Janu lyri:జాను లిరి (Janu lyri).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అప్పట్లో ఢీ షో విజేతగా నిలిచిన ఈమెపై.. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చాలా నెగెటివిటీ ట్రోల్స్ వస్తున్న విషయం తెలిసిందే. అటు జాను కూడా ఈ ట్రోల్స్ పై రియాక్ట్ అయింది. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ (Shekhar master) వల్లే జాను లిరి టైటిల్ విజేత అవార్డు వచ్చింది అని చాలామంది కామెంట్లు చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. శేఖర్ మాస్టర్ వల్లే నేను ఢీ షో గెలిచాను అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. వీటివల్ల మనశ్శాంతి లేకుండా పోతోంది. సూసైడ్ కూడా చేసుకోవాలనుకుంటున్నాను.. అంటూ ఒక వీడియో కూడా వదిలింది. ఆ తర్వాత మరుసటి రోజు సడన్ గా రెండో పెళ్లి ప్రకటన చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక పెళ్లి చేసుకుంటుంది అనుకునే లోపే సడన్గా ఢీ సీజన్ 20 ఆఫర్ రావడంతో మళ్లీ ఢీ స్టేజ్ పై సందడి చేస్తోంది.
మాస్టర్ కే బిస్కెట్లు వేసిన జాను లిరి..
ఇదిలా ఉండగా తాజాగా.. ఈ సీజన్ కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ని విడుదల చేయగా.. ఆ ప్రోమోలో విజయ్ బిన్నీ (Vijay binny) మాస్టర్ కి జాను గట్టిగానే బిస్కెట్లు వేసినట్లు తెలుస్తోంది. ఇది చూసిన మాస్టర్ సిగ్గుపడడం.. దానికి మాస్టారు మాస్టారు మా మనసును గెలిచారు అంటూ బీజీలు వేయడం చూసి ఆడియన్స్ జాను పై మరిన్ని ట్రోల్స్ చేస్తున్నారు. ఈరోజు ఎట్లయితే గట్లా విజ్జూ (విజయ్ బిన్నీ) ను నా వాడ్ని చేసుకోవాలి అంటూ పర్ఫామెన్స్ చేసిన పాటలో జాను చెప్పింది. అయితే ఇక పర్ఫామెన్స్ అవ్వగానే నందు ఇంకాస్త సాగదీస్తూ.. మేము కూడా విజ్జూ అని పిలవచ్చా.. లేక వన్నెలాడి.. టిక్కులాడి వరకే పరిమితమా అని కూడా అడిగాడు.
ఇప్పటివరకు నా భార్య కూడా నన్ను అలా పిలవలేదు – విజయ్ బిన్నీ
దీనికి మాస్టర్ ఇప్పటివరకు నా భార్య కూడా నన్ను అలా పిలవలేదు అంటూ విజయ్ బిన్నీ కామెంట్లు చేశారు. వెంటనే విజయ్ బిన్నీ మాస్టర్ ని లవర్ బాయ్ విజ్జూ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటూ నందు కూడా అన్నాడు. ఇక విజయ్ బిన్నీ చెబుతుంటే జాను కూడా తెగ సిగ్గు పడిపోయింది. ఇలా ఈ సీన్ చూసి తట్టుకోలేక హైపర్ ఆది డైరెక్ట్ గా విజయ్ బిన్నీ సీటులో కూర్చున్నాడు. ఇకనుంచి నేను టీం లీడర్ గా కాదు జడ్జిగా చేస్తానని చెబితే.. రెజీనా ముందు డాన్స్ నేర్చుకో ఆ తర్వాతే జడ్జ్ చేద్దువు కానీ అంటూ పంచ్ వేసింది. మొత్తానికి అయితే ఈ ప్రోమో వైరల్ గా మారగా.. జాను లిరిపై మాత్రం విమర్శలకు గుప్పిస్తున్నారు.