BHEL Jobs: నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్. భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబందించి విద్యార్హతలు, పోస్టుల వివరాలు, ఉద్యోగ ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు, జీతం, దరఖాస్తు విధానం తదితర వివరాల గురించి స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో 515 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ప్రక్రియ జులై 16 నుంచి ప్రారంభ కానుంది. దరఖాస్తు కు చివరి తేది ఇంకా ప్రకటించలేదు. త్వరలో అది కూడా ప్రకటించనున్నారు. అఫీషియల్ వెబ్ సైట్ లో తెలియజేయనున్నారు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 515
భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఆర్టీజన్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: టెన్త్, ఐటీఐ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జులై 16
దరఖాస్తుకు చివరి తేది: త్వరలో తెలియనుంది.
వయస్సు: ఉద్యోగానికి అప్లై చేసుకునే వారి వయస్సు 27 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం ఉంటుంది. నెలకు రూ.29,500 నుంచి రూ.65,000 జీతం ఉంటుంది.
ఉద్యోగాలు – వెకెన్సీ వివరాలు:
ఫిట్టర్ : 176 ఉద్యోగాలు
వెల్డర్: 97 ఉద్యోగాలు
టర్నర్: 51 ఉద్యోగాలు
ఎలక్ట్రీషియన్ : 65 ఉద్యోగాలు
మెకానిస్ట్: 104 ఉద్యోగాలు
ఫౌండ్రీ మ్యాన్: 4 ఉద్యోగాలు
ఎలక్ట్రానిక్ మెకానిక్: 18 ఉద్యోగాలు
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://bhel.com/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. జులై 16న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉద్యోగం సాధించిన వారికి భారీ వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 515
దరఖాస్తుకు చివరి తేది: త్వరలో తెలియజేయనున్నారు.
ALSO READ: ICF Recruitment: టెన్త్ అర్హతతో 1010 ఉద్యోగాలు.. నెలకు రూ.7వేల స్టైఫండ్.. డోంట్ మిస్