trinayani serial today Episode: వల్లభ నీ తింగరి తనంతో ఏది పడితే అది చెప్పకు అంటుంది తిలొత్తమ్మ.. అదేం లేదని నేను చెప్పేది సరిగ్గా వినండి అంటూ ఇప్పుడు పెద్ద మరదలు నయని రావాలంటే త్రినేత్రి పోవాలి కదా అంటాడు. అందరూ షాకింగ్ గా చూస్తుంటే ఇంతలో నేత్రి కాఫీ తీసుకుని వస్తుంది. నేత్రిని చూసిన తిలొత్తమ్మ, వల్లభ షాక్ అవుతారు. కాఫీ తాగండి అమ్మా అని విశాల్ చెప్పగానే తాగుతాం కానీ కాఫీ ఎలా చేసింది అని తిలొత్తమ్మ అడుగుతుంది. ఎలా చేస్తారేంటి..? పాలు వేడి చేసి కాఫీ పొడి కలిసి చేస్తారు అని పావణమూర్తి చెప్పగానే.. అలా కాదు.. కాపీ చేస్తే పేలలేదా..? అని వల్లభ అంటాడు.
పేలడం ఏంటి అని విశాల్ అడుగుతాడు. అదే పేలడం కాదు కాలడం.. స్టవ్ ఆన్ చేసినప్పుడు చేయి కాలలేదా..? అని వాడి అర్థం అంటుంది తిలొత్తమ్మ.. రోజూ వంటే చేసే నయనిని తెలియదా..? అంటూ సుమన అంటుంది. ఇంతలో కాఫీ తీసుకుని తాగుతారు తిలొత్తమ్మ, వల్లభ.. వాల్లు కాఫీ తాగుతుంటే తాగండి.. తాగండి తాగాక ఉంటుంది మీకు అని నేత్రి మనసులో అనుకుంటుంది. పిల్లకు ఏమీ కాలేదు దీనికి ఏమీ కాలేదు అని తిలొత్తమ్మ మనసులో అనుకుంటుంది. ఇంతలో కాపీ ఎలా ఉంది అత్తయ్యా అని నేత్రి అడుగుతుంది. బాగుంది అని తిలొత్తమ్మ చెప్తుంది. ఇంత మంచిగా చేస్తుందని తెలియక ఆ లీక్ చేశాము అంటాడు వల్లభ. ఏం లీకు అని విక్రాంత్ అడగ్గానే.. వల్లభ, తిలొత్తమ్మ కడుపులో తిప్పుతుందని వెళ్లిపోతారు.
రూంలో కూర్చుని మోషన్స్ తో సచ్చిపోతున్నాం అని తిలొత్తమ్మ, వల్లభ మాట్లాడుకుంటుంటే నేత్రి వచ్చి ఈ పంచదార తినండి మీ మోషన్ తగ్గుతుందని నేత్రి చెప్పగానే.. మేము బాత్రూంలోకి బయటకు తిరుగుతుంటే చూసి ఆనంద పడుతున్నావా..? త్రినేత్రి అని తిలొత్తమ్మ అనగానే అచ్చు తప్పు నేత్రి కాదిక్కడ.. నయని త్రినయని అంటుంది. వల్లభ, తిలొత్తమ్మ షాక్ అవుతారు. నాకు వచ్చిన కోపానికి మీకు కాఫీలో విషం కలపాల్సింది అంటూ మీ పెద్ద కొడుకు అమాయకత్వమే మీకు శాపంగా మారుతుంది అత్తయ్యా.. ఎంత పెద్ద సీక్రెట్ అయినా చాలా సేపు మోయలేని బలహీనతే మీకు శాపంగా మారిందని నయని చెప్పగానే తిలొత్తమ్మ, వల్లభను తిడుతుంది.
హాల్లో ఫోన్ చూస్తూ కూర్చున్న తిలొత్తమ్మను చూసిన గాయత్రి పాప వెనక నుంచి వెళ్లి చున్నీతో తిలొత్తమ్మ మెడకు చుట్టి లాగుతుంది. తిలొత్తమ్మ గిలాగిలా కొట్టుకుంటుంది. ఇంతలో పైనుంచి వచ్చిన దురందర, తిలొత్తమ్మను చూసి కంగారు అరుస్తూ పరుగెత్తుకొస్తుంది. అందరూ కిందకు వస్తారు. తిలొత్తమ్మన చూసి కంగారు పడతారు. విశాల్ సోఫా వెనక్కి వెళ్లి చూస్తూ ఎవరూ ఉండరు. తిలొత్తమ్మ స్పృహ కోల్పోతే చనిపోయారా అని సుమన అడుగుతుంది. ఇంతలో నయని వెళ్లి వాటర్ తెచ్చి చల్లగానే తిలొత్తమ్మ స్పృహలోకి వస్తుంది.
వల్లభను కొడుతుంది. ఎప్పుడూ పక్కనే ఉండేవాడివి ఇప్పుడే ఎక్కడికి చచ్చావు అంటుంది. వాష్ రూంకు వెళ్లాను అని వల్లభ చెప్తాడు. అసలు నాకు ఊపిరి ఆడకుండా చేసింది ఎవరు అంటూ తిలొత్తమ్మ అడగ్గానే ఎవరూ లేరని.. మేము ఇక్కడకు రాగానే ఎవ్వరూ లేరని అంటారు. ఎవరై ఉంటారని దురందర అడుగుతుంది. గాయత్రి అమ్మగారు అని నయని చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. ఎక్కడుంది.. మమ్మీ ఎక్కడుందో చూడు నీకు కనిపిస్తుంది కదా..? అంటాడు వల్లభ. కానీ గాయత్రి పాప మెలుకువగానే ఉంది కదా అని సుమన చెప్తుంది.
ఏమో నాకైతే కనిపించింది అని నయని చెప్తుంది. చిన్న వదిన ఏం చేసిందని గాయత్రి వదిన చంపాలనుకుంది అని దురందర అడుగుతుంది. ఆమె పేరు మీద ఉన్న కంపెనీ చైర్మన్ కావాలని అనుకున్నది కాబట్టే చంపాలనుకుందేమో అంటాడు పావణమూర్తి. అక్క వస్తే నాకు కనిపించేది కదా…? తను నయనియే కాదు అంటుంది తిలొత్తమ్మ. అయితే నాకు కూడా మీరు బాబుగారిని పెంచిన తల్లి తిలొత్తమ్మ అత్తయ్యవు కాదేమో అంటుంది నయని. దీంతో తిలొత్తమ్మ కోపంగా నయని మీదకు వెళ్లగానే నేత్రి.. తిలొత్తమ్మ చేయిని వెనక్కి విరిచి పట్టుకుంటుంది. ఇంతలో గాయత్రి పాప రాగానే తిలొత్తమ్మను వదిలి పాపను ఎత్తుకుని వెళ్లిపోతుంది నయని. ఇంతటితో త్రినయని సీరియల్ నేటి ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?