Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మను చంపడానికి వెళ్లిన మనోహరిని ఆరు ఆడ్డుకుంటుంది. గొంతు పట్టుకుని పైకి లేపి పట్టుకుంటుంది. మనోహరి గిలా గిలా కొట్టుకుంటుంది. ఆరు వదిలేయ్ ఆరు అంటూ బతిమాలుతుంది. ఆరు మాత్రం కోపంగా అలాగే పట్టుకుని చూస్తుంది. ఇంతలో గుప్త వచ్చి బాలిక వదిలేయ్ అని చెప్తాడు. అయినా ఆరు వినదు వదలదు. దీంతో గుప్త కోపంగా గట్టిగా వదిలేయ్ అని అరుస్తాడు. దీంతో ఆరు మనును వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మను అటూ ఇటూ చూస్తుంది అక్కడ మిస్సమ్మ కూడా ఉండదు. మరోవైపు రణవీర్ మనుషులు ఫంక్షన్‌లోకి వచ్చి అంజును వెతుకుతుంటారు.
బయటకు వచ్చిన ఆరు కోపంగా చూస్తుంటే.. గుప్త వచ్చి బాలిక ఏంటా ఆవేశం అని అడుగుతాడు. దీంతో ఆరు మరింత కోపంగా లేకపోతే ఏంటి గుప్త గారు.. నా కుటుంబం జోలికి వస్తుందా..? అందుకే దాన్ని చంపేద్దాం అనుకున్నాను.. అయినా అవును గుప్త గారు నాకు శక్తులు లేవు కదా మనును ఎలా పట్టుకోగలిగాను.. గుప్త గారు మిమ్మల్నే అడుగుతున్నాను.. నాకు శక్తులు వచ్చాయా..? అని అడుగుతుంది. దీంతో గుప్త అవును బాలిక.. నీకు శక్తులు వచ్చాయి అని చెప్పగానే ఎలా వచ్చాయి అని అడుగుతుంది ఆరు. నీ పిల్ల పిచ్చుక ఆ పూలు తీసుకెళ్లి నీ ఫోటో దగ్గర పెట్టింది అని గుప్త చెప్పగానే.. గుప్త గారు మీరు చెప్పేది నిజమేనా..? అని అడుగుతుంది. గుప్త నిజమే అంటూ చెప్పగానే.. అంజు అంటూ ఆరు ఎమోషనల్‌గా వెళ్లిపోతుంది. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటున్నావో.. లేక నీ కుటుంబమే నిన్ను కాపాడుకుంటుందో తెలియడం లేదు. అంతా జగన్నాథుడి లీల అని మనసులో అనుకుంటాడు గుప్త.
మరోవైపు అమర్, మిస్సమ్మ, రాథోడ్ టార్చి లైట్స్ వేసుకుని అంజును వెతుకుతుంటారు. రణవీర్ మనుషులు అంజుకోసం వెతుకుతుంటారు. అంజు ఎక్కడా కనిపించడదు. దీంతో మిస్సమ్మ ఏమైంది అంజు ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లి ఉంటుంది అని అడుగుతుంది. అమర్, రాథోడ్‌కు కాల్ చేసి పవర్ రావడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతాడు. సార్ ఇక్కడ వైర్లు అన్ని కట్ అయి పోయాయి అని చెప్తాడు. అమర్ అయితే ఉండు నేన వస్తున్నాను అంటూ అమర్ వెళ్తాడు. ఇంతలో కరెంట్ వస్తుంది. స్టేజీ మీద చిత్ర కనబడక వినోద్ కంగారు పడుతుంటాడు. ఇంతలో రాథోడ్ లోపలికి వస్తాడు. రాథోడ్ అంజు కనిపించిందా..? అని అడుగుతుంది. రాథోడ్ లేదు మిస్సమ్మ కనిపించలేదు అని చెప్పగానే.. మిస్సమ్మ గట్టిగా అంజు అని పిలుస్తుంది.
