OTT Movie : ఓటిటిలో ప్రస్తుతం కొరియన్ సినిమాల హడావిడి కాస్త ఎక్కువగానే ఉంది. ఈ సినిమాలను కూడా మంచి కంటెంట్ తో తెరమీద ప్రజెంట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు కొరియన్ వెబ్ సిరీస్ లతోపాటు సినిమాలను కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తో కొరియన్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “ఐయామ్ డయింగ్” (Iam Dying). ఈ మూవీలో హీరోకి క్యాన్సర్ ఉందని తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఉన్న అతనికి ఈ విషయం తెలియగానే డీలా పడిపోతాడు. కొద్ది రోజులలో చనిపోతాను అనుకున్న హీరో, తన జీవితాన్ని ఎలా ముగించాలనుకుంటాడో మూవీ స్టోరీలో తెలుసుకుందాం. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
హీరో ఒక కంపెనీలో మంచి జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటాడు. ఇతడు ఒంటరివాడు కావడంతో ఇతని లైఫ్ లో ఎవరూ ఉండరు. ఆఫీసులో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. అయితే ఆ అమ్మాయికి ఇదివరకే బాయ్ ఫ్రెండ్ ఉండడంతో తన ప్రేమని రిజెక్ట్ చేస్తుంది. ఇలా ఉండగా ఒక రోజు హీరోకి కడుపునొప్పి వస్తుంది. హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేసుకోగా, డాక్టర్ క్యాన్సర్ అని చెప్తాడు. మూడు నెలల కన్నా ఎక్కువగా బ్రతికే అవకాశం లేదంటూ షాక్ ఇస్తాడు. హీరో ఈ మూడు నెలలు ఎలా గడపాలని ఆలోచిస్తూ, తను చేస్తున్న జాబ్ కి రిజైన్ చేస్తాడు. ఈ విషయం తనలోనే ఉంచుకొని బాధపడుతూ ఉంటాడు. తన జీవితంలో ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తూ ఉండగా అతనికి ఎవరూ కనిపించరు. అయితే ఆఫీసులో ఉండే మరొక అమ్మాయి హీరోని లవ్ చేస్తూ ఉంటుంది. హీరోకి మాత్రం ఆ అమ్మాయి అంటే అంతగా ఇష్టం ఉండదు. ఒకరోజు ఆ అమ్మాయి హీరోతో ఎందుకు జాబ్ రిజైన్ చేశావంటూ నువ్వంటే నాకిష్టమని చెప్తుంది. అయితే హీరో ఆమెను నువ్వు అందంగా లేవంటూ ఎగతాళి చేస్తాడు. ఆ తర్వాత బాధపడి, నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావని అడుగుతాడు.
ఆ విషయం నాకు తెలియదు నువ్వంటే నాకు ఇష్టం అంటూ ఆమె చెప్తుంది. హీరో కూడా తన లైఫ్ లో ఎవరూ లేకపోవడంతో ఈ అమ్మాయితో మిగతా రోజులు హ్యాపీగా గడపాలి అనుకుంటాడు. ఒకరోజు ఈమెతో ఏకాంతంగా కూడా గడుపుతాడు. అయితే అయితే కొద్ది రోజుల్లో ఎలాగో చనిపోతాను ఆ తర్వాత ఈమెను బాధ పెట్టడం ఇష్టం లేదని అనుకుంటాడు. హీరోయిన్ తో నాకు క్యాన్సర్ ఉందని, నానుంచి దూరంగా వెళ్లిపో అని గట్టిగా అరెస్తూ చెప్తాడు. విషయం కనుక్కోవాలని హీరోయిన్ హాస్పిటల్ కి వెళుతుంది. అయితే అక్కడ ఒక పిచ్చి వాడు డాక్టర్ సీట్లో కూర్చొని కొంతమందికి ఇలా చెప్తుండగా, అతనిని మెంటల్ హాస్పిటల్ కి పట్టుకొని పోతూ ఉంటారు. విషయం అర్థమై హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్తుంది. హీరో నేను కొద్ది రోజులలో చచ్చిపోతున్నాను అంటూ ఆమెకేసి చూస్తాడు. హీరోయిన్ హీరోని చూసి గట్టిగా నవ్వుతూ ఉంటుంది. చివరికి హీరోకి క్యాన్సర్ లేదని తెలుస్తుందా? హీరో హీరోయిన్లు మళ్లీ కలసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ కొరియన్ మూవీని తప్పకుండా చూడండి.