BigTV English

OTT Movie : భార్యకు అచ్చం భర్త లాగా కనిపించే బాయ్ ఫ్రెండ్… హెబ్బా పటేల్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్

OTT Movie : భార్యకు అచ్చం భర్త లాగా కనిపించే బాయ్ ఫ్రెండ్… హెబ్బా పటేల్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్

OTT Movie : ఓటిటిలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంత సింగిల్ గా చూడాల్సిన సీన్స్ ఉన్నా సరే వెనకాడకుండా, ఎవరు లేని టైం చూసుకుని మరీ అలాంటి సినిమాలపై ఒక లుక్కెయ్యడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు మూవీ లవర్స్. అలా బ్యూటిఫుల్ సినిమాలంటే పడి చచ్చే వారి కోసమే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీ టైటిల్ ఏంటి? ఏ ఓటిటిలో చూడొచ్చు? అని వివరాల్లోకి వెళ్తే…


ఈటీవీ విన్ (etv win)

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమాలో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించగా, సుమన్ ఊట్కూరు హీరోగా నటించారు. ఈ మూవీ పేరు “సందేహం” (Sandeham) . ఈ లవ్ అండ్ ఎంగేజ్మెంట్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం ఈటీవీ విన్ (etv win) అనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఊరికి ఉత్తరాన అనే సినిమా డైరెక్టర్ సతీష్ పరమ మీద ఈ మూవీకి కూడా దర్శకత్వం వహించారు. విష్ణు వర్షిని క్రియేషన్స్ బ్యానర్ పై సత్యనారాయణ పర్చా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో హెబ్బా పటేల్ నటనకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఇక ఓటిటిలో టాప్ లో ట్రెండింగ్ అవుతున్న ఈ మూవీలో శ్రీనివాస్ భోగి రెడ్డి, రాసిక శెట్టి, శ్వేతా వర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు.


కథలోకి వెళ్తే…

ఈ సినిమాలో హర్ష అనే అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయి శృతిని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఇది లవ్ మ్యారేజ్ లో కాకుండా పక్కాగా ప్లాన్ చేసి అరేంజ్డ్ మ్యారేజ్ లా చేసుకుంటాడు. ఫస్ట్ నైట్ రోజు శృతి హీరోకి షాక్ ఇస్తుంది. తనకు కొంచెం టైం కావాలని అడుగుతుంది. మరోవైపు అచ్చం భర్త లాగే ఉండే ఆర్య అనే అబ్బాయి హీరో ఉంటున్న అపార్ట్మెంట్ లోకి వస్తాడు. ఆ తర్వాత హర్ష స్తుతిలతో అతనికి పరిచయం పెరుగుతుంది. అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చి అతను ఇబ్బంది పెట్టి వెళ్తూ ఉంటాడు. కానీ శృతి తో ఆర్య మసులుకునే విధానాన్ని హర్ష తట్టుకోలేక పోతాడు. ఏం జరిగింది అనే విషయాన్ని కనిపెట్టడానికి హీరోయిన్ కి తెలియకుండా ఓ మెంటల్ ప్లాన్ వేస్తాడు.

హీరోయిన్ భర్త తను కరోనాతో చనిపోయినట్టు ఫ్యామిలీ డాక్టర్ ద్వారా చెప్పిస్తాడు. అందరూ అతను చనిపోయాడు అనుకుంటున్న టైంలో తన చెల్లికి ఒక మిస్టరీ కాల్ వస్తుంది. దీంతో అనుమానం వచ్చిన హీరో చెల్లి తన అన్నయ్య నిజంగానే చనిపోయాడా అని ఆరా తీయడం మొదలు పెడుతుంది. మరి చివరికి ఆమె హీరో చనిపోయాడా లేదా అనే విషయాన్ని కనిపెట్టగలిగిందా? పోలీసులు హెబ్బాను ఎందుకు అరెస్ట్ చేస్తారు? అనే సందేహాలు తీరాలంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఈటీవీ విన్ (etv win) లో స్ట్రీమింగ్ అవుతున్న “సందేహం” (Sandeham) అనే ఈ సినిమాపై ఒక లుక్ వెయ్యండి.

Related News

OTT Movie : పెళ్లి కోసం అల్లాడే సాఫ్ట్వేర్… చక్కిలిగింతలు పెట్టే కన్నడ కామెడీ మూవీ

OTT Movie : భర్తపై అనుమానంతో భార్య అరాచకం… మంత్రి కూతురా మజాకా ? మస్ట్ వాచ్ మలయాళ మూవీ

OTT Movie : ట్రాన్స్ జెండర్ పై మోహం… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie : అర్దరాత్రి అపార్ట్మెంట్లో వింత సౌండ్స్… డోర్ తీస్తే గుండె జారిపోయే సీన్లు… ఈ హర్రర్ మూవీ అరాచకం సామీ

OTT Movie : 86 మంది సజీవ దహనం, 1.5 లక్షల ఎకరాలు ధ్వంసం… వణికించే ట్రూ వైల్డ్ ఫైర్ సర్వైవల్ డ్రామా

OTT Movie : డబ్బు కోసం డర్టీ గేమ్స్… ప్రపంచ కుబేరుడిని బురిడీ కొట్టించి కోట్లు కొల్లగొట్టే రూత్లెస్ థీఫ్… నెవర్ బిఫోర్ హీస్ట్ థ్రిల్లర్

OTT Movie : నాలుగడుగుల అంకుల్ తో ఆరడుగుల ఆంటీ డేటింగ్ …. వద్దంటూనే వదలకుండా ఆ పని … క్లైమాక్స్ వరకు అరుపులే

OTT Movie : ఫ్రెండ్ భార్యతో యవ్వారం… నిద్ర కరువయ్యే కథ సామీ… ఆ సీన్లు కుడా

Big Stories

×