Bigg Boss 10 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 (Bigg Boss 10 Telugu)కార్యక్రమం ప్రారంభమై అప్పుడే వారం రోజులు పూర్తి కావస్తుంది. సెప్టెంబర్ ఆరవ తేదీ ఎంతో ఘనంగా 16 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం మొదటివారం పూర్తి చేసుకోబోతోంది. ఇక ఊహించని విధంగా మొదటి వారంలో ఇద్దరు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ కార్యక్రమం నుంచి కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా అడుగుపెట్టిన చరణ్, సెలబ్రిటీ క్యాటగిరీలో భాగంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన చైత్ర ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
ఇలా మొదటి వారమే హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడంతో ఈసారి ఈ కార్యక్రమం చాలా ఆసక్తికరంగా మారింది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి ఎప్పటిలాగే సెలబ్రిటీలతో పాటు కామనర్స్ కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అగ్ని పరీక్ష ద్వారా ఎంపికైన ఆరుగురు కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇకపోతే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు బయట నుంచి పూర్తిస్థాయిలో సెలబ్రిటీలు మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నటుడు మానస్ నాగులపల్లి(Manas Nagulapalli) ఒక ఇంటర్వ్యూ సందర్భంగా హౌస్ లో ఉన్న సెలబ్రిటీలకు తన మద్దతు అని తెలిపారు.
ఇటీవల జియో హాట్ స్టార్ లో జరిగిన బిగ్ బాస్ 24/7 లైవ్ లో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ మానస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ సెలబ్రిటీలకు బహిరంగంగా తన మద్దతు తెలిపారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లలో తనకు ఆటో రాంప్రసాద్, నరేష్, దెబ్జానీ ఫేవరెట్ కంటెస్టెంట్లను వారికి తన మద్దతు తెలియజేస్తున్నానని మానస్ తెలిపారు. ఈ విధంగా మానస్ బహిరంగంగా తన మద్దతు సెలబ్రిటీలకు అని చెప్పడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది.
ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు హౌస్ లో కొనసాగుతున్న సెలబ్రిటీలకే తమ మద్దతు ప్రకటిస్తూ వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే . అయితే కామనర్స్ కోసం ఒక సెలబ్రిటీ కూడా ముందుకు రాకపోవడంతో కామనర్స్ ను ఎందుకు హౌస్ లో వేరు చేసి చూస్తున్నారు, కామనర్స్ అంటే అంత చులకన ఎందుకు అంటూ మానస్ వ్యాఖ్యలపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇక మానస్ సైతం గతంలో బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈయన సీజన్ 5 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు . ఇలా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ గా ఈయన ప్రస్తుతం ప్రసారమవుతున్న బిగ్ బాస్ 10 గురించి , సెలబ్రిటీలకే నా మద్దతు అంటూ బహిరంగంగా మాట్లాడటంతో ఈ విషయంపై విమర్శలను ఎదుర్కొంటున్నారు.
Also Read: సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తే యాక్షనే..ఆదర్శ కుటుంబం టీజర్ రిలీజ్!