రాథోడ్ కూడా గట్టిగా అంజు అని పిలుస్తాడు. దీంతో అంజు రణవీర్ టేబుల్ కింద నుంచి పైకి లేస్తుంది. అంజును చూసిన రణవీర్ షాక్ అవుతాడు. ఇంతసేపు నేను వెతుకుతున్న అంజు నా టేబుల్ కిందే దాక్కుంది అనుకుంటాడు. అంజు దగ్గరకు వచ్చిన మిస్సమ్మ ఎక్కడికి వెళ్లిపోయావు అంజు ఎంత భయం వేసిందో తెలుసా..? అని అడుగుతుంది. ఇందాకా వాష్‌రూం కు వెళ్లి వస్తుంటే.. సడెన్‌గా కరెంట్ పోయింది. నీకు తెలుసు కదా నాకు కరెంట్ లేకపోతే భయం వేస్తుందని.. వెతుక్కుంటూ వచ్చి అక్కడ టేబుల్ కింద కూర్చున్నాను.. కరెంట్ పోయినప్పుడు భయం వేసింది మిస్సమ్మ అందుకే చెవులు మూసుకుని కూర్చున్నాను.. పాపం నా కోసం మీరు గట్టిగా అరిచి ఉంటారు కదా..? అని చెప్తుంది అంజు.
ఇంతలో వినోద్ వచ్చి చిత్ర కనిపించడం లేదు అంటూ అరుస్తాడు. అందరూ చిత్ర అని పిలుస్తుంటారు. ఇంతలో చిత్ర కంగారుగా వచ్చి వినోద్ ఇంతకుముందు కరెంట్ పోయినప్పుడు ఎవరో నన్ను లాక్కెళ్లి నా నగలు ఎత్తుకెళ్లారు అని చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. ఇంతలో అమర్ చిత్ర అంటూ వస్తాడు. అంత కంగారు పడకు చిత్ర ఆ నగలు ఎత్తుకోని వెళ్తున్నవాడు నాకు దొరికాడు అని చెప్తాడు. చిత్ర షాక్ అవుతుంది. నగలు కూడా సేఫ్‌గా ఉన్నాయి అంటూ మిస్సమ్మకు నగలు ఇస్తాడు. నాన్నా నీకేం కాలేదు కదా..? అని శివరాం అడుగుతాడు. ఏం కాలేదు నాన్నా అని చెప్తాడు అమర్. అందరూ కలిసి భోజనాలకు వెళ్తారు.
తర్వాత గార్డెన్‌లో ఆలోచిస్తూ కూర్చున్న గుప్త దగ్గరకు ఆరు డాన్స్ చేస్తూ వస్తుంది. గుప్త గారు మనం ఎలాగూ కొద్ది రోజులు ఇక్కడే ఉంటున్నాము కాబట్టి మనం మన శక్తులతో షాపింగ్ చేద్దామా అంటుంది. దీంతో గుప్త కోపంగా నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా..? అంటాడు. మీరు ఎక్కడ ఉన్నారో ముందు తెలుసుకోండి అని చెప్తాడు. ఇంతలో అమర్ బయటి నుంచి వచ్చి కారు దిగి గార్డెన్ వైపు చూస్తూ.. ఆరు ఐమిస్‌యూ ఆరు ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావని నా మనసు చెప్తుంది ఆరు ఎప్పటికీ ఇక్కడే ఉంటావా ఆరు. నా పక్కన నాకు తోడుగా ఉంటావా..? అంటూ ఎమోషనల్ అవుతుంటే ఆరు విని అమర్ దగ్గరకు వచ్చి హగ్ చేసుకుంటుంది. ఇంతలో లోపలి నుంచి వచ్చిన మిస్సమ్మ.. ఆరు, అమర్‌ను హగ్ చేసుకోవడం చూసి షాక్ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?