E-Paper
Advertisement

సీక్రెట్ రూమ్ లో చరణ్, చైత్ర? కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్!

సీక్రెట్ రూమ్ లో చరణ్, చైత్ర? కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్!
Advertisement

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కార్యక్రమం ప్రారంభమై అప్పుడే వారం రోజులు పూర్తి అయింది.16 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం నుంచి మొదటి వారమే ఇద్దరు కంటెస్టెంట్ లో హౌస్ నుంచి బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మొదటి వారం ఇద్దరు కంటెస్టెంట్లను బయటకు పంపించడం అనేది ఊహించని విషయం. అయితే మొదటి వారం ఎలిమినేట్ అయిన చరణ్ (Charan), చైత్ర రాయ్(Chaitra Rai) ఇద్దరు కూడా సీక్రెట్ రూమ్ లో ఉన్నారని, వీక్ ఎండ్ లో భాగంగా వీరిద్దరిలో ఎవరో ఒకరు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారని అందరూ భావించారు.

సీక్రెట్ రూమ్ పై నాగార్జున క్లారిటీ…

ఇకపోతే తాజాగా వీకెండ్ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక ప్రోమో వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా నాగార్జున(Nagarjuna) సీక్రెట్ రూమ్ గురించి క్లారిటీ ఇచ్చారు. నాగార్జున వేదిక పైకి రాగానే మహా పరీక్ష గురించి అలాగే మొదటి వారం ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడం గురించి తెలిపారు . ఇక 11 మంది డేంజర్ జోన్ లో ఉన్నారని నాగార్జున గుర్తు చేశారు. అనంతరం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లతో మాట్లాడుతూ… చైత్ర, చరణ్ సీక్రెట్ రూమ్ లోనే ఉన్నారు అనుకుంటున్నారు కదా అని కంటెస్టెంట్లను అడగడంతో వారు కూడా అవునని చెప్పారు. అయితే వెంటనే చరణ్, చైత్ర వారి ఇంట్లో ఉన్నటువంటి ఒక వీడియోని ప్లే చేశారు. వారిద్దరు కూడా తమ ఇంట్లో ఉన్నామని చెప్పారు.

ఆటలో అలసత్వం చేస్తే ఇంటికే…

Advertisement

ఇద్దరు కూడా నేరుగా ఇంటికి వెళ్లిపోయారని సీక్రెట్ రూమ్ లో ఎవరు లేరని నాగార్జున క్లారిటీ ఇస్తూనే బిగ్ బాస్ దశావతారం ఎలా ఉండబోతుందో మరోసారి గుర్తు చేశారు. అదేవిధంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు కూడా ఈయన వార్నింగ్ ఇచ్చారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ ఆటలో ఏ మాత్రం అలసత్వం చూపించిన నేరుగా హౌస్ నుంచి బయటకు వెళ్తారని నాగార్జున కంటెస్టెంట్లను హెచ్చరించారు. ఏది ఏమైనా మొదటివారం హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్లు బయటకు రావటం అనేది పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది.

Advertisement

ఇకపోతే 16 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం మొదటి వారమే ఇద్దరు హౌస్ నుంచి బయటకు వెళ్లడం వెనుక వైల్డ్ కార్డు ఎంట్రీస్ కారణమని చెప్పాలి. త్వరలోనే హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా మరి కొంత మంది కంటెస్టెంట్లను పంపించబోతున్నారు అందుకే మొదటి వారమే డబల్ ఎలిమినేషన్ జరిగిందని తెలుస్తోంది. ఇక ఈ వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా నాగార్జున కంటెస్టెంట్ల ఆట తీరు గురించి మాట్లాడనున్నారు. మరి ఈయన ఎవరికి ఎలాంటి సలహాలు ఇవ్వబోతున్నారు ఎవరిని హెచ్చరించబోతున్నారనేది తెలియాల్సి ఉంది.

Also Read: అభిమాని కుటుంబానికి అండగా రామ్ పోతినేని.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

Related News

ఢీ10 షో విన్నర్ రాజు అరెస్ట్?

నా జీవితంలో మర్చిపోలేని రోజు అదే – నటరాజ్ మాస్టర్!

బిగ్ బాస్ 10పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటరాజ్ మాస్టర్!

కన్నీళ్లు పెట్టుకున్న ఉదయభాను.. వీడియో వైరల్!

బిగ్ బాస్10 చైత్ర రాయ్ ఎలిమినేటెడ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

Ninnu Kori Today Episodes: చంద్రకు షాకిచ్చిన డాక్టర్.. గుడ్ న్యూస్ చెప్పిన క్రాంతి.. జగదీశ్వరి ఒప్పుకుంటుందా..?

Karthika Deepam 2Today Episodes:  దీప దెబ్బ అదుర్స్.. జ్యో మాటతో సూరజ్ షాక్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Big Stories

Advertisement
×