Chandrababu TDP : రాజకీయ చాణక్యుడు చంద్రబాబు. 40 ఇయర్స్ ఇండస్ట్రీలో అనేక సంచలనాలు. ఆయన వ్యూహాలు ఎవరికీ అంతుచిక్కవు. రాష్ట్రంలో, కేంద్రంలో CBN ట్రాక్ రికార్డ్ అప్పడూ ఇప్పుడూ చెక్కు చెదరలేదు. ప్రస్తుతం NDA గవర్నమెంట్‌లో TDP నెంబర్ 2 పొజిషన్‌లో ఉంది. అలాగని ఢిల్లీ నెత్తిన ఎక్కి కూర్చునే అలవాటు ఆయనకు లేదు. అడిగితే ఎన్నైనా ఇస్తారు. అయినా, కేవలం రెండు కేంద్ర మంత్రి పదవులు మాత్రమే తీసుకున్నారు. రామ్మోహన్ నాయుడు, పెమ్మసానిలను అందలం ఎక్కించారు. ఏడాది తర్వాత మరో అనుకోని అవకాశం. ఈసారి సీనియర్ మోస్ట్ లీడర్ అశోక్ గజపతిరాజుకు గోవా గవర్నర్‌గా ఛాన్స్ ఇచ్చారు. ఇలా పరిస్థితులకు తగ్గట్టు నొప్పించక మెప్పించేలా వ్యవహరించడంలో చంద్రబాబు దిట్ట.
రాజు గారి రేంజ్ వేరు..
అశోక్ గజపతిరాజు. నిఖార్సైన నాయకుడు. పేరులోనే రాజరికం. తరగని సంపద. అందుకే లంచం ముట్టని నేతగా గుర్తింపు. గతంలో ఇదే ఎన్డీయే హయాంలో.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండేవారు రాజు గారు. ఆ పదవిలో చాలా ఒత్తిళ్లు ఉంటాయంటారు. చిన్న సంతకం పెడితే చాలు.. ఈజీగా సెటిల్ అవ్వొచ్చని చెబుతుంటారు. ఆయనే స్వయంగా విజయనగరానికి రారాజు. ఇలాంటి అశోకుడిని అలాంటి లాలూచీలు మభ్యపెట్టగలవా? ఎంతమంది ఎన్ని ఫైళ్లు పట్టుకుని వచ్చినా.. ఎవరితో ఎన్ని ఫోన్లు చేయించినా.. రూల్స్‌కు అగెనెస్ట్‌గా ఒక్క రిమార్క్ కూడా లేకుండా కేంద్రమంత్రిగా పని చేసిన క్రెడిట్ ఆయనది. ఈ విషయం స్వయంగా ఓ సందర్భంలో ప్రధాని మోదీనే చెప్పారు. అశోక్ చాలా హానెస్ట్ అంటూ పొగిడారు. చైన్ స్మోకింగ్ మినహా ఆయనకు ఎలాంటి దురలవాట్లూ లేవు. అంతటి సచ్చీలుడు కాబట్టే.. నిబద్దత కలిగిన తెలుగుదేశం నాయకుడిగా ఉండబట్టే.. ఎంతోమంది ఆశావహులు ఉన్నా.. అశోక్ గజపతిరాజు పేరునే గవర్నర్ జాబితాకు పార్టీ తరఫున సూచించారు అధినేత చంద్రబాబు. మన అశోకుడి పేరు వినగానే.. ప్రధాని మోదీ సైతం వెంటనే ఓకే చేసేశారని అంటున్నారు.
ఢిల్లీలో చంద్రబాబు మార్క్
గతంలోనూ ఇంతే. టీడీపీ మద్దతుతో 1999లో వాజ్‌పేయి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఆనాడు చంద్రబాబు డిమాండ్ చేసి ఉంటే ఎన్ని కేంద్ర పదవులైనా, ఎలాంటి కీలక శాఖలైనా ఇచ్చి ఉండేది బీజేపీ. కానీ, అనూహ్యంగా జీఎంసీ బాలయోగిని స్పీకర్‌గా ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు చంద్రబాబు. ఏకంగా లోక్‌సభాధిపతినే తన ఖాతాలో వేసుకుని ఔరా అనిపించారు. ఆ తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో బాలయోగి చనిపోవడం పార్టీకి తీరని లోటు. అంతకుముందు టీడీపీ ఎంపీ కింజారపు ఎర్నన్నాయుడుకు కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించారు. ఆ తర్వాతి కాలంలో రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందడం విషాదం. ఇప్పుడు ఎర్నన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడుకు సైతం కేంద్ర కేబినెట్‌లో స్థఆనం కల్పించి ఆ కుటుంబానికి, పార్టీ విధేయులకు సముచిత గౌరవం ఇచ్చారు చంద్రబాబు. లేటెస్ట్‌గా గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ఎంపికతో మరోమారు చంద్రబాబు మార్క్ నాయకత్వ లక్షణాలపై ప్రశంసలు వస్తున్నాయి.
Also Read : ఏపీలో మరో గిన్నిస్ రికార్డ్
హస్తినలో తెలుగు చాణక్యుడు..
చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో ఇలాంటి వ్యూహాలు, ఎత్తుగడలు, ఎదురుదెబ్బలు అనేకం కనిపిస్తాయి. ఎన్టీఆర్ హయాంలో నాదెండ్ల భాస్కరరావు కొట్టిన దొంగదెబ్బను ఎదుర్కోవడంతో.. చంద్రబాబులోని చాణిక్యుడు ప్రపంచానికి పరిచయం అయ్యారని చెబుతారు. నాదెండ్ల కుట్రను ఛేదిస్తూ.. ఎన్టీఆర్‌కు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఢిల్లీకి తీసుకెళ్లి.. రాష్ట్రపతి ముందు పరేడ్ చేయించిన వ్యూహం చంద్రబాబుదే అంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ.. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీయే.. ఇలా ప్రభుత్వాలు ఏవైనా చంద్రబాబు మార్క్ ఉండాల్సిందే. ఢిల్లీలో అనేకసార్లు చక్రం తిప్పిన కింగ్ పిన్ ఆయనే. ఎనీ డౌట్స్?