Nindu Noorella Saavasam Serial Today Episode : ఆరు కోసం ఇళ్లంతా వెతికిన మనోహరి అనుమానంగా బాబ్జీకి ఫోన్ చేస్తుంది. ఆరు ఆత్మ కనిపించడం లేదని చెప్తుంది. దీంతో బాబ్జీ తనకు తెలిసిన ఒక స్వామిజీ ఉన్నాడని చెప్తాడు. బాబ్జీ చెప్పినట్టే ఆ స్వామిజీని కలిసి ఇంటికి తీసుకొస్తుంది మనోహరి. అమర్ ఇంట్లోకి వచ్చిన స్వామిజీ ఆరు ఆత్మ ఇంట్లోనే తిరిగిందని చెప్తాడు. ఆత్మ తిరిగిన ఉనికి తనకు తెలుస్తుందని చెప్పడంతో మనోహరి భయపడుతుంది. ఇప్పుడు ఆత్మ ఇక్కడే ఉందా స్వామి అని మనోహరి అడుగుతుంది. ఇప్పుడు ఆత్మ ఇంట్లో లేదని స్వామిజీ చెప్పగానే.. అంటే అరుంధతి శాశ్వతంగా భూలోకం వదిలి వెళ్లిపోయిందా..? ఇంకెక్కడైనా ఉందా స్వామి అని అడుగుతుంది మనోహరి. అయితే ఆ విషయం ఆ అమ్మాయి ఫోటో చూస్తేనే చెప్తానని స్వామిజీ అనడంతో మనోహరి వెంటనే పైకి వెళ్లి ఆరు ఫోటో తీసుకొచ్చి స్వామిజీకి ఇస్తుంది.
అరుంధతి ఫోటో చూసిన స్వామిజీకి మొత్తం తెలిసిపోతుంది. దీంతో స్వామిజీ ఆరు ఆత్మ ఇంకో శరీరంలోకి ప్రవేశించిందని చెప్తాడు. దీంతో మనోహరి షాక్ అవుతుంది. భయంతో ఏంటి స్వామి మీరు చెప్పేది. ఆత్మ మనిషిగా మారడం ఏంటి.. అసలు అలా ఎక్కడైనా జరుగుతుందా..? అని అడుగుతుంది. దీంతో స్వామిజీ కోట్లల్లో ఒక్కరికి ఇలా జరుగుతుందని ఏ వందేళ్లకో.. వెయ్యేళ్లకో ఒకరికి ఇలా జరుగుతుంది. ఆ అమ్మాయి చేసిన పుణ్యానికి ఆ ఈశ్వరుడే దిగి వచ్చి ఆ ఆత్మకు పునర్జన్మను ప్రసాదించాడు అని చెప్పిన స్వామిజీ మనోహరిని ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తాడు. లేదంటే నువ్వు చీకట్లో కలిసిపోయే ప్రమాదం ఉందంటాడు. అలా జరగకూడదని దీనికి ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పండి స్వామి అని అడుగుతుంది మనోహరి.
ఆలోచించిన స్వామిజీ దీనికి పరిష్కారం ఒక్కటేనని అది నువ్వు ఆ అమ్మాయి దారికి అడ్డు తప్పుకోవడమేనని ఇప్పుడు నువ్వేం చేసినా నీకే ప్రమాదం అని చెప్తాడు స్వామిజీ. దీంతో భయంతో వణికి పోతున్న మనోహరి అంటే అరుంధతి అందరి ముందు నా నిజాలు చెప్తుందా..? నన్ను ఇంట్లోంచి గెంటివేయిస్తుందా..? అని అడుగుతుంది. దీంతో స్వామిజీ అరుందతికి గతం గుర్తుకు లేదు. ఆత్మగా వేరే శరీరంలోకి ప్రవేశించిన అరుంధతికి తన వాళ్లు ఎదురుగా ఉన్నా గతం గుర్తుకు రాదు. కానీ తనకు సంబంధిచిన వస్తువులను ముట్టుకుంటే మాత్రం గతజన్మ తాలుకు జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా ఆ అమ్మాయి తాళి ఎప్పుడైతే ముట్టుకుంటుందో అప్పుడు అన్ని విషయాలు గుర్తుకు వస్తాయి అని చెప్పి స్వామిజీ వెళ్లిపోతాడు. మనోహరి భయంతో వణికిపోతుంది.
గుడిలో అందరూ పూజ దగ్గర కూర్చుని ఉంటారు. పల్లకి మోస్తూ వస్తున్న ఒక వ్యక్తి కాలు జారి కింద పడతాడు. వెంటనే మిస్సమ్మ వెళ్లి పల్లకిలోని దేవుడి విగ్రమం కిందపడకుండా పట్టుకుంటుంది. మరోవైపు నుంచి అనామిక వచ్చి విగ్రహాన్ని పట్టుకుంటుంది. పూజారి వచ్చి మీరెంత అదృష్టవంతులో కదా..? ముల్లోకాలను మోసే స్వామి వారినే మీరు కింద పడకుండా పట్టుకున్నారు. అదే చేతితో మండపం దగ్గరకు తీసుకురండి అని చెప్పగానే అనామిక, మిస్సమ్మ దేవుడి విగ్రహాన్ని మోసుకుంటూ మంటపం వరకు తీసుకెళ్తారు. తర్వాత దేవుడి కళ్యాణం పూర్తి చేస్తారు. పూజ పూర్తి అయిన తర్వాత అనామికను తీసుకుని ఇంటికి బయలుదేరుతారు అమర్ వాళ్లు.
ఇంట్లో భయంతో కూర్చున్న మనోహరికి బయట కారు సౌండ్ వినబడుతుంది. వెంటనే బయటకు వచ్చి చూస్తుంది. కారులోంచి దిగుతున్న అనామికను చూసి ఎవరా అనుకుంటుంది. ఇంతలో అనామిక ముఖం కనిపించగానే మనోహరి షాక్ అవుతుంది. ఇంతలో దగ్గరకు వచ్చిన అనామికను అంజు, మనోహరికి పరిచయం చేస్తుంది. ఇద్దరి చేతులు కలుపుతుంది. మనోహరి అలాగే షాక్ లో ఉండిపోతుంది. అనామిక ఇంట్లోకి వెళ్లబోతూ గుమ్మం మీద చెయ్యి వేయగానే గత జన్మ గుర్తుకు వస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?