BigTV English

Nindu Noorella Saavasam Serial Today December 1st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:   తీవ్రవాదులకు చుక్కలు చూపించిన మిస్సమ్మ – గన్‌ తీసుకుని అటాక్‌ చేసిన శివరాం

Nindu Noorella Saavasam Serial Today December 1st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:   తీవ్రవాదులకు చుక్కలు చూపించిన మిస్సమ్మ – గన్‌ తీసుకుని అటాక్‌ చేసిన శివరాం

Nindu Noorella Saavasam Serial Today Episode : తీవ్రవాదులు డోర్‌ కొడుతుంటారు. శివరాంకు అమర్‌ ఫోన్‌ చేసి నేను వచ్చే వరకు వాళ్లను ఎలాగైనా డైవర్ట్‌ చేయండి అని చెప్తాడు. సరేనని మనోహరిని, నిర్మలను లోపలికి పంపిస్తాడు శివరాం. తన పాత గన్‌ తీసుకుని డోర్‌కు ఎదురుగా చైర్‌ వేసుకుని కూర్చుని ఉంటాడు. తీవ్రవాదులు డోర్‌ పగులగొట్టి లోపలికి వస్తుంటే శివరాం కాలుస్తాడు. బుల్లెట్‌ ప్రూప్‌ ఉండటంతో వాళ్లకు ఏం కాదు. లోపలికి వచ్చి తీవ్రవాదులు శివరాంను తన్ని కింద పడేసి పిల్లల కోసం లోపలికి వెళ్తుంటే మిస్సమ్మ వచ్చి వాళ్లను కొడుతుంది.


లోపల జరగుతుంది కిటికీలోంచి చూస్తున్న ఆరు షాక్‌ అవుతుంది. మిస్సమ్మ మీరు కూర్చోండి మామయ్యా అంటుంది. ఆరు ఆశ్చర్యంగా గుప్తగారు ఇక్కడ ఏం జరగుతుంది అని అడుగుతుంది. గుప్త చూసి షాక్‌ అవుతాడు. తీవ్రవాదులను మిస్సమ్మ  కొడుతుంటే పిల్లలు, మనోహరి, నిర్మల బయటకు వచ్చి చూసి షాక్‌ అవుతారు. మిస్సమ్మ దెబ్బలకు తీవ్రవాదులు పారిపోతారు. పిల్లలందరూ వచ్చి మిస్సమ్మను హగ్‌ చేసుకుంటారు. ఆరు హమ్మయ్యా థాంక్యూ దేవుడా..? అని ఊపిరి పీల్చుకుంటుంది. చాలా భయం వేసింది మిస్సమ్మ అంటుంది అమ్ము.

ఏవండి మీకేం కాలేదుగా.. మిస్సమ్మ నువ్వు కనక లేకుంటే ఇవాళ పిల్లలు, ఆయన, మేమంతా బతికి ఉండేవాళ్లం కాదు మిస్సమ్మ అంటూ దండం పెడుతుంది నిర్మల. ఇంతలో అమర్‌ వస్తాడు. పిల్లలందరూ అమర్‌ దగ్గరకు వెళ్తారు. అమర్‌ ఈ కుటుంబాన్ని కాపాడే క్రమంలో నేను విఫలం అయ్యాను. సమయానికి మిస్సమ్మ వచ్చి మమ్మల్ని అందర్ని కాపాడింది. ఒకవేళ మిస్సమ్మే సమయానికి రాకుంటే ఈ పిల్లలు మేము అందరం శవాలుగా మారిపోయి ఉండే వాళ్లం అంటాడు శివరాం. దీంతో అమర్ ఏమోషనల్‌ గా వెళ్లి మిస్సమ్మను హగ్‌ చేసుకుంటాడు. మనోహరి షాక్‌ అవుతుంది. థాంక్స్‌ మిస్సమ్మ.. థాంక్యూ సో మచ్‌ అని అమర్‌ చెప్పగానే మిస్సమ్మ థాంక్యూ అంటుంది.


తర్వాత గార్డెన్‌ లో కూర్చున్న ఆరు మిస్సమ్మ తీవ్రవాదులను కొట్టింది గుర్తు చేసుకుంటుంది. అబ్బబ్బా అసలు మిస్సమ్మ ఒక్కొక్కరిని ఏం కొట్టింది గుప్త గారు అంటుంది ఆరు. మా నరకం నందు కూడా అటుల శిక్షించరు. యమపురి వాసులం నరకమున ఎన్నో శిక్షలను స్వయముగా వీక్షించిన ఈ చిత్ర విచిత్రగుప్తుడినే భయ బ్రాంతులకు గురి చేసింది అటుల శిక్షించినది అంటాడు గుప్త. అసలు మిస్సమ్మలో ఈ యాంగిల్‌ ఉందని ఎప్పుడు గెస్‌ చేయలేదు గుప్తగారు అంటుంది ఆరు. ఆ ప్లేస్‌ లో నేను ఉన్నా కూడా నేను నా పిల్లలను కాపాడుకోలేకపోయేదాన్ని గుప్త గారు.

