Nindu Noorella Saavasam Serial Today Episode : హాస్పిటల్ లో అమరేద్రకు ఆపరేషన్ చేస్తుంటారు డాక్టర్లు బయట కూర్చున్న మిస్సమ్మ భోరున విలపిస్తుంది. ఏడుస్తున్న పిల్లలను రాథోడ్ ఓదారుస్తుంటాడు. ఆరు కూడా ఏడుస్తుంది. నీ మంచి కోసం. నీ కుటుంబం బాగు కోసం చెప్తున్నాను అర్థం చేసుకో బాలిక అంటాడు గుప్త. ఆరు మాత్రం ఏడుస్తూనే ఉంటుంది. ఇంతలో ఆపరేషన్ థియేటర్ లోంచి డాక్టర్, సిస్టర్ బయటకు రాగానే ఎలా ఉందని కంగారుగా మిస్సమ్మ అడుగుతుంది. డాక్లర్, సిస్టర్ పలకకుండా లోపలికి వెళ్లిపోతారు. అమ్ము నాకు చాలా భయంగా ఉంది అంటూ అంజు భయపడుతుంటే.. మిస్సమ్మ వచ్చి అంజును ఓదారుస్తుంది.
రాథోడ్, మిస్సమ్మను ఓదారుస్తాడు. నువ్వే ఇలా ఏడిస్తే.. పెద్దసారు పెద్ద మేడం, పిల్లలను ఏవరు చూసుకుంటారని అంటాడు. మిస్సమ్మ ఏడుస్తూనే పిల్లలను ఏడవొద్దని ఓదారుస్తుంది. మమ్మల్ని ఏడవ వద్దు అని నువ్వెందుకు ఏడుస్తున్నావు మిస్సమ్మ అని అంజు అడుగుతుంది. గుప్తగారు నా కుటుంబానికి ప్రమాదం అంటే నా పిల్లలకు ప్రమాదం వస్తుందనుకున్నాను కానీ మా ఆయనకు ఇలాంటి ప్రమాదం వస్తుందని కలలో కూడా అనుకోలేదు అంటూ ఏడుస్తూ.. గుప్త గారు ఆయనకు ఏం కాదు కదా..? అని అడుగుతుంది ఆరు. అంతా దైవేచ్చా బాలిక నువ్వేం భయపడకు.. ధైర్యంగా ఉండు అంటూ ఓదారుస్తాడు గుప్త.
రామ్మూర్తి కంగారు హాస్పిటల్ దగ్గరకు వచ్చి బాబు గారే ఏమైంది. భాగీ ఫోన్ చేసి అర్జెంట్‌గా వచ్చేయమని చెప్పింది అని అడగ్గానే ఏమైందో చూద్దాం పదండి అని అందరూ కలిసి లోపలికి వస్తారు. అందరూ ఏడుస్తుంటారు. కోడలి మరణాన్ని జీర్ణించుకునే లోపే కొడుకు ఇలా బుల్లెట్ గాయంతో హాస్పిటల్ లో ఉన్నాడు. ఆ పెద్దవాళ్లు ఈ వయసులో ఎందుకు గుప్త గారు ఇన్ని కష్టాలు అంటూ ఆరు గుప్తను నిలదీస్తుంది. రామ్మూర్తి డాక్టర్ గారు ఏం చెప్పారమ్మా.. బాబు గారికి ఎలా ఉందంట అని అడగ్గానే మిస్సమ్మ ఏడుస్తూనే ఉంటుంది. ఏడవకు అమ్మా.. దేవుడు నీ జీవితంలోంచి ఇప్పటికే చాలా తీసుకున్నాడు. బాబుగారికి ఏమీ కాదు అంటూ ఓదారుస్తాడు.
