E-Paper
Advertisement

నా జీవితంలో మర్చిపోలేని రోజు అదే – నటరాజ్ మాస్టర్!

నా జీవితంలో మర్చిపోలేని రోజు అదే – నటరాజ్ మాస్టర్!
Advertisement

Kissik talks:సినిమాల్లోకి హీరోగా అడుగు పెట్టాలనుకుని.. సైడ్ క్యారెక్టర్ గా కెరియర్ ప్రారంభించి, అనూహ్యంగా కొరియోగ్రాఫర్ గా మారి, అందరి దృష్టిని ఆకర్షించిన నటరాజ్ మాస్టర్ (Nataraj Master) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన నృత్య కవళికలతో భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేశారు. ఇందులో ఎన్నో విషయాలను పంచుకున్న ఆయన.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో పడ్డ అవమానాలు, ఇబ్బందులు, ఆకలి పోరాటాలు ఇలా అన్ని చెప్పుకొచ్చారు.. అంతేకాదు ఒక లేడీ తనను మోసం చేసిందని, త్వరలోనే ఆమె గుట్టు బయట పెడతానని చెప్పిన నటరాజ్ మాస్టర్.. ఇదే ఇంటర్వ్యూలో తన జీవితంలో తాను మర్చిపోలేని ఒక రోజు గురించి చెప్పి అభిమానులను సర్ప్రైజ్ చేశారు.

నా ప్రపంచంలోకి వచ్చిన దేవత – నటరాజ్ మాస్టర్

తాజాగా ఇంటర్వ్యూయర్ వర్ష మాట్లాడుతూ..” మీరు మీ జీవితంలో మర్చిపోలేని రోజు ఏదైనా ఉంది అంటే.. అది ఏది? అని ప్రశ్నించింది. నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ.. “పాప పుట్టిన రోజు.. పుట్టిన తర్వాత కంటిన్యూస్ గా ఏడుస్తూనే ఉంది. కానీ నా కూతుర్ని నా చేతుల్లో పెట్టాక.. ఒక్కసారిగా ఏడుపు ఆపేసి కళ్ళు పెద్దవి చేసి మరీ నన్ను అలా చూసింది. నా కూతురు ఆరోజు చూసిన చూపులో.. నాకు అర్థమైంది ఏమిటంటే.. నీకోసం నేను వచ్చాను. ఇక నువ్వు బాధపడకు అని.. ఆ ఫీల్ నాలో కలిగింది “అంటూ తన జీవితంలో మర్చిపోలేని రోజు అదే అంటూ చెప్పుకొచ్చారు నటరాజ్ మాస్టర్.

నా ఆయువు మొత్తం ఆమెకే – నటరాజ్ మాస్టర్

Advertisement

మీ కూతురి కోసం ఏదైనా కోరమంటే ఏం కోరతారు? అని వర్ష ప్రశ్నించగా.. నా ఆయుష్షు కూడా తనకే పోసి.. ఇంకా ఎక్కువ ఆయుష్షు పోయమని ఆ దేవుడిని అడుగుతానని నటరాజు మాస్టర్ తన కూతురిపై ఉన్న ప్రేమను ఇలా వ్యక్తపరిచారు.

also read:బిగ్ బాస్ 10పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటరాజ్ మాస్టర్!

అంతా నటించేవాళ్లే – నటరాజ్ మాస్టర్

Advertisement

నేను ఒక ఇల్లు కొన్నాను. రిజిస్ట్రేషన్ సమయంలో నా దగ్గర డబ్బు లేదు. ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. ఎవరు కూడా మన అని ఉండరు .. అలా నటిస్తారు మాత్రమే. కష్టం వచ్చినప్పుడు దూరంగా వెళ్లిపోతారు. అప్పుడే నాకు డబ్బు విలువ అర్థమయింది అంటూ నటరాజ్ మాస్టర్ తెలిపారు.

నా సక్సెస్ చూడడానికి మా నాన్న లేరు..

ఒక ఎత్తుకు ఎదగాలని మా నాన్న ఎన్నో కలలు కన్నారు. అయితే నేను సక్సెస్ పొందిన తర్వాత దాన్ని చూడడానికి మా నాన్న లేరు. నేను ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతున్న సమయంలోనే అనారోగ్య సమస్యలతో ఆయన తుది శ్వాస విడిచారు అంటూ తన తల్లిదండ్రుల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు నటరాజ్ మాస్టర్.

Related News

బిగ్ బాస్ 10పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటరాజ్ మాస్టర్!

కన్నీళ్లు పెట్టుకున్న ఉదయభాను.. వీడియో వైరల్!

బిగ్ బాస్10 చైత్ర రాయ్ ఎలిమినేటెడ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

Ninnu Kori Today Episodes: చంద్రకు షాకిచ్చిన డాక్టర్.. గుడ్ న్యూస్ చెప్పిన క్రాంతి.. జగదీశ్వరి ఒప్పుకుంటుందా..?

Karthika Deepam 2Today Episodes:  దీప దెబ్బ అదుర్స్.. జ్యో మాటతో సూరజ్ షాక్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు దిమ్మతిరిగే షాక్.. సింగరాజు మాటతో ఫ్యూజుల్ అవుట్..

Podarillu Today Episode : శైలు పై అనుమానం..కేశవకు నిజం తెలుస్తుందా..? చక్రీ మాస్టర్ ప్లాన్..

Big Stories

Advertisement
×