Dhee 10 Raju:సినిమా అవకాశాల పేరుతో.. లైంగికంగా వాడుకొని, చివరికి మోసం చేస్తూ ఎట్టకేలకు ఉన్న పరువు ప్రతిష్టను కోల్పోతున్నారు కొంతమంది సెలబ్రిటీలు. ఈ క్రమంలోనే ఒక అమ్మాయికి సినిమా ఆశ చూపించి , అవకాశాల పేరిట ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేసి.. ఇప్పుడు మోసం చేసిన కేసులో బుల్లితెర టీవీ షో ఢీ 10 విజేత రాజు (Raju) అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి రాజు అరెస్టు వెనుక ఆ బాధితురాలు ఎలాంటి ఫిర్యాదు చేసింది ? అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బుల్లితెర డాన్స్ రియాలిటీ షో ఢీ ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకొని, ఢీ 10వ సీజన్ విన్నర్ గా నిలిచిన రాజు ఇప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఇరుక్కున్నాడు. ముఖ్యంగా బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజు పై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు రిమాండ్ కి తరలించారు.
విషయంలోకి వెళ్తే.. డాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న రాజు.. తనకు సినిమాలలో అవకాశం కల్పిస్తానని చెప్పి.. తనను మోసం చేశాడని, తనతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా లైంగికంగా వేధింపులకు గురి చేశాడని సదరు యువతి యువతి మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది. ఇక ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత మియాపూర్ పోలీసులు ఈనెల 9వ తేదీనే రాజు పై అధికారికంగా కేసు ఫైల్ చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తదుపరి విచారణలో భాగంగా న్యాయమూర్తి ముందు హాజరు పరిచి, వెంటనే రిమాండ్ కు తరలించారు.
also read:హీరోయిన్ అమీషా పటేల్ ఇంట్లో చోరీ.. మొత్తం విలువ ఎంతంటే?
ఇకపోతే రాజు పైన కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచి, రిమాండ్ కు తరలించిన విషయాన్ని మియాపూర్ పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచడం ఇప్పుడు వైరల్ గా మారింది. సాధారణంగా ఒక ప్రముఖ టీవీ షో విన్నర్ లేదా సెలబ్రిటీ పై ఇలాంటి లైంగిక వేధింపులు ఆరోపణలు వస్తే ఆ వార్తలు క్షణాల్లో వైరల్ అవుతాయి. కానీ ఈ విషయం జరిగి మూడు రోజులవుతున్నా.. బయటకు పొక్కనివ్వకుండా మియాపూర్ పోలీసులు తీసుకున్న జాగ్రత్తలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా పోలీసులు ఎందుకు ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికైతే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అటు డాన్స్ వర్గాలలో ఇటు బుల్లితెర వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు యువతి చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.