అవును మిస్సమ్మ.. సార్‌కు ఇంత మంది ప్రేమ ఉండగా ఏమీ కాదు నువ్వు ఊరుకో మిస్సమ్మ అంటూ రాథోడ్ కూడా ఓదారుస్తాడు. నిర్మల, శివరాం కూడా ఓదారుస్తూ మిస్సమ్మను బయటకు వెళ్లి ఏమైనా తిని రమ్మని చెప్తారు. మిస్సమ్మ పలకదు. ఇంతలో మనోహరి ఈ ముసలోళ్లు ఎలాగూ ప్లేట్ ఫిరాయించారు. పిల్లలను అయినా మచ్చిక చేసుకుంటాను అనుకుంటూ పిల్లల్లూ మీరేనా కొంచెం ఏదైనా తిందురు రండి అని అడుగుతుంది. మాకు ఆకలిగా లేదని .. మా డాడీకి బాగయ్యే వరకు మేమేమీ తినం అంటారు. ఆ బుల్లేట ఏదో ఈ ముసలోళ్లకు తగిలి ఉంటే బాగుండేది. దేవడా అమర్‌కు ఏమీ కాకుండా చూడు. లేదంటే నాకు భవిష్యత్తు లేకుండా పోతుంది అని మనసులో అనుకుంటుంది మనోహరి.
ఇంతలో అమ్ము బాధగా మేము చిన్నపిల్లలం మాకంటే తెలియదు.. కానీ మీకు తెలుసు కదా..? మరి మీరెందుకు మమ్మల్ని వెళ్లమని ఎంకరేజ్ చేశారు అంటూ మనోహరిని నిలదీస్తుంది అమ్ము. అమ్మా పిల్ల రాక్షసి కరెక్టు పాయింట్ పట్టింది అని మనోహరి మనసులో అనుకుంటుంది. ఇంతలో పిల్లలు ఏడుస్తూ బయటకు వెళ్తారు. లోపల డాక్టర్లు ఆపరేషన్ చేస్తుంటారు. పిల్లలు హాస్పిటల్ లో ఉన్న గణపతి విగ్రహం దగ్గరకు వెళ్లి ప్రార్థిస్తారు. దేవుడా నీ మీద నమ్మకం పెట్టుకుంటే మా డాడీని కాపాడతావంట కదా ఫ్లీజ్ మా డాడీని కాపాడవా అంటూ అంజు వేడుకుంటుంది. అమ్మను తీసుకెళ్లిపోయావు. ఇప్పుడు డాడీని కూడా తీసుకెళ్లిపోతే మేమెలా బతకాలి అంటూ అమ్ము ప్రార్థిస్తుంది.
పిల్లలంటే నీకు చాలా ఇష్టమట. పిల్లుల ఏడిస్తే నీకు నచ్చదట కదా..? మరి మమ్మల్ని ఎందుకిలా ఏడిపిస్తున్నావు అంటూ ఆకాష్ అడుగుతాడు. ఎక్స్ కర్షన్ కు వెళ్లి తప్పు చేసింది మేమైతే పనిష్ మెంట్ ఎందుకు మా నాన్నకు ఇస్తున్నావు అంటూ ఆనంద్ బాధపడతాడు. పక్కన అమ్మ లేకుంటేనే బాధగా ఉంది. ఇప్పుడు మా డాడీ కూడా లేకపోతే ఎలా అంటూ అమ్ము బాధపడుతుంది. పిల్లల బాధను చూడలేక ఆరు పక్కకు వెళ్లి భోరున ఏడుస్తుంది. ఆరును చూసి గుప్త బాధపడుతాడు.
ఇంతలో రిసెప్షన్‌లో నర్సులు ఇద్దరూ అమర్‌కు సీరియస్ గా ఉందని అంతా దేవుడి దయ అని మాట్లాడుకోవడం విన్న ఆరు ఏడుస్తూ గుప్తను మా ఆయనకు ఏం జరిగింది చెప్పండి.. ఏదో ఒకటి చేసి ఆయనకు ఏం కాకుండా చూడండి అని అడుగుతుంది. దీంతో గుప్త క్షమించు బాలిక.. నీకు ఏమీ తెలియక బాధపడుతున్నావు.. నాకు అన్ని తెలిసి ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నాను అంటాడు. అయన బతకాలంటే నేను ఏం చేయాలో చెప్పండి గుప్త గారు. ఆయన లేకుంటే పిల్లలు, మిస్సమ్మ బతకలేరు అంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?