OTT Movie : హర్రర్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలను చూస్తున్నంతసేపు మూవీ లవర్స్ టెన్షన్ పడుతూనే ఉంటారు. ఈ సినిమాలలో కొన్నిసీన్స్ వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంటాయి. కొన్ని సినిమాలు సరదాగా సాగిపోతూ ఉంటాయి. అయితే మరి కొన్ని సినిమాలు చూడాలంటే గుండె ధైర్యం చాలా కావాలి. గుండెల్లో దడ పుట్టించే ఒక మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “ది వెల్” (The Well). ఈ మూవీలో హీరోయిన్ ఖరీదైన పెయింటింగ్ లను శుభ్రపరిచే పని మీద వచ్చి పెయింటింగ్ లో ఉన్న దయ్యం బారిన పడుతుంది. ఈ మూవీ కాస్త వైలెంట్ గానే ఉంటుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ ఖరీదైన పెయింటింగ్ లను శుభ్రపరిచే కాంట్రాక్ట్ పని మీద ఒక ఊరికి వెళ్తూ ఉంటుంది. హీరోయిన్ ప్రయాణం చేస్తున్న బస్సులో మరొక ముగ్గురు అదే ఊరికి ప్రయాణం చేస్తారు. వాళ్లు హీరోయిన్ తో మాటలు కలిపి పరిచయం చేసుకుంటారు. ఆ ముగ్గురు ఆ ఊరిలో జంతువుల ఫోటోలు తీయడానికి వెళుతూ ఉంటారు. బస్సు దిగగానే ఎవరి పని మీద వాళ్ళు వెళ్తారు. హీరోయిన్ ఒక ఇంట్లో పెయింటింగ్ మెరుగులు దిద్దడానికి సిద్ధమవుతుంది. ఆ పెయింటింగ్ ఒకవేళంలో పెట్టాలని, వారంలో పూర్తి చేయాలని ఆ ఇంటి ఓనర్ చెప్తుంది. అయితే అది రెండు నెలలు పడుతుందని హీరోయిన్ చెబుతుంది. ఇంట్లో ఉండి చేస్తే వారంలో కంప్లీట్ చేయగలను అని హీరోయిన్ చెబుతుంది. ఇలా ఉంటే హీరోయిన్ మెరుగులు దిద్దే పెయింటింగ్ ఒక దయ్యం ఆకారంలో ఉంటుంది. ఆ పెయింటింగ్ మెరుగులు దిద్దుతున్నప్పుడు ఆమెకు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. ఈ క్రమంలోనే ఈమెతో పాటు ప్రయాణించిన ముగ్గురు ఆ ఇంట్లో ఒక గదిలో బంధించబడతారు. వారిని ఒక బలమైన వ్యక్తి ఒక్కొక్కరిని చంపుతూ, ఆ శవాలను ఆహారంగా దయ్యాలకు విసిరేస్తు ఉంటాడు.
ఆ ముగ్గురిలో ఇద్దరిని ఘోరంగా చంపి ఆ మాంసాన్ని ఆహారంగా దయ్యానికి వేస్తాడు. మరొక అమ్మాయి భయంతో వణికిపోతూ ఉంటుంది. హీరోయిన్ కి ఈ విషయం ఆ ఇంటి ఓనర్ కూతురు చెప్తుంది. ఇంటి ఓనర్ మనిషి కాదని ఆమె 500 సంవత్సరాల క్రితం నుంచి ఈ పెయింటింగ్ వల్ల యవ్వనంగా ఉందని చెబుతుంది. ఈ పెయింటింగ్ ని మెరుగులు దిద్దితే మరో 500 సంవత్సరాలు ఆమె యవ్వనంగా ఉంటుందని చెప్తుంది. హీరోయిన్ ఈ విషయాన్ని సరదాగా తీసుకుంటుంది. అయితే ఆమె హీరోయిన్ కి ఆ ఇంట్లో ఒక గదిలో జరుగుతున్న ఈ అరాచకాన్ని చూపిస్తుంది. అది చూసి చివరికి హీరోయిన్ అక్కడ్నుంచి బయట పడగలుగుతుందా? ఆ పెయింటింగ్ కు హీరోయిన్ ఒక రూపం ఇస్తుందా. ఆ నరరూప రాక్షసుడు వీళ్ళందర్నీ కూడా చంపేస్తాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి.