E-Paper
Advertisement

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా సుప్రీత.. ఏమన్నారంటే?

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా సుప్రీత.. ఏమన్నారంటే?
Advertisement

Supritha: తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికే తెలుగులో 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఎట్టకేలకు 10వ సీజన్ కూడా ప్రారంభం అయింది. షో మొదలైన ఐదు రోజుల్లోనే ఏకంగా ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి.. ఇంటికి వెళ్లిపోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ తో పలువురు సెలబ్రిటీలు ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక అందులో భాగంగానే కొంతమంది పేర్లు కూడా వినిపించాయి.

వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ సీజన్ 10 లోకి సుప్రీత..

అలాంటి వారిలో ప్రముఖ టాలీవుడ్ స్టార్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత(Supritha ) కూడా ఉన్నట్లు వార్తలు వినిపించగా.. ఈ విషయంపై సుప్రీత స్పందించి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం పై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంపై సురేఖ వాణి కూతురు సుప్రీత మాట్లాడుతూ… “బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనడానికి ఆఫర్ వచ్చింది. కానీ మా అమ్మకు నాపై ఉన్న ఆందోళనల కారణంగా ఈ షోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను . హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే పరిణామాలకు తగినట్లుగా నేను నా భావోద్వేగాలను సరిగ్గా కంట్రోల్ చేసుకోగలనా లేదా అనే విషయంలో మా అమ్మకు కొన్ని సందేహాలు ఉన్నాయి.

అందుకే ఆఫర్ వదులుకున్నాను..

Advertisement

అందుకే మా అమ్మకి నాపై అంతగా నమ్మకం కుదరనప్పుడు ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఈ రియాలిటీ షోలోకి అడుగుపెట్టడం నాకు ఇష్టం లేదు” అంటూ స్పష్టం చేసింది సుప్రీత . మొత్తానికైతే వైల్డ్ కార్డు ద్వారా అమ్మడు ఎంట్రీ ఇస్తోంది అంటూ ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలిందని చెప్పాలి. ఇకపోతే ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ..” నాకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి సాధారణ ఎంట్రీ కోసమే అవకాశం లభించింది. అప్పుడు మా తల్లి కోసం వదులుకున్నాను. అలాంటప్పుడు ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా లోపలికి వెళ్లే ప్రసక్తే లేదు” అంటూ చెప్పుకొచ్చింది.

also read:ఢీ10 షో విన్నర్ రాజు అరెస్ట్?

నేను అసలైన బిగ్ బాస్ వీరాభిమానిని..

Advertisement

ఇకపోతే ఆమె మాట్లాడుతూ..” నేను బిగ్ బాస్ షోలోకి వెళ్లకపోయినా.. షో కి మాత్రం వీరాభిమానిని. షో ప్రారంభం రోజు నుంచి ఏ రోజు ఎపిసోడ్ మిస్ కాకుండా చూస్తాను. నా వృత్తిపరమైన పనులపై ఎంత శ్రద్ధగా ఉంటానో.. బిగ్ బాస్ షోని ఫాలో అవ్వడంలో కూడా అంతే ఆసక్తి చూపిస్తుంటాను. నేను హౌస్ లోకి వెళ్లకపోయినా బయటనుంచి ఒక సాధారణ ప్రేక్షకురాలిగా ఈ పదవ సీజన్ ను ఆస్వాదిస్తాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. మొత్తానికైతే ఆఫర్ వచ్చినా.. తల్లి కోసం వదులుకున్నానని చెప్పిన ఈమె.. ఇక భవిష్యత్తులోనైనా తన తల్లి ఆలోచనల్లో మార్పు వస్తే మళ్లీ హౌస్ లోకి అడుగుపెడుతుందేమో అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. చూద్దాం భవిష్యత్తులో మార్పు వస్తుందేమో.

Related News

వార్తా ప్రపంచం మారిపోయిందండోయ్.. 80ల్లో అలా, ఇప్పుడేమో ఇలా!

సెలబ్రిటీలకు మద్దతు తెలిపిన మాజీ కంటెస్టెంట్.. కామనర్స్ అంటే అంత చులకనా?

సీక్రెట్ రూమ్ లో చరణ్, చైత్ర? కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్!

ఢీ10 షో విన్నర్ రాజు అరెస్ట్?

నా జీవితంలో మర్చిపోలేని రోజు అదే – నటరాజ్ మాస్టర్!

బిగ్ బాస్ 10పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటరాజ్ మాస్టర్!

కన్నీళ్లు పెట్టుకున్న ఉదయభాను.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×