నా ప్రాణం పోయే వరకు పోరాడేదాన్నేమో కానీ వాళ్ల ప్రాణాలు కాపాడేదాన్ని కాదు. పిల్లలకు తల్లిగా ఇంటికి కోడలుగా మిస్సమ్మే కరెక్టు అనిపిస్తుంది గుప్త గారు అంటుంది ఆరు. దీంతో గుప్త.. నిన్నటి వరకు ఆ బాలిక నీ పతి దేవునకు దగ్గర అవుతున్నదని బాధపడ్డావు. నేడు ఆ బాలికే గొప్పదని అంటున్నావు అనగానే నా కథ ముగిసిపోయిందని తెలిసినా.. ఆయన జీవితంలో మిస్సమ్మ ఉందనడానికి కొంచెం టైం పడుతుంది గుప్త గారు అంటుంది ఆరు. ఇంతలో ఆరు భయపడుతూ.. మిస్సమ్మ అంత మందిని కొట్టింది కదా… రేపు ఎప్పుడైనా ఆయన మీద కోపం వచ్చి ఆయన్ని కూడా కొడితే ఏంటి పరిస్థితి అంటూ భయపడుతుంది ఆరు. సరియైన అనుమానమే వచ్చింది అంటాడు గుప్త.

మిస్సమ్మ ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తుంటే.. పిల్లలు కిందకు వస్తారు. అంజు, మిస్సమ్మను చూస్తూ.. భయపడుతుంది. అంజు ఎందుకు అంత భయపడుతున్నావు అని అమ్ము అడిగితే.. నేను మిస్సమ్మను ఇంతకు ముందు తిట్టింది గుర్తుకు వస్తుంది. నిన్న రౌడీలను కొట్టింది గుర్తుకు వచ్చింది అందుకే భయపడుతున్నాను అంటుంది. చూశారా అమ్ము ఏమీ తెలియనట్టు మిస్సమ్మ డబుల్‌ యాక్షన్‌ చేస్తుంది అని అంజు అంటుంది. ఇంతలో మిస్సమ్మ వచ్చి పిల్లలు ఎందుకు ఇంత త్వరగా లేచారు ఇవాళ లీవ్‌ కదా.. అంటుంది.

దీంతో అంజు లేదు మిస్సమ్మ ఇవాళ్టీ నుంచి అన్ని రూల్స్‌ ప్రకారమే జరుగుతాయి అంటుంది. ఇంతలో రాథోడ్ వచ్చి అవును మిస్సమ్మ నిన్న  వాళ్లను కొట్టడం కొంచెం ఆపేసి.. మేము వచ్చాక కొట్టి ఉంటే బాగుండు కదా..? నీ కొట్టుడు గురించి అందరూ కథలు కథలుగా చెప్తున్నారు. మేము వచ్చాక కొడితే మేము చూసేవాల్లం కదా..? అంటాడు. అయినా నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు సార్‌ కు చెప్తాను నువ్వు కూడా ఆర్మీలో జాయిన్‌ అవ్వు అంటాడు.

తర్వాత ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మిస్సమ్మ దగ్గరకు ఆరు వచ్చి నిన్న  వాళ్లను ఎలా కొట్టావు అని అడుగుతుంది. అవసరం నేర్పించింది అక్కా అంటూ పిల్లల కోసం సెల్ఫ్‌ డిఫెన్స్‌ నేర్చుకున్నాను. ఆరు అక్క అప్పగించిన పిల్లల బాధ్యతను ఆయన నాకు ఇచ్చారు. దాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనుకున్నాను అక్కా అంటూ మిస్సమ్మ చెప్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

GudiGantalu Today episode: రోహిణి పై బాలుకు అనుమానం.. రెండో పెళ్లికి సత్యం రెడీ.. ఫ్రెండ్ ను కలిసిన బాలు..

Nindu Noorella Saavasam Serial Today october 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు షాక్ ఇచ్చిన అంజు  

Illu Illalu Pillalu Today Episode: వేధవతికి క్లాస్ పీకిన రామరాజు.. ధీరజ్ కు స్ట్రాంగ్ వార్నింగ్.. భాగ్యం కు మైండ్ బ్లాక్..

Brahmamudi Serial Today October 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ప్లాన్ సక్సెస్‌ – కావ్యను కలవని డాక్టర్‌

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Intinti Ramayanam Today Episode: డబ్బుల కోసం రచ్చ చేసిన శ్రీయా.. అన్నదమ్ముల మధ్య గొడవ..పల్లవి ప్లాన్ సక్సెస్..

Brahmamudi Serial Today October 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన సందీప్‌ – డాక్టర్‌ కలవాలనుకున్న కావ్య

GudiGantalu Today episode: రోహిణి ప్లాన్ ఫెయిల్.. శృతికి తెలిసిన నిజం..ఇంట్లో రచ్చ చేసిన ప్రభావతి..

Big Stories

×