదేశాలలో ఉంటున్న సంగతి తెలిస్తే త్వరలోనే తాను ఇండియాకి వస్తానని ఇండియా వచ్చిన తర్వాత నదులను శుభ్రం చేయిస్తానని 100 టన్నుల చెత్త శుభ్రం చేయిస్తాననీ, నా వంతు నేను నా దేశం కోసం కష్టపడతానంటూ ఒక వీడియో ద్వారా తెలియజేశారు.

Also Read: సెలబ్రిటీలకు మద్దతు తెలిపిన మాజీ కంటెస్టెంట్.. కామనర్స్ అంటే అంత చులకనా?

Related News

ఎంగిలి గ్లాస్ లు కడిగిన నాగార్జున… రోహిత్ పై ఫుల్ ఫైర్.. త్రిగుణ్ కు గుణమే లేదంటూ!

వార్తా ప్రపంచం మారిపోయిందండోయ్.. 80ల్లో అలా, ఇప్పుడేమో ఇలా!

సెలబ్రిటీలకు మద్దతు తెలిపిన మాజీ కంటెస్టెంట్.. కామనర్స్ అంటే అంత చులకనా?

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా సుప్రీత.. ఏమన్నారంటే?

సీక్రెట్ రూమ్ లో చరణ్, చైత్ర? కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్!

ఢీ10 షో విన్నర్ రాజు అరెస్ట్?

నా జీవితంలో మర్చిపోలేని రోజు అదే – నటరాజ్ మాస్టర్!

Big Stories

Advertisement
×