Students Missing: సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మునగాల మండలం ముకుందపురం గ్రామంలోని ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గల్లంతైన ఘటన తీవ్ర విషాదానికి దారి తీసింది.
అయితే నేడు రెండోవ శనివారం సెలవు దినం కావడంతో ముకుందపురం గ్రామంలో తోటి విద్యార్థి అనుదీప్ అనే మిత్రుడ్ని కలవడానికి కోదాడ పట్టణానికి చెందిన హరీష్ నాయుడు, గుడిబండ గ్రామానికి చెందిన లేకస్వరూప్ అనే పిల్లు వచ్చారు. దీంతో ఈ ముగ్గురు పిల్లలు కలిపి సెలవు కావడంతో ముగ్గురు విద్యార్థులు ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ వద్ద అందరూ కలిసి ఈత కొట్టడానికి కాలవలోకి దిగారు.
Also read: 22A భూముల బాధితులకు గుడ్ న్యూస్.. పరిష్కారంపై మంత్రి పొంగులేటి క్లారిటీ!
కాలువలోకి దిగిన హరీష్ నాయుడు, లేకస్వరూప్ ఇద్దరు పిల్లు గల్లంతయ్యారు. దీంతో అక్కడి స్థానికులు ఓకరిని కాపాడారు. మిగతా పిల్లలు కాలువలో కొట్టుకు పోడంతో అక్కడి స్ధానికులు వెంటనే పోలీసు లకు సమాయారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్నపోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది కలిసి కొట్టుకు పోయిన పిల్లకోసం గాలింపు చర్యలు చేపట్టారు. అధికారులు కాలువ నీటిని తగ్గించి విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటనలో పిలల్ల తల్లితండ్రులు శోకసముద్రంపై అల్లాడిపోయారు.
Also read: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. సెప్టెంబర్ 14 నుంచి ఈ దారